TELUGU

Bill Clinton Health: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆరోగ్యం విషమం, ఇప్పుడెలా ఉంది, మెడికల్ బుల్లెటిన్

Bill Clinton Health Status in Telugu: అగ్రరాజ్యం మాజీ అధక్షుడు బిల్ క్లింటన్ తీవ్ర అస్వస్థకు గురవడంతో హుటాహుటిన వాషింగ్టన్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. గత కొద్దికాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఒక్కసారిగా హెవీ ఫీవర్ రావడంతో ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చేర్చారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వాషింగ్టన్‌లోని మెడ్‌స్టార్ జార్జ్‌టౌన్ యూనివర్శిటీ ఆసుపత్రిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. 78 ఏళ్ల వయస్సులో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆయన తరపు అధికార ప్రతినిధి ఏంజెల్ యురేనా తెలిపారు. త్వరలో కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ పార్టీ నేతగా 1993 నుంచి 2001 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల కొద్దికాలంగా ఆయన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాదపడుతూ పలు సర్జరీలు చేయించుకున్నారు. నాలుగు సార్లు బైపాస్ సర్జరీ జరిగింది. లివర్ సర్జరీ జరిగింది. గుండెకు స్టంట్స్ అమర్చారు. అనారోగ్యం కారణంగా పూర్తిగా శాకాహారిగా మారిపోయారు. ఇటీవల బరువు కూడా గణనీయంగా తగ్గింది. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సైతం డెమోక్రట్ల తరపున ప్రచారం కూడా చేశారు. దీర్ఘకాలిక వ్యాధులు, మల్టీ ఆర్గాన్ సమస్యలున్నా బయట చురుగ్గానే ఉంటుంటారు. 2004లో నాలుగు సార్లు బైపాస్ సర్జరీ 2005లో ఊపిరితిత్తుల సర్జరీ 2010లో కొరోనరీ ఆర్టరీకు స్టంట్స్ 2021లో మూత్రనాళాల ఇన్‌ఫెక్షన్‌కు సర్జరీ Also read: Cyclone Alert: ఏపీకు తుపాను ముప్పు, ఈ జిల్లాల్లో ఇక భారీ వర్షాలు తప్పవు స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.