TELUGU

Pawan Kalyan: మూలాలు మర్చిపోకూడదు.. మెగా అభిమానులు అనేలాంటి పదాలు మేము మాట్లాడం... పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Pawan Kalyan speech at game Changer Pre release event: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తోందా సినిమా గేమ్ చేంజెర్. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానుంది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈరోజు సాయంత్రం.. ఆంధ్రప్రదేశ్ లో రంగ రంగ వైభవంగా జరిపారు చిత్ర యూనిట్. ఇక ఈ ఈవెంట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఈ క్రమంలో ఈ ఈవెంట్ లో.. పవన్ మాట్లాడిన మాటలు కొన్ని చర్చలకు దారితీస్తున్నాయి. ముందుగా పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నమస్కారాలు అందు పవన్ స్పీచ్ ని స్టార్ట్ చేయడంతో.. అభిమానులు తెగ విజిల్స్ వేశారు. ఇక పవన్ మాట్లాడుతూ..”మేము మెగా అభిమానులు లాంటి మాటలు ఎందుకు ఉపయోగించము అంటే.. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, అల్లు అర్జున్ గారి అభిమానులు, ప్రభాస్ గారి అభిమానులు, మహేష్ బాబు గారి అభిమానులు.. ఇలా ఎంతోమంది అభిమానులు ఇక్కడ ఉన్నారు. మా ఇంట్లో నాని గారిని ఇష్టపడే వారు కూడా ఉన్నారు. మా చెల్లెలకి నాని అంటే చాలా ఇష్టం.” అని చెప్పుకొచ్చారు. “తెలుగుజాతికి ఎంతో పేరు తెచ్చిన ఎన్.టి.రామారావు గురించి గుండెలోతుల్లో నుంచి మరిచిపోకూడదు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఉన్నా.. రామ్ చరణ్ ఉన్నా.. ఏ హీరో ఉన్నా కూడా.. దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు. మీరంతా ఓజీ అనొచ్చు, గేమ్ ఛేంజర్ అనొచ్చు.. కానీ ఎక్కడో మారుమూల మొగల్తూరు అనే కుగ్రామం నుంచి.. చిరంజీవి అనే వ్యక్తి రావడం వల్లే మేము ఈరోజు..ఇక్కడ ఇలా ఉన్నాం. మీరు పవన్ కళ్యాణ్ అని అరుస్తున్నా.. ఓజీ అని అరుస్తున్న.. డిప్యూటీ సీఎం అని అన్నా కూడా.. ఏదైనా ఆద్యుడు ఆయనే.. మెగాస్టార్ చిరంజీవి,” అని అన్నారు. నేను ఎప్పుడూ మన మూలాలను మర్చిపోను. తెలుగు చిత్రపరిశ్రమ ఇక్కడికి వచ్చిందంటే.. అది రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు లాంటి వారి శ్రమ వల్ల మాత్రమే. వాళ్లందరికీ ఒక నటుడుగానే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఇక్కడ రాజమండ్రిలో ఈవెంట్ జరుపుతున్నాము అంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి సపోర్ట్ వల్లే ఇది జరిగింది. హోం మినిస్టర్ అనిత గారికి ధన్యవాదాలు. డీజీపీ, ఎస్పీ, కలెక్టర్‌గారికి.. అందరికీ కూడా పేరుపేరునా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అసలు నేను నటుడ్ని అవుతానో లేదో కూడా తెలియదు. అలాంటి టైంలో శంకర్ గారి సినిమా టికెట్లు బ్లాక్‌లో కొనుక్కుని వెళ్లాను. ఆయన చాలా మంచి సోషల్ మెసేజ్లు ఉన్న సినిమాలు తీస్తారు. నా దగ్గర డబ్బులు లేని సందర్భంలో దిల్ రాజు వకీల్ సాబ్ తీశారు. ఈరోజు జనసేన పార్టీ నడపించడానికి ఇంధనంగా పనిచేసింది నాకు వకీల్ సాబ్ సినిమా. ఆ సినిమా నిర్మాత దిల్ రాజు గారు. ఆయనకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు’” అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. Read more: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ సహా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.