TELUGU

Daaku Maharaaj Theatrical Trailer Talk:‘డాకు మహారాజ్’ ట్రైలర్ టాక్.. బాలయ్య అభిమానులకు మాస్ పూనకాలే..

Daaku Maharaaj Theatrical Trailer Talk Review: బాలయ్య..తన కెరీర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అంతేకాదు ఎన్నడు లేటనట్టుగా హాట్రిక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు నట సింహం. అంతేకాదు ఎమ్మెల్యేగా హాట్రిక్ విజయాలతో దూకుడు మీదున్నారు. ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ మూవీతో పలకరించబోతున్నారు. ప్రెజెంట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరుగుతోంది. అక్కడ ఈ సినిమా ట్రైలర్ ను భారత కాలమానం 8.39 నిమిషాలకు విడుదల చేసారు. ఇప్పటికే టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయనే చెప్పాలి. బాలయ్య అభిమానులు కోరుకునే అంశాలతో బాబీ ఈ సినిమాను తెరకెక్కించాడు. ట్రైలర్ కూడా బాగానే కట్ చేసారు. అనగనగా ఒక రాజు ఉండేవాడు. చెడ్డ వాళ్లంత ఆయన్ని డాకు అనేవారు. మంచి వాళ్లు మాత్రం మహారాజ్ అని పిలిచేవారని ఒక పాప ఫ్లాష్ బ్యాక్ చెబుతున్నట్టుగా ఈ ట్రైలర్ ను స్టార్ట్ చేశారు. పూర్తిగా రాజస్థాన్ ఎడారిలో ఈ సినిమాను పిక్చరైజ్ చేసిన యాక్షన్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మరోవైపు ఈ సినిమాలో బాలయ్య.. డాకు మహారాజ్ గా.. సీతారామ్, నానాజీ గా మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్టు చూపించారు. ఒకరే ముగ్గురుగా నటించారా.. లేకపోతే.. త్రిపాత్రాభినయమా అనేది చూడాలి. ఈ సినిమాలో పాప సెంటిమెంట్ కూడా చూపించారు. The HUNT begins... and it’s going to be WILD! 🪓🔥 #DaakuMaharaajTrailer OUT NOW! 💥 - Get ready for the SANKRANTHI MASSACRE on JAN 12, 2025! ❤️‍🔥 #DaakuMaharaaj 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna @thedeol @dirbobby @MusicThaman @Vamsi84 … pic.twitter.com/bVdZKtA8vR — Sithara Entertainments (@SitharaEnts) January 5, 2025 పూర్తిగా సమరసింహారెడ్డి తరహాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉన్నట్టు కనిపిస్తోంది. మరోవైపు హీరోకు ధీటైన విలన్ పాత్రలో బాబీ దేవోల్ నటించాడు. మరోవైపు సినిమాలో కామెడీ సీన్స్ కూడా ఉన్నట్టు చూపించాడు. మొత్తంగా ఈ సంక్రాంతి అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకునేలా ఈ ట్రైలర్ ఉంది. ఈ సినిమాకు సంబంధించిన మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 9న అనంతపురంలో నిర్వహించనున్నారు. ఈ సినిమా వచ్చే ఆదివారం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నందమూరి బాలకృష్ణ విషయానికొస్తే.. 2024లో ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. 2025లో ‘డాకు మహారాజ్’ సంక్రాంతి పండక్కి సందడి చేయనున్నారు. మరోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ శివ తాండవం’ సినిమా దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు తెలుగులో సీనియర్ అగ్ర కథానాయకుల్లో ఈ రేంజ్ లో హాట్రిక్ హిట్స్ అందుకున్న వారు ఎవరు లేరు అది కూడా 60 ప్లస్ ఏజ్ లో టాప్ గేర్ లో దూసుకుపోతున్నారు బాలయ్య. వరుసగా సీనియర్ హీరోల్లో రూ. 100 కోట్ల గ్రాస్ అందుకున్న హీరోగా రికార్డు క్రియేట్ చేసారు. మరి‘డాకూ మహారాజ్’ చిత్రంతో డబుల్ హాట్రిక్ కు పునాది వేస్తారా లేదా అనేది వెయిట్ అండ్ సీ. ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు.. ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.