TELUGU

PMSBY Details: చిన్న చాక్లెట్‌ ఖర్చుతో రూ.4 లక్షల బీమా.. ఆదమరిస్తే కుటుంబం రోడ్డుపాలు

PMSBY Scheme Details: రూ.20 ప్రీమియం కడితే రూ.2 లక్షలు జీవిత బీమా.. రూ.450-500తో మరో రూ.2 లక్షలు ప్రయోజనం లభిస్తుంది. అయితే ఒక్క సంతకం చేయకుండా ఉంటే మాత్రం ఆ బీమా రద్దవడమే కాకుండా రేపొద్దున మీకు ఏమైనా జరిగితే మీ కుటుంబం రోడ్డు పాలయ్యే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ప్రయోజనాలు తెలుసుకోండి. మీ కుటుంబ సంరక్షణ కోసం అందిస్తున్న బీమా పథకం వివరాలు తెలుసుకోండి. Also Read: Biren Singh: '2024 దరిద్రంగా పరిపాలన చేశా.. నన్ను క్షమించండి' ప్రజలకు సీఎం విజ్ఞప్తి మీకు బ్యాంకులో పొదుపు ఖాతా ఉందా? అయితే మీకు రెండు జీవిత బీమా పథకాలు అమలవుతున్నాయా? కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రెండు రకాల సామాజిక భద్రత జీవిత బీమా పథకాలపై సాధారణ ప్రజలకు అవగాహన కల్పించుకోవాలి. బ్యాంకులో పొదుపు ఖాతా ఉన్న ప్రతి వినియోగదారుడి నుంచి ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన’ (పీఎంఎస్‌బీవై) కింద కేవలం రూ.20 చొప్పున ప్రీమియం చెల్లిస్తే రూ.2 లక్షల విలువైన జీవిత బీమా కల్పిస్తున్నారు. జీవిత బీమా పరిహారం కింద రూ.2 లక్షలు చెల్లిస్తారు. Also Read: New Year Prabhas: న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్‌కు డార్లింగ్ ప్రభాస్ వీడియో సందేశం తెలంగాణలోని మొత్తం 6,520 బ్యాంకు శాఖల్లోని 174.71 లక్షల మందికి ఈ పథకం కింద ప్రీమియం వసూలు చేస్తున్నట్లు బ్యాంకులు తాజాగా కేంద్రానికి నివేదించాయి. ఏడాదికోసారి ప్రీమియం సొమ్ము రూ.20ని తన ఖాతా నుంచి మినహాయించుకోవాలని ఖాతాదారుడు బ్యాంకుకు రాతపూర్వకంగా సంతకం చేసి విజ్ఞప్తి చేయాలి. లేకపోతే ప్రీమియం మినహాయింపు.. బీమా ఆగిపోతున్నాయి. ఖాతాదారులు తమ బ్యాంకులో ఈ పథకం వివరాలు అడిగి.. క్రమం తప్పకుండా కొనసాగిస్తే ప్రయోజనకరం. బీమా పరిహారం సహజంగా లేదా మరే ఇతర కారణంతో ఖాతాదారుడు మరణించినా రూ.2 లక్షలు పరిహారంగా ఇచ్చేందుకు ‘ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన’ను కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనికి ఏటా చెల్లించాల్సిన ప్రీమియం బ్యాంకును బట్టి రూ.450 నుంచి రూ.500 వరకూ చెల్లించాల్సి ఉంది. నిరుపేదలు, దిగువ మధ్య తరగతి కుటుంబ యజమానులు కన్నుమూసిన సందర్భాల్లో.. ఆ కుటుంబాలకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ రెండు పథకాలను కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు సూచనలు చేసింది. పేదలకు వరం ఖాతాదారుడు కన్నుమూస్తే వెంటనే జీవిత బీమా పరిహారం కింద ఈ రెండు పథకాల నుంచి రూ.4 లక్షలు వేగంగా చెల్లించనున్నారు. ఎలాంటి డిపాజిట్‌ తీసుకోకుండా జీరో బ్యాలెన్స్‌తో పేదల కోసం తెరిచే జన్‌ధన్‌ యోజన బ్యాంకు ఖాతాలున్న అందరికీ అవగాహన కల్పించి ప్రీమియం వసూలు చేస్తారు. ఉపాధి హామీ, పీఎం ఉజ్వల, పీఎం కిసాన్‌ వంటి పథకాల లబ్ధిదారులతో పాటు స్వయం సహాయక మహిళా సంఘాల వారికి ఈ జీవిత బీమా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.