TELUGU

Viral Video: ఓయమ్మనే.. కమ్మని పిజ్జాలో బైటపడ్డ పదునైన కత్తిముక్క.. షాకింగ్ వీడియో వైరల్..

Broken knife found in Pizza video viral: సాధారణంగా చాలా మంది హోటల్స్, రెస్టారెంట్ లకు వెళ్తుంటారు. ముఖ్యంగా వీకెండ్ లు, ఏదైన ఫెస్టివల్స్ వచ్చినప్పుడు సరదాగా గడిపేందుకు హోటల్స్ లకు వెళ్తుంటారు. మరికొందరు ఆన్ లైన్ లలో తమకు కావాల్సిన ఫుడ్ లను ఆర్డర్ పెట్టుకుంటారు. అయితే.. ఇటీవల హోటల్స్ ఫుడ్ లలో బొద్దింకలు, పాములు, జెర్రీలు, కప్పలు బైట పడుతున్నాయి. అదే విధంగా ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ లలో సైతం.. వెరైటీగా ఏవో చనిపోయిన జీవుల అవశేషాలు వస్తున్నాయి. దీంతో కస్టమర్లు మాత్రం.. ఈ ఘటనలతో హోటల్స్, రెస్టారెంట్లలో తిందామంటే.. భయంతో వణికి పోతున్నారు. అసలు.. బైట తినడం అవసరమా.. అంటూ కూడా ఆలోచిస్తున్నారంట. ఈ క్రమంలో ప్రస్తుతం.. మహారాష్ట్రలో జరిగిన సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. #BREAKING : A shocking discovery in Bhosari, Pune where a customer found a broken piece of a pizza-cutting knife inside a Domino's pizza. ⚠️don’t eat any kind of #pizza which own Indian pic.twitter.com/BQxlrJKTso — Sujon Ahmed (@SAexploring) January 5, 2025 మహారాష్ట్రలోని పూణెలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి డొమినోస్ పిజ్జా నుంచి మంచి టెస్టీ పిజ్జా ఆర్డర్ చేసుకున్నాడు. అయితే.. అతను తన పిజ్జాను తినడం స్టార్ట్ చేశాడు. ఇంతలో నోటిలో ఏదో పళ్ల కింద పదునైన వస్తువు తగిలినట్లు అన్పించినట్లు ఉంది. వెంటనే అదేంటా అని తీసి చూశాడు . ఆ తర్వాత బిత్తర పోయాడు. అతని చేతిలో పదునైన చిన్న కత్తి ఉంది. వెంటనే డోమినోస్ వాళ్లకుఫోన్ లు చేసిన ఇలా జరిగిందని చెబితే... అదేంలేదని కొట్టిపారేసినట్లు తెలుస్తొంది . ఆ తర్వాత బాధితుడు వీడియో, ఫోటో పంపించగానే.. దెబ్బకు డోమినోస్ సిబ్బంది దిగొచ్చినట్లు తెలుస్తొంది. Read more: Viral Video: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. ఈ తల్లికి మదర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఇవ్వాల్సిందే.. ఎందుకో ఈ వీడియో చూసేయండి.. దీనిపై చర్యలు తీసుకొవాలని కూడా.. బాధితులు ఒక వీడియో రిలీజ్ చేసి సోషల్ మీడియాలో ఫుడ్ సెఫ్టీ అధికారుల్ని కోరినట్లుు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ అవుతున్నారంట. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook , Twitter None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.