TELUGU

MS Dhoni Yuvraj Singh Clashes: యువరాజ్ సింగ్, ధోని మధ్య చిచ్చు పెట్టిన ఆ బాలీవుడ్ భామ.. ఆ ఇద్దరు ఎందుకు విడిపోయారంటే..!

MS Dhoni Vs Yuvraj Singh: టీమిండియాకు ఆడిన సమయంలో ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్ ఫ్రెండ్‌షిప్ ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరు కలిసి ఎన్నో మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించారు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్‌లలో ధోనీ సారథ్యంలో యువరాజ్ సింగ్ అద్భుతంగా చెలరేగి ఆడాడు. ఎంతో క్లోజ్‌గా ఉండే వీళ్లద్దరు మధ్య ఓ బాలీవుడ్ భామ కారణంగా మనస్పర్థలు వచ్చాయని తెలుసా. అప్పట్లో ఈ న్యూస్ ఓ సెన్సేషన్. 2007 ప్రపంచకప్‌ తరువాత యువరాజ్ సింగ్, ధోనీ ముఖాముఖి ఎదురుపడేందుకు కూడా ఇష్టపడలేదు. ఇద్దరు ఒకే టీమ్‌లో ఉన్నా.. మైదానం బయట మాత్రం మాట్లాడుకోవడం మానేశారు. యువరాజ్ సింగ్‌, ధోనీ మధ్య వాగ్వాదానికి కారణం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె అని చెబుతారు. Also Read: Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరద నీరు.. అంచనాలకు మించిన ప్రవాహాం.. 2007 వరల్డ్ కప్ విజయంతో ఎంఎస్ ధోనీలో నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. అన్ని ఫార్మాట్లాలోనూ నెమ్మదిగా ఎదిగాడు. మరోవైపు ఈ సమయంలోనే బాలీవుడ్ నటి దీపికా పదుకొణెతో డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు జోరుగా వచ్చాయి. దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ సినిమా ప్రమోషన్ ధోనీ షారుఖ్‌తో మాట్లాడినట్లు తెలిసింది. ఓ ఫంక్షన్‌లో దీపికా పదుకొణె డ్యాన్స్ కార్యక్రమానికి ధోనీ, యువరాజ్ సింగ్ కలిసివెళ్లారు. ఆమె డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఇద్దరు గుసగుసలాడుతూ.. ఆటపట్టిస్తూ నవ్వుకుంటున్న వీడియో కూడా వైరల్ అయింది. అయితే ఆ తరువాత ధోనికి బ్రేకప్ చెప్పేసిన దీపికా పదుకొణె.. ఆకస్మత్తుగా యువరాజ్ సింగ్‌తో డేటింగ్ మొదలుపెట్టింది. దీంతో యువరాజ్ సింగ్‌పై ధోనీకి కోపం పెరిగిపోయింది. అప్పటి నుంచి యువరాజ్ సింగ్‌ దూరం పెట్టడం ప్రారంభించాడు. ఓ ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ గురించి మాట్లాడుతూ.. తాను యూవీ, ఒకే జట్టులో క్రికెట్ ఆడుతామని, కానీ చిన్ననాటి స్నేహితులం కాదన్నాడు. ధోనీ తాను క్లోజ్ ఫ్రెండ్స్ కాదని యూవీ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 2011 ప్రపంచకప్ తర్వాత యువరాజ్ సింగ్‌ను పూర్తిగా ధోనీ పూర్తిగా జట్టుకు దూరం పెట్టేశాడు. యువీ ఫామ్ కోల్పోవడం కూడా ఓ కారణమైంది. ఇటు యువీ-దీపికా పదుకొణె రిలేషన్‌షిప్ కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. యువరాజ్ వైఖరి తనకు నచ్చలేదని దీపికా ఓపెన్‌గా చెప్పేసింది. యువీ చాలా పొసెసివ్‌గా ఉంటాడని.. తన యాక్టింగ్‌కు ఆటంకం కలిగిస్తున్నాడని చెప్పింది. అది తనకు నచ్చలేదంటూ దూరం పెట్టేసింది. ఆ తరువాత యువరాజ్ సింగ్ టీమ్‌లోకి వచ్చినా.. మునుపటి ప్రదర్శన చేయలేకపోయాడు. టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన యువీ.. కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు. దీపికా పదుకొణె కారణంగా ధోనీ, యువరాజ్ సింగ్‌ల మధ్య ఏర్పడిన ఆ దూరం ఇప్పటికీ అలానే ఉండిపోయింది. Also Read: Hyderabad: బాబోయ్.. కండక్టర్ పై కోపంతో బ్యాగ్ లోని పామును విసిరిన వృద్ధురాలు .. వీడియో వైరల్.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.