Ind Vs AUS 3rd Test Day 4 Highlights: హుఫ్.. టీమిండియా గట్టెక్కింది. ఓటమి నుంచి కాదండోయ్. ఫాలో ఆన్ గండం నుంచి.. గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఓ వైపు వరుణుడు మ్యాచ్‌కు అడ్డు తగులుతున్నా.. దొరికిన కాసింత టైమ్‌లోనే భారత బ్యాట్స్‌మెన్ భరతం పట్టారు ఆసీస్ బౌలర్లు. స్టార్ బ్యాట్స్‌మెన్ అంతా పెవిలియన్‌కు క్యూ కట్టిన వేళ.. ఇక టీమిండియా ఫాలో ఆన్ ఆడాల్సిందే అని అందరూ అనుకున్న తరుణంలో ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా పట్టుదలతో ఆడారు. చివరి వికెట్‌కు ఒక్కొ పరుగు జోడించుకుంటూ వెళ్లి.. భారత్‌కు ఫాలో ఆన్ గండం తప్పించారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఆకాశ్ దీప్ (27), బుమ్రా (10) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు చివరి వికెట్‌కు అజేయంగా 39 పరుగులు జోడించారు. Also Read: Diamond Snake Video: వావ్.. మైండ్ బ్లోయింగ్.. డైమండ్ స్నేక్.. ఎప్పుడైన చూశారా..?... వీడియో ఇదే.. ప్రస్తుతం ఆసీస్ 193 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఐదోరోజు ఆసీస్ బౌలర్లు సాధ్యమైనంత త్వరగా ఈ జోడి విడదీసి.. వేగంగా బ్యాటింగ్ ఆడే అవకాశం ఉంది. భారత్ ముందు ఊరించే లక్ష్యాన్ని ఉంచి బ్యాటింగ్‌కు ఆహ్వానించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు వరుణుడు సహకరిస్తే.. మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా సాగనుంది. భారత బ్యాట్స్‌మెన్‌కు అగ్నిపరీక్షగా మారనుంది. రేపు గట్టిగా పోరాడితే.. డ్రా చేసుకోవచ్చు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోతే.. డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు కూడా గల్లంతవుతాయి. ఓవర్‌నైట్ 51-4 రన్స్‌తో నాలుగో రోజు ఆట ఆరంభించిన టీమిండియాకు కమిన్స్ బిగ్ షాకిచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (10)ను పెవిలియన్‌కు పంపించి బ్రేక్ ఇచ్చాడు. అయితే ఆ తరువాత కేఎల్ రాహుల్ (84), రవీంద్ర జడేజా (77) దూకుడుగా బ్యాటింగ్ ఆడడంతో కాస్త కోలుకున్నట్లే కనిపించింది. సెంచరీ దిశగా దూసుకువెళుతున్న కేఎల్ రాహుల్.. నాథన్ లైయన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. నితీశ్ కుమార్ రెడ్డి (16) సహకారంతో జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మించాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. అనంతరం నితీశ్ రెడ్డిని కమిన్స్ బౌల్డ్ చేయగా.. కాసేపటికే జడేజా కూడా పెవిలియన్‌కు చేరిపోయాడు. దీంతో టీమిండియాకు ఫాలో ఆన్ తప్పదకున్న వేళ.. జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ గొప్పగా పోరాడారు. ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. భారత్‌ను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించడంతోపాటు నాలుగో రోజు ఆలౌట్ కాకుండా కాపాడారు. కంగారు బౌలర్లలో కెప్టెన్ కమిన్స్ నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టాడు. హేజిల్‌వుడ్, నాథన్ లయన్‌కు చెరో వికెట్ దక్కింది. Also Read: Allu Arjun: అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. బెయిల్ ఆర్డర్ రద్దుకు మరో పిటిషన్..?.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook , Twitter None
Popular Tags:
Share This Post:
China Virus: చైనా వైరస్ తో డేంజర్ బెల్స్.. దేశంలో ఐదు కేసులు..
- by Sarkai Info
- January 7, 2025
Brahmamudi: మాయ చేసిన కావ్య.. కంగుతిన్న అనామిక, రాజ్ చేతిలో అసలైన బంగారు కిరీటం..
January 7, 2025What’s New
Spotlight
Today’s Hot
Featured News
Latest From This Week
HMPV New Cases In Chennai: ఇద్దరు చిన్నారులకు సోకిన చైనా వైరస్.. భయాందోళనలో ప్రజలు..!
TELUGU
- by Sarkai Info
- January 6, 2025
Vishal Health: తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో ప్రముఖ హీరో విశాల్.. అసలు ఏం జరిగింది?
TELUGU
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.