Pawan Kalyan Hot Comments on Revanth Jagan on Game Changer Pre Release Event:పవన్ కళ్యాణ్ రాజకీయంగా రాటు దేలిపోయారు. ఎపుడు ఎవరికీ ఎలా కౌంటర్ ఇవ్వాలో పవన్ కళ్యాన్ అదును చూసి తన మాటలతో రాజకీయ ప్రత్యర్ధులను రఫ్పాడించేస్తున్నారు. ఈ సందర్బంగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక ఆయన మాటలు సినీ, రాజకీయాలను కుదుపేస్తున్నాయి. సినిమాలు తీసే వారినే సినీ పరిశ్రమకు చెందిన వారిగా కూటమి ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. వారితోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాట్లాడుతుందన్నారు. గత ప్రభుత్వంలా సినిమా హీరోలు నాకు నమస్కారం పెట్టాలి అనుకునే లో లెవెల్ వ్యక్తిని నేను కాదు అంటూ ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రస్తుత తెలంగాణ రేవంత్ రెడ్డికి గట్టిగానే ఇచ్చిపడేసారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తీరును ఇండైరెక్ట్ గా తప్పు పట్టారు. మన ఎంత స్థాయికి వచ్చినా.. మన మూలాలు మరిచిపోకూడదన్నారు. అందరి హీరోలకూ అభిమానులు ఉన్నారు. ఒక హీరోను ద్వేషించే సంస్కృతి మా ఫ్యామిలీకి కాదన్నారు. ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలతో ఈ వేడుకకు రావాలా వద్దా అని ఆలోచించాను. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు అద్దడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదన్నారు. చిత్ర పరిశ్రమ పై ఎన్డియే ప్రభుత్వానికి గౌరవం ఉందన్నారు. గత ప్రభుత్వం మాదిరి టిక్కట్ల ధరల పెంపు కోసం హీరోల మా దగ్గరకు రావాలని పిలవం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చిత్ర పరిశ్రమ అభివృద్ధికే దోహదపడ్డారనే విషయాన్ని ప్రస్తావించారు. రాంచరణ్ మూలాలను మరచిపోకుండా గ్లోబల్ లెవల్లో ఎదిగిన విషయాన్ని ప్రస్తావించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎల్లపుడు అండ గా ఉంటుందన్నారు. మేము స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ నుంచి చాలా నేర్చుకున్నామన్నారు. ఆయన్ని ఎంత మంది విమర్శించినా కలసి నటించేప్పుడు బాగున్నారా అని గుండె నిండుగా పలుకరించేవారుఎన్టీఆర్ గారి ప్రభుత్వం ఉన్నపుడు కృష్ణ లాంటి సీనియర్ హీరో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఎప్పుడూ ఇతర హీరోల మీద వివక్ష చూపలేదు. చిత్ర పరిశ్రమ తాలూకు ఔన్నత్యం అది. దాన్ని మేము కొనసాగిస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారు చిత్ర పరిశ్రమను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. గత ప్రభుత్వంలో మాదిరి మీరంతా అభిమానించే మెగాస్టార్ చిరంజీవి బాహుబలి ప్రభాస్, మహేష్ బాబు లాంటి వారిని మేము పిలవమన్నారు. మాకు చిత్ర పరిశ్రమ మీద గౌరవం ఉంది. చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఎప్పుడూ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి దోహదపడ్డారే తప్ప కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు.. ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None
Popular Tags:
Share This Post:
China Virus: చైనా వైరస్ తో డేంజర్ బెల్స్.. దేశంలో ఐదు కేసులు..
- by Sarkai Info
- January 7, 2025
Brahmamudi: మాయ చేసిన కావ్య.. కంగుతిన్న అనామిక, రాజ్ చేతిలో అసలైన బంగారు కిరీటం..
January 7, 2025What’s New
Spotlight
Today’s Hot
Featured News
Latest From This Week
HMPV New Cases In Chennai: ఇద్దరు చిన్నారులకు సోకిన చైనా వైరస్.. భయాందోళనలో ప్రజలు..!
TELUGU
- by Sarkai Info
- January 6, 2025
Vishal Health: తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో ప్రముఖ హీరో విశాల్.. అసలు ఏం జరిగింది?
TELUGU
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.