TELUGU

Russian cancer vaccine: క్యాన్సర్ పేషంట్లకు గుడ్ న్యూస్.. క్యాన్సర్ టీ కాను తయారు చేసినట్లు అధికారికంగా ప్రకటించిన రష్యా

Russian cancer vaccine: నేడు ప్రపంచం మొత్తం క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులతో అల్లాడిపోతోంది. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రపంచాన్ని శరవేగంగా కబలిస్తున్న ఈ మహమ్మారి ఇటీవలి కాలంలో వయస్సు తారతమ్యం లేకుండా అందరూ దాని బారినపడుతూనే ఉన్నారు. ప్రతిఏటా దాదాపు కోటి మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకసారి సోకిందంటే దీని నుంచి బయటపడటం చాలా కష్టం. చికిత్స తీసుకుంటూనే మరెన్నో జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. చికిత్స కూడా అంత ఈజీ కాదు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చాల్సి వస్తుంది. తగ్గినట్లు అనిపించినా..మళ్లీ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ తరుణంలో రష్యా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. క్యాన్సర్ కు టీకాను తయారు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మందికి ఉపశమనం కల్పించే వార్త అవుతుంది. పౌరులందరికీ ఉచితంగా అందుబాటులో ఉండే క్యాన్సర్ వ్యాక్సిన్‌ను రూపొందించినట్లు రష్యా తెలిపింది. సోమవారం (డిసెంబర్ 16), రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది. ఇది రష్యాలోని క్యాన్సర్ రోగులకు 2025 ప్రారంభం నుండి ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. రష్యన్ ప్రభుత్వ యాజమాన్యంలోని వార్తా సంస్థ TASS ప్రకారం, రష్యన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ జనరల్ డైరెక్టర్ ఆండ్రీ కప్రిన్ ఈ టీకా గురించి రష్యన్ రేడియో ఛానెల్‌లో సమాచారం అందించారు. Also Read: Legal Documents: సిటీలో మంచి ప్రాపర్టీ కొనాలంటే ఏ డాక్యుమెంట్స్‌ ఉండాలి? అందరూ తప్పక తెలుసుకోవాల్సిన మేటర్! మాస్కోలోని గమలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ గతంలో TASSతో మాట్లాడారు. వ్యాక్సిన్ కణితి పెరుగుదలను నిరోధించగలదని.. క్యాన్సర్ వ్యాప్తి చెందకుండా ఈ టీకా నిరోధిస్తుందని తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ను క్యాన్సర్‌ను నివారించడానికి సాధారణ ప్రజలకు కాకుండా క్యాన్సర్ రోగులకు చికిత్స చేయడానికి ఉపయోపడుతుందని తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ని అన్ని రకాల క్యాన్సర్‌ పేషెంట్లకు ఇవ్వవచ్చు అని వెల్లడించారు. రష్యన్ నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియోలాజికల్ సెంటర్, గమలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్‌తో సహా ఇతర దేశాలు కూడా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి పోటీ పడుతున్నాయి. ఈ ప్రకటనను కూడా ధ్రువీకరించాయి. వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో స్పష్టం చేసింది. టీకా ఎలాంటి క్యాన్సర్ కు పనిచేస్తుంది..ఎలాంటి ప్రభావం చూపుతుంది..వ్యాక్సిన్ పేరు ఏంటనేది మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే క్యాన్సర్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి కొన్ని రకాల వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడం శాస్త్రీయంగా సాధ్యమే. ఇతర దేశాలు కూడా ప్రస్తుతం ఇలాంటి అభివృద్ధిపై కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. Also Read: Hyderabad Real Estate: హైదరాబాద్‎లో ఇల్లు కావాలంటే..ఈ ప్రాంతాల్లో చాలా చౌక.. అద్దెను ఈఎంఐగా చెల్లిస్తే చాలు ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న క్యాన్సర్ వ్యాక్సిన్‌లు 2023లో లండన్ లో అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు క్యాన్సర్ చికిత్సలను అభివృద్ధి చేయడానికి జర్మన్ బయోటెక్నాలజీ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఫార్మాస్యూటికల్ కంపెనీలు మోడెర్నా, మెర్క్ & కంపెనీ ప్రస్తుతం చర్మ క్యాన్సర్ వ్యాక్సిన్‌లపై పనిచేస్తున్నాయి. గర్భాశయ క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయపడే హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV)కి వ్యతిరేకంగా వ్యాక్సిన్‌లు వంటి క్యాన్సర్‌ను నిరోధించే లక్ష్యంతో ఇప్పటికే మార్కెట్లో ఈ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.