TELUGU

Indian Army in Lebanon: పశ్చిమాసియాలో భారత సైనికులు...భూతల దాడుల్లోనూ అక్కడే విధులు

900 Indian UN Peacekeepers in Lebanon: ఓవైపు ఇజ్రాయిల్ లెబనాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈసమయంలో దాదాపు 900 మంది భారతీయ సైనికులు అక్కడ విధుల్లో ఉన్నారు. భారతీయ సైనికులు ఎవరి వైపు నుంచి పోరాటం చేస్తున్నారు అనే సందేహం మీకు కలగవచ్చు. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మన సైనికులు భారత సైన్యం తరపున ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళంలో వీరంతా విధులు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళంలో వివిధ దేశాలకు చెందిన సైనికులు ఆయా దేశాల్లో శాంతిని పరిరక్షించడానికి విధులు సైనిక విధుల్లో ఉంటారు అందులో భాగంగా భారత్ తరఫు నుంచి 900 మంది సైనికులు ఇజ్రాయిల్ 11 సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నట్లు సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ మాజీ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణలో భాగంగా ఇజ్రాయిల్ సరిహద్దుల్లో సుమారు 120 కిలోమీటర్ల వెంబడి సరిహద్దుల్లో హింస చెలరేగకుండా జాగ్రత్త పరుస్తున్నారు. సాధారణంగా ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతా దళాలు ప్రపంచంలోని అత్యంత సున్నితమైన ప్రదేశాల్లో తమ ఆయా దేశాల్లో శాంతిని కాపాడేందుకు విధులు నిర్వహిస్తారు. ఇప్పుడు ఇజ్రాయిల్ లెబనాన్ సరిహద్దుల్లో భారత సైనికులను మొహరించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ఐక్యరాజ్యసమితి ప్రయత్నం చేస్తోంది. Also Read : Internship Scheme 2024 : నేటి నుంచి పీఎం ఇంటర్న్ షిప్ స్కీం షురూ ..టాప్ కంపెనీల్లో ఇంటర్న్..ప్రతినెలా రూ.5,000 అలెవెన్స్ ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళం ఎక్కువగా సామాన్య ప్రజలను యుద్ధం బారిన పడకుండా కాపాడడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఇరుదేశాలకు చెందిన సామాన్య ప్రజలను కల్లోలిత ప్రాంతాల నుంచి దూరంగా తీసుకువెళ్లడం, వారిని సురక్షిత స్థావరాలు లో ఉంచడము మెరుగైన వసతి సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం అదేవిధంగా యుద్ధంతో సంబంధం లేని వారిపైన దాడులు జరగకుండా చేయడము వంటి విధులను నిర్వర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో భారత సైన్యంతో పాటు ఇతర దేశాలకు చెందినటువంటి సైన్యం కూడా ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళంలో తమ విధులను నిర్వర్తిస్తుంది. ఇదిలా ఉంటే పచ్చిమాసియాలో తలెత్తిన వివాదం నేపథ్యంలో భారత్ తన వైఖరిని తటస్థంగానే ఉంచింది ఇప్పటివరకు ఇరుపక్షాల్లో ఎవరికీ కూడా తమ మద్దతును తెలపలేదు. అటు ఇరాన్ కూడా ఇజ్రాయిల్ పైన దాడులు చేస్తున్న నేపథ్యంలో భారత విదేశాంగ విధానం ప్రకారం ఇరు దేశాలతోనూ సమాన మైత్రిని కొనసాగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ లోని చా బహార్ పోర్టు భారత చమురు అవసరాలకు అత్యంత కీలకమైనది మరోవైపు ఇజ్రాయిల్ దేశంతో మన దేశం అనేక రక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా భారతదేశం ప్రచ్చన్న యుద్ధం కాలం నుంచి కూడా అలీన విధానాన్ని అవలంబిస్తున్న సంగతి తెలిసిందే. Also Read : Money Tips: పావు ఎకరం ఉంటే చాలు.. ఏడాది రూ. 10లక్షలు వెనకేసుకోవచ్చు..ఏం చేయాలంటే? స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.