TELUGU

Paris Olympics 2024: భారత్‌కు ఐదో కాంస్యం.. రెజ్లింగ్‌లో అమన్‌ సెహ్రవత్‌కు మెడల్‌

Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ విభాగంలో భారత్‌కు ఊరిస్తున్న పతకం దక్కింది. మహిళల విభాగంలో వినేశ్‌ ఫొగట్‌తో తృటిలో పతకం చేజారిన వేళ పురుషుల విభాగంలో భారత్‌కు తొలి మెడల్‌ లభించింది. 57 కిలోల పురుషుల విభాగంలో జరిగిన కాంస్య పోరులో ప్యూర్టోరికా రెజ్లర్‌ డారియన్‌పై 13-5 తేడాతో అమన్‌ విజయం సాధించాడు. ఆరంభం నుంచి ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన అమన్‌ సంచలన విజయం సాధించాడు. ఈ పతకంతో భారత్‌ ఖాతాలో చేరిన పతకాల సంఖ్య 6కు చేరాయి. Also Read: Arshad Nadeem: గోల్డెన్‌ బాయ్‌ ఒక మేస్త్రీ కొడుకు.. చందాలతో ఒలింపిక్స్‌లో చరిత్రను తిరగరాశాడు రెజ్లింగ్‌లో ఆశాకిరణంగా మారిన అమన్‌ సెహ్రవత్‌ పతకం చేజిక్కించుకోవడంతో భారతీయుల్లో సంబరాలు అంటాయి. గురువారం జరిగిన ప్రిక్వార్టరస్‌లో యూరోపియన్‌ స్టార్‌ రెజ్లర్‌ వ్లాదిమిర్‌ ఎగోరోవ్‌ (ఉత్తర మెసెడోనియా) 10-0 తేడాతో విజయం సాధించారు. ఇక క్వార్టర్‌ ఫైనల్‌లో అల్బేనియా రెజ్లర్‌ జెలిమ్‌ ఖాన్‌పై నెగ్గి సెమీస్‌లోకి ప్రవేశించాడు. సెమీ ఫైనల్‌లో జపాన్‌ రెజ్లర్‌ రీ హిగుచి చేతిలో అమన్‌ ఘోర పరాభవం ఎదుర్కొన్నాడు. 0-10 తేడాతో ఓటమిపాలై కాంస్య పోరుకు చేరాడు. Also Read: Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. పురుషుల హకీలో కాంస్యం కైవసం పతకం పొందాలంటే ఉన్న చివరి అవకాశం కావడంతో అమన్‌ సెహ్రవత్‌ ఆది నుంచి దూకుడు కనబర్చాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తొలి నుంచి పంచ్‌లతో రెచ్చిపోయాడు. ప్రత్యర్థి కొంత పుంజుకున్నా తర్వాత అతడిపై అమన్‌ పూర్తిగా ఆధిపత్యం చెలాయించాడు. చేజారుతుందన్న పతకాన్ని చేజిక్కించుకుని మూడో స్థానంలో నిలిచాడు. పతకం సాధించిన అమన్‌ సెహ్రవత్‌కు భారతీయులంతా శుభాకాంక్షలు చెబుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. అమన్‌ పతకంతో భారత్‌ ఖాతాలో పతకాల సంఖ్య 6కు చేరాయి. వాటిలో నీరజ్‌ చోప్రా రజతం.. మిగతా ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook , Twitter None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.