TELUGU

Neeraj Chopra Manu Bhaker Chatting: మను భాకర్‌తో నీరజ్ చోప్రా పెళ్లి.. సంచలన వీడియో తెరపైకి..!

Manu Bhaker Chat With Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్ 2024 లో షూటింగ్‌లో మను భాకర్, జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా అదరగొట్టారు. మను భాకర్ రెండు పతకాలతో సరికొత్త రికార్డు చేయగా.. నీరజ్ చోప్రా వరుసగా రెండో ఒలింపిక్స్ పతకం సాధించి ప్రపంచ యావనికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాడు. ఇక ఒలింపిక్స్ ముగింపు వేడుకల సందర్భంగా నీరజ్ చోప్రాతో మనూ భాకర్ మాట్లాడుతున్న వీడియో నెట్టింట ప్రకంపనలు రేపుతోంది. ఇద్దరు చాలా సన్నిహితంగా మాట్లాడుకుంటుండడంతో నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరిని ఫొటో తీసేందుకు మను భాకర్ తల్లి సుమేధ ప్రయత్నించారు. అయితే మను వద్దని చెప్పడం చర్చగా మారింది. Also Read: Gold Rate Today: తగ్గినట్లే తగ్గి షాకిస్తున్న బంగారం ధరలు..తాజాగా తులం బంగారం ధర ఎంతంటే? ఆ తరువాత నీరజ్ చోప్రాతో సుమేధ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా నీరజ్‌తో తన తలపై ఒట్టు వేయించరకున్నారు. ఫొటో తీస్తుంటే మను భాకర్ ఎందుకు రిజెక్ట్ చేశారు..? నీరజ్‌తో సుమేధ ఏ విషయం గురించి మాట్లాడారు..? ఆమె ఎందుకు ఒట్టు వేయించుకున్నారు..? అంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వీడియోను బట్టి నీరజ్‌తో మను భాకర్‌కు ముందే పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. మను భాకర్, నీరజ్ చోప్రా ఇద్దరూ హర్యానా రాష్ట్రానికి చెందిన కావడంతో ఇద్దరికి ముందే పరిచయం ఉందని అంటున్నారు. మరి వీరిద్దరు స్నేహితులా..? లేదా రిలేషన్‌లో ఉన్నారా..? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. Neeraj Chopra can be seen talking to the Manu Bhaker's mother and into the other video, Neeraj Chopra and Manu Bhaker are discussing closely..! I'm sorry but I don't know why I am getting interested in Manu Bhaker and Neeraj Chopra 😜 pic.twitter.com/uymONMo8sj — Priyanshu Kumar (@priyanshu__63) August 11, 2024 Neeraj Chopra and Manu Bhaker are talking to each other as if they have a crush on each other. I am getting wild ideas on getting India a couple of future super athletes. pic.twitter.com/KXsTZDGq8y — Lord Immy Kant (Eastern Exile) (@KantInEast) August 11, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్, మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్ కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ఈ ఒలింపిక్స్‌తో దేశానికి తొలి పతకం అందించారు. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో నాలుగోస్థానంలో నిలవడంతో తృటిలో పతకం చేజారింది. ఇక పురుషుల జావెలిన్ త్రోలో చోప్రా రజతం సాధించాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. ఈసారి స్వర్ణం సాధిస్తాడని అందరూ అనుకున్నారు. అయితే పాకిస్థాన్ ఆటగాడు అర్షద్ నదీమ్‌ 92.97 మీటర్ల విసిరి పసిడి సొంతం చేసుకున్నాడు. నీరజ్ చోప్రా 89.45 మీటర్లు విసిరి గత ఒలింపిక్స్ కంటే మెరుగైన ప్రదర్శన చేసినా.. నదీమ్‌ను దాటలేకపోయాడు. Also Read: Happy Independence Day 2024: పంద్రాగస్టున అందరినీ ఇలా విష్ చేయండి, టాప్ 10 విషెస్ స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.