Israel Hezbollah War: హిజ్బుల్లాకు మరోసారి ఊహించని షాక్ తగిలింది. ఇజ్రాయెల్ ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో హిజ్బుల్లా కీలక నేత నబిల్ కౌక్ హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హిజ్బుల్లా సెంట్రల్ కౌన్సిల్లో డిప్యూటీ హెడ్ గా ఉన్న నబిల్ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అయితే, నబిల్ మరణాన్ని హిజ్బుల్లా అధికారికంగా ధృవీకరించలేదు. గత కొన్ని వారాలుగా లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకరదాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ దాడిలో హిజ్బుల్లాకు చెందిన పలువురు సీనియర్ కమాండర్ల హతమైన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన దాడిలో హిజ్బుల్లా అధినేత హసన్ సస్రల్లా మరణించడం ఆ గ్రూపునకు శరాఘాతంలా మారింది. ఈ నేపథ్యంలోనే మరో కీలక నేతను కోల్పోయింది. నబిల్ 1995 నుంచి 2010 వరకు సౌత్ లెబనాన్ లోని హెజ్బుల్లా మిలటరీ కమాండర్ గా పనిచేశాడు. 2020లో నబిల్ పై అమెరికా ఆంక్షలు విధించింది. ఐడీఎఫ్ ప్రకారం నబిల్ కౌక్ హిజ్బుల్లా ప్రివెంటివ్ సెక్యూరిటీ యూనిట్‌కు కమాండర్, తీవ్రవాద సమూహం సెంట్రల్ కౌన్సిల్‌లో సీనియర్ సభ్యుడు. ఇజ్రాయెల్, దాని పౌరులకు వ్యతిరేకంగా ఇటీవల పెరుగుతున్న తీవ్రవాద దాడులలో అతను ప్రత్యక్షంగా పాల్గొన్నాడని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.కౌక్ 1980లలో హిజ్బుల్లాలో చేరాడు. సమూహంలో చేరడం ద్వారా, అతను మొదట ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్, తరువాత దక్షిణ లెబనాన్ ప్రాంతానికి అధిపతిగా బాధ్యతలు స్వీకరించాడు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు శనివారం-ఆదివారం మధ్య రాత్రి బీరుట్ శివారులోని దహియాలో కౌక్‌పై దాడి చేసి చంపాయి. ఈ ప్రాంతం హిజ్బుల్లా బలమైన కోటగా పరిగణిస్తారు. 🔴ELIMINATED: The Commander of Hezbollah's Preventative Security Unit and a member of their Executive Council, Nabil Qaouk, was eliminated in a precise IDF strike. Qaouk was close to Hezbollah's senior commanders and was directly engaged in terrorist attacks against the State of… pic.twitter.com/dcvKLRkMbf — Israel Defense Forces (@IDF) September 29, 2024 Also Read: Popular Business Ideas: పెట్టుబడి తో పనిలేదు ఈ మూడు లక్షణాలు ఉంటే చాలు.. ఈ బిజినెస్ లో నెలకు కోటి సంపాదించే అవకాశం ఇజ్రాయెల్ శుక్రవారం బీరుట్‌లో జరిగిన భారీ వైమానిక దాడిలో హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లాను హతమార్చిన సంగతి తెలిసిందే . బీరుట్‌లోని దహియాద్‌లోని హిజ్బుల్లా యొక్క భూగర్భ ప్రధాన కార్యాలయంలో టాప్ కమాండర్‌లతో ఇజ్రాయెల్‌పై దాడికి ప్లాన్ చేస్తున్నందున నస్రల్లాను ఇజ్రాయెల్ విమానాలు లక్ష్యంగా చేసుకున్నాయి.గ్రూప్ సదరన్ ఫ్రంట్ కమాండర్, మొహమ్మద్ అలీ కరాకి కూడా హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాపై వైమానిక దాడిలో మరణించారు. కరాకి కమాండ్‌లో రెండవది. ఇజ్రాయెల్ గత కొన్ని రోజులుగా నిర్వహించిన దాడులలో హిజ్బుల్లా అగ్ర నాయకత్వాన్ని దాదాపుగా మట్టుబెట్టింది. దీనికి ముందు, ఇజ్రాయెల్ ఫుద్ షుకర్ ఇబ్రహీం అకిల్‌లను చంపింది ఇజ్రాయెల్. Also Read: Success Story : చెట్టు కింద కూర్చుంటే వచ్చిన ఒక ఐడియా.. ఆయన జీవితాన్నే మార్చేసింది.. నేడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీనే శాసిస్తున్నాడు స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook None
Popular Tags:
Share This Post:
China Virus: చైనా వైరస్ తో డేంజర్ బెల్స్.. దేశంలో ఐదు కేసులు..
- by Sarkai Info
- January 7, 2025


Brahmamudi: మాయ చేసిన కావ్య.. కంగుతిన్న అనామిక, రాజ్ చేతిలో అసలైన బంగారు కిరీటం..
January 7, 2025What’s New
Spotlight
Today’s Hot
Featured News
Latest From This Week
HMPV New Cases In Chennai: ఇద్దరు చిన్నారులకు సోకిన చైనా వైరస్.. భయాందోళనలో ప్రజలు..!
TELUGU
- by Sarkai Info
- January 6, 2025
Vishal Health: తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో ప్రముఖ హీరో విశాల్.. అసలు ఏం జరిగింది?
TELUGU
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.