TELUGU

Viral video: రష్యాపై 9/11 తరహా దాడి.. వీడియో ఫ్రూఫ్‌ ఇదిగో.. పుతిన్‌కు చెమటలు

Russian attack on Kazan: రష్యాలోని కజాన్ నగరంలో 9/11 తరహా దాడి జరిగింది. కజాన్‌లోని మూడు పెద్ద భవనాలపై డ్రోన్ దాడి జరిగింది. డ్రోన్లు భవనాలను ఢీకొట్టిన దృశ్యాలు కూడా భయటకు వచ్చాయి. దీంతో రష్యాలో ఒక్కసారిగా కలకలం రేగింది. కజాన్ ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చే విమానాలను నిషేధించారు. రష్యాకు చెందిన ఏవియేషన్ వాచ్ డాగ్ రోసావియాట్సియా శనివారం టెలిగ్రామ్ మేసేజింగ్ యాప్ ద్వారా నగరంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసినట్లు పేర్కొంది. రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ TASS మాస్కోకు తూర్పున 800 కి.మీ దూరంలో ఉన్న కజాన్‌లోని నివాస సముదాయంపై డ్రోన్ దాడి జరిగిందని నివేదించింది. రెసిడెన్షియల్ ఎత్తైన భవనాలపై ఎనిమిది డ్రోన్ దాడులు జరిగాయని ఏజెన్సీ తెలిపింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక అధికారులను ఉటంకిస్తూ ఏజెన్సీలు తెలిపాయి. రష్యా భద్రతా సేవలతో అనుసంధానించిన బాజా టెలిగ్రామ్ ఛానెల్ ధృవీకరించని వీడియో ఫుటేజీని కూడా విడుదల చేసింది. ఇందులో డ్రోన్ ఎత్తైన భవనాన్ని ఢీకొట్టడం కనిపిస్తుంది. డ్రోన్ ఢీ కొట్టిన వెంటనే, భారీ మంటలు చెలరేగాయి.ఈ మంటల ధాటికి భవనం పూర్తిగా దెబ్బతిన్నది. Also Read: Bank Merger: ఆ బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్..తెలంగాణలో ఈ బ్యాంక్ కనిపించదు..డిసెంబర్ 27లోపు పనులన్నీ పూర్తి చేసుకోండి ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిన రష్యా నగరం కజాన్ కీవ్ నుండి 1400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక ప్రచారం ప్రారంభించినప్పటి నుండి, కీవ్ డ్రోన్‌లు మాస్కో, ఇతర రష్యన్ ప్రాంతాలలో వైమానిక దాడుల నుండి నిరోధించాయి. వీటిలో కొన్ని UAVలు మాత్రమే తమ లక్ష్యాలను చేరుకోగలిగాయి. ఇలాంటి కేసులు చాలా వరకు రెండు దేశాల సరిహద్దుల్లోనే జరిగాయి. అయితే ఉక్రెయిన్‌కు 1,379 కిలోమీటర్ల (857 మైళ్లు) దూరంలో ఉన్న రష్యా నగరం కజాన్‌పై ఇలాంటి దాడి జరగడం ఇదే తొలిసారి. దీనికి కొద్ది రోజుల ముందు రష్యా సీనియర్ అణు చీఫ్ కూడా బాంబు పేలుడులో హత్యకు గురయ్యారు. ఈ హత్యకు ఉక్రెయిన్ బాధ్యత వహించింది. కాగా గతంలోనూ ఉక్రెయిన్ రష్యాపై దాడి చేసింది.రష్యాలోని సరాటోవ్ లోని అత్యంత ఎత్తైన భవనాన్ని లక్ష్యంగా చేసుకుని 20 డ్రోన్స్ తో దాడికి పాల్పడింది. వీటిలో ఉక్రేనియన్ సైన్యానికి చెందిన డ్రోన్ సరాటోవ్ లోని నివాన భవానాన్ని ఢీకొట్టింది. ఈ దాడిలో భవనం దెబ్బతిన్నది. ఓ మహిళకు గాయాలు అయ్యాయి. BREAKING NEWS: Ukraine has strike a building in Kazan, Russia with kamikaze drones. Adonia Germany Sudan Kasese National ID #Terroristattack pic.twitter.com/PvKF1DZY6O — KIGAPOT (@kigapot) December 21, 2024 Also Read: PM Kisan: రైతులకి బిగ్ అలెర్ట్.. ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే పీఎం కిసాన్ డబ్బులు పడవు! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.