TELUGU

IRCTC Package: కొత్త ఏడాదిలో తక్కువ బడ్జెట్‌లోనే ఈ దేశాలకు వెళ్లి రావచ్చు

IRCTC Package: ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఐఆర్సీటీసీ ఎప్పటికప్పుడు టూరిజం ప్యాకేజ్‌లు అందిస్తుంటుంది. అందులో భాగంగానే ఈసారి విదేశాలను చుట్టి వచ్చేలా ప్యాకేజ్ ప్లాన్ చేసింది. ఇందులో దుబాయ్, అబుదాబి, బ్యాంకాక్, పట్టాయ, శ్రీలంక సహా ఇతర దేశాలున్నాయి. ఏ దేశానికి ఎంత ఖర్చవుతుంది, ఎన్ని రోజులనేది వివరంగా తెలుసుకుందాం. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్‌సీటీసీ ఇప్పుడు విదేశాలకు టూరిస్ట్ ప్యాకేజ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా దుబాయ్-అబుదాబి ఎయిర్‌టూర్ ప్యాకేజ్ Sizzling Dubai with Abudabi పేరుతో ప్రారంభించింది. ఇది 7 రోజులు, 6 రాత్రుల ప్యాకేజ్. ఇందులో మిరాకిల్ గార్డెన్, మెరీనా క్రూయిజ్ రైడ్, బుర్జ్ ఖలీఫా, ఫ్యూచర్ మ్యూజియం, బెల్లీ డ్యాన్స్ వంటివాటిని ఆస్వాదించవచ్చు. ఈ టూర్ లక్నో నుంచి ప్రారంభమౌతుంది. జనవరి 17 రాత్రి 9.55 గంటలకు లక్నో ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి రాత్రి 12.55 గంటలకు షార్జాకు చేరుకుంటుంది. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్టే అన్నీ ప్యాకేజ్‌‌లో కలిపే ఉంటాయి. ఈ ప్యాకేజ్‌లో షేరింగ్‌ను బట్టి టారిఫ్ ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ అయితే ఒక్కో వ్యక్తికి 1 లక్ష 7 వేల రూపాయలు అవుతుంది. డబుల్ షేరింగ్ అయితే ఒక్కొక్కరికి 109500 రూపాయలు అవుతుంది. అదే సింగిల్ షేరింగ్ అయితే ఒక్కొక్కరికి 1,29 వేలు అవుతుంది. ఐదేళ్ల నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు 104500 అవుతుంది. బెడ్ లేకుండా అయితే వీరికి ఒక్కొక్కరికి 96000 ఖర్చవుతుంది. ఇక రెండవది శ్రీలంక టూర్ ప్యాకేజ్. శ్రీలంక ది రామాయణ టేల్స్ పేరుతో మరో ప్యాకేజ్ ప్రారంభించింది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజ్ ఉంటుంది. జనవరి 22 న కోల్‌కతా నుంచి శ్రీలకంకకు బయలుదేరుతుంది. జనవరి 27న కొలంబో నుంచి కోల్‌కతాకు తిరిగి చేరుతారు. ఒక్కొక్కరికి 90,160 రూపాయలు అవుతుంది. ఇది త్రిబుల్ షేరింగ్ ఖర్చు. అదే డబుల్ షేరింగ్ అయితే ఒక్కొక్కరికి 74,700 రూపాయలుంటుంది. చిన్న పిల్లలకు బెడ్‌తో కలిపి 57,110 రూపాయలు, బెడ్ లేకుండా అయితే 54,650 రూపాయలు అవుతుంది. ఇక మరో అద్భుతమైన ప్యాకేజ్ బ్యాంకాక్, పట్టాయ్‌లు చుట్టివచ్చే థాయ్‌లాండ్ ప్యాకేజ్. ఐఆర్సీటీసీ ఎక్సోటిక్ థాయ్‌లాండ్ ఫిబ్రవరి 11వ తేదీన జైపూర్ నుంచి ప్రారంభమౌతుంది. ఇందులో సింగిల్ ఆక్సుపెన్సీ ఒక్కొక్కరికి 62,845 రూపాయలు ఖర్చవుతుంది. డబుల్, ట్రిపుల్ షేరింగ్ అయితే ఒక్కొక్కరికి 54,710 రూపాయలు అవుతుంది. మొత్తం ప్యాకేజ్‌లో 3 స్టార్ హోటల్ స్టే ఉంటుంది. Also read: Makar Sankranti 2025: మకర సంక్రాంతి నుంచి ఈ 5 రాశులకు మహర్దశే, ఊహించని డబ్బు స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.