TELUGU

US shutdown: అమెరికాలో తప్పిన షట్ డౌన్ గండం..నిధుల బిల్లుకు చివరి క్షణంలో ఆమోదం

US shutdown: అమెరికాలో షట్ డౌన్ భయాల మధ్య, సెనేట్ తాత్కాలిక నిధుల బిల్లును ఆమోదించింది. 85 మంది ఎంపీలు ఈ బిల్లుకు మద్దతుగా ఓటు వేశారు. బిల్లుకు వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ బిల్లు అధ్యక్షుడు బిడెన్‌కు పంపించారు. ఈ బిల్లు మొదట అమెరికా పార్లమెంట్ దిగువ సభలో ఆమోదం పొందింది. ప్రతినిధుల సభ 366-34 మెజారిటీతో బిల్లును ఆమోదించింది. ఈ బిల్లును హౌస్ రిపబ్లికన్ నేత, స్పీకర్ మైక్ జాన్సన్ ప్రవేశపెట్టారు.అమెరికా పార్లమెంటు ఆమోదించిన తర్వాత, ఈ బిల్లు అధ్యక్షుడు జో బిడెన్‌కు పంపించారు. బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత అమెరికాలో షట్‌డౌన్‌కు అవకాశం పూర్తిగా తొలగిపోతుంది. షట్‌డౌన్ అంటే ఏమిటి? అమెరికాలో, ఫెడరల్ ప్రభుత్వాన్ని నడపడానికి నిధులు పూర్తిగా అయిపోయినప్పుడు షట్‌డౌన్ అనేది పరిస్థితి తలెత్తుతుంది. US పార్లమెంట్ (కాంగ్రెస్) ప్రభుత్వానికి నిధులు విడుదల చేయడానికి సంబంధించిన బిల్లును ఆమోదించనప్పుడు లేదా దానిపై రాష్ట్రపతి సంతకం చేయనప్పుడు షట్డౌన్ పరిస్థితులు ఏర్పడతాయి. షట్‌డౌన్‌ తర్వాత చాలా కంపెనీలు మూతపడతాయి. ఉద్యోగులు సెలవుపై వెళ్లడంతో నిత్యావసర సర్వీసుల కార్మికులు జీతాలు లేకుండా పని చేయాల్సి వస్తుంది. Also Read: ​ Viral video: రష్యాపై 9/11 తరహా దాడి.. వీడియో ఫ్రూఫ్‌ ఇదిగో.. పుతిన్‌కు చెమటలు అయితే ప్రభుత్వ కార్యకలాపాలు, జీతాల చెల్లింపులకు అవసరమైన నిధుల కోసం బైడెన్ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ట్రంప్ దాన్ని మొదట తిరస్కరించారు. ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులను సమకూర్చడంతోపాటు ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించేందుకు బిల్లులో రెండేళ్లపాటు రుణాలపై పరిమితి ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రతినిధులసభ స్పీకర్ మైక్ జాన్సన్ బిల్లు ప్రవేశపెట్టగా సభ 235-174 ఓట్ల తేడాతో తిరస్కరించింది. అయితే 38 మంది రిపబ్లికన్లు డెమోక్రాట్లతో కలిసి బిల్లును వ్యతిరేకించారు. ఈ పరిణామాలపై వైట్ హౌజ్ కీలక వ్యాఖ్యలు చేసింది. షట్ డౌన్ వస్తే అధికార బదిలీకి అంతరాయం ఏర్పడుతుందని వార్నింగ్ఇచ్చింది. రిపబ్లికన్ల నుంచి వ్యతిరేకత రావడం వల్ల ట్రంప్ వెనక్కి తగ్గారు. దీంతో బిల్లులో మార్పులు చేశారు. ట్రంప్ డిమాండ్లను తొలగించి ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు, విపత్తు సహకారం వంటి అంశాలతో 118 పేజీల కొత్త బిల్లును స్పీకర్ ప్రవేశపెట్టారు. 366-34 ఓట్ల తేడాతో ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. Also Read: Viral Video: ఈ అమ్మాయి అచ్చం జహీర్‌ లాగే ఎలా బౌలింగ్‌ వేస్తుందో చూడండి.. ఏకంగా క్రికెట్‌ గాడ్‌ కూడా ఫ్లాట్! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.