Plane Crash In Brazil: మరో విమాన ప్రమాదం సంభవించి పది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఓ దిగ్గజ పారిశ్రామికవేత్త ఉండడంతో ఆ దేశం నిర్ఘాంతపోయింది. ప్రమాదవశాత్తు నివాసాలపై కూలిపోవడంతో మృతుల సంఖ్య పెరిగింది. ఈ సంఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. మృతుల వివరాలు ఇంకా తెలియలేదు. కానీ మృతుల్లో మహిళలు కూడా ఉన్నారని సమాచారం. Also Read: Snakes Attack Video: పాముల దండయాత్ర.. చిక్కినట్టే చిక్కి తుర్రుమన్న 'తొండ' బ్రెజిల్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గ్రామడో పట్టణంలో విమానం ఆదివారం కుప్పకూలింది. సెర్రా గౌచ పర్వతాలు పర్యాటకానికి ప్రసిద్ధి పొందాయి. ఈ పట్టణంలో నివాసా ప్రాంతాలపై చిన్నపాటి విమానం కూలింది. సావో పాలో రాష్ట్రానికి వెళ్తున్న క్రమంలో ఆ విమానం గ్రామడో పట్టణంలో కూలిపోయింది. అయితే నివాస ప్రాంతాలైన మొబైల్ షాప్, మరో దుకాణంపై ఈ విమాన కూలిపోవడంతో అక్కడి స్థానిక ప్రజలతో పాటు విమానంలోని మృతి చెందారు. ప్రమాదం ధాటికి విమానం కాలిబూడిదైంది. ఒక్క ముక్క కూడా మిగలలేదు. Also Read: Matrimony Cheating: బట్టతల.. బారెడు పొట్టతో 50 మంది అమ్మాయిలను మోసం.. బాసూ నీవు గ్రేటూ ఈ ప్రమాదంలో గెలాజ్ అసోసియేట్స్ అధినేత.. వ్యాపారవేత్త లూయిజ్ క్లాడియో గెలాజీ (61) ఏళ్ల మృతి చెందారని తెలుస్తోంది. అతడు తన భార్య, ముగ్గురు కుమార్తెలతోపాటు మరికొద్ది మంది కుటుంబసభ్యులు, అతడి కంపెనీ ఉద్యోగులతో వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతుల్లో గెలాజీ కుటుంబీకులతోపాటు ఆఫీస్ ఉద్యోగులు కూడా మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం సంభవించడంతో వెంటనే స్థానిక పోలీస్ యంత్రాంగం, అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టాయి. మరో చోట హెలికాప్టర్ ఢీ మరో దేశంలో ఓ అంబులెన్స్ హెలికాప్టర్ (ఎయిర్ అంబులెన్స్) ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. వైద్య బృందంతో వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదవశాత్తు ఓ భవనాన్ని ఢీకొట్టింది. ఓ రోగిని ఆస్పత్రికి తీసుకొచ్చేందుకు వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురవడంతో వైద్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రమాదంలో మొత్తం నలుగురు మృతి చెందగా.. వారిలో ఇద్దరు వైద్యులు ఉండడం గమనార్హం. క్రిస్మస్ వేడుకల వేళ ఈ ప్రమాదాలు సంభవించడంతో ఆయా దేశాల్లో తీవ్ర విషాదం ఏర్పడింది. 🚨 DEFESA CIVIL INFORMA Acidente em modal aéreo - múltiplas vítimas - COBRADE 2.5.5.0.0 Em 22/12/2024 às 10h GRAMADO/RS Um avião caiu na manhã de hoje (22) no centro urbano de Gramado/RS. Equipes de emergência atuam neste momento no local. Preliminarmente, o avião… pic.twitter.com/egFOugR37G — Defesa Civil Nacional (@defesacivilbr) December 22, 2024 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None
Popular Tags:
Share This Post:
China Virus: చైనా వైరస్ తో డేంజర్ బెల్స్.. దేశంలో ఐదు కేసులు..
- by Sarkai Info
- January 7, 2025
Brahmamudi: మాయ చేసిన కావ్య.. కంగుతిన్న అనామిక, రాజ్ చేతిలో అసలైన బంగారు కిరీటం..
January 7, 2025What’s New
Spotlight
Today’s Hot
Featured News
Latest From This Week
HMPV New Cases In Chennai: ఇద్దరు చిన్నారులకు సోకిన చైనా వైరస్.. భయాందోళనలో ప్రజలు..!
TELUGU
- by Sarkai Info
- January 6, 2025
Vishal Health: తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో ప్రముఖ హీరో విశాల్.. అసలు ఏం జరిగింది?
TELUGU
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.