TELUGU

Russia Ukraine War: ఉక్రెయిన్ లక్ష్యంగా మరోసారి రష్యా భీకర దాడులు.. సరిగ్గా అదును చూసి కొడుతున్న క్రెమ్లిన్..

Russia Ukraine War : దాదాపు రెండున్నరేళ్లుగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా సప్లై చెయిన్స్ పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తాజాగా ఉక్రెయిన్‌‌పై మరోసారి రష్యా భీకరంగా దాడి చేసింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌ విద్యుత్‌ వ్యవస్థలే లక్ష్యంగా 200 క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో లక్షలాది ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయాయి. మొత్తంగా ఆయా ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ ఈ తరహా దాడి చేయడం ఇది 11వసారి అని చెప్పాలి. దేశవ్యాప్తంగా విద్యుత్‌ కేంద్రాలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్‌ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని తెలిపింది. చలి కాలాన్నే ఆయుధంగా రష్యా వాడుకుంటోంది. అదును చూసి ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా దాడులకు తెగపడుతోంది. మరోవైపు విద్యుత్‌ వ్యవస్థల పునరుద్ధరణకు తమ ఇంజినీర్లు కృషి చేస్తున్నారని, సాధ్యమైనన్ని ప్రాంతాల్లో సరఫరాకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది ఉక్రెయిన్. ఆ దేశంతో పాటు రష్యాలో చలికాలం అత్యంత తీవ్రంగా ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతాయి. దాంతో తాగునీరు, ఇళ్లలో హీటర్ల కోసం విద్యుత్‌ ఎంతో కీలకం. ఇదే సమయంలో ఆ దేశ పవర్‌ గ్రిడ్‌లను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులు చేయడం ఉక్రెయిన్ పౌరులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గతేడాది ఇదే సీజన్‌లోనూ రష్యా సేనలు దాడులకు తెగబడ్డాయి. ప్రస్తుతం చలికాలం మొదలవుతోన్న సమయంలోనూ క్షిపణులు, డ్రోన్లతో మళ్లీ దాడులు చేస్తున్నాయి. అంతేకాదు గురు,శుక్రవారాల్లోనే 100 డ్రోన్లు, 90 క్షిపణులతో ఉక్రెయిన్‌లోని 17లక్ష్యాలపై తమ సైన్యం దాడి చేసినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ వెల్లడించారు. మరోవైపు అంతేకాదు, హైపర్‌సోనిక్ క్షిపణులతో దాడులు తప్పవని హెచ్చరించింది. తమ భూభాగంలో ఉక్రెయిన్ చేస్తోన్న క్షిపణి దాడులకు ప్రతిస్పందనంగా ఈ దాడులు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రభుత్వ భవనాలకు భారీ భద్రత కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా రష్యా దాడులను తీవ్రతరం చేయడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యా గత వారం ఉక్రెయిన్‌ లక్ష్యంగా కొత్త ఒరేష్నిక్ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. పలు ఆయుధాలను ఒకేసారి ప్రయోగించడం అణు దాడికి సమానమైన శక్తిని కలిగి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదీ చదవండి: Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు చిరంజీవి.. ఇపుడు నాగబాబు.. ఇదీ చదవండి: Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook , Twitter None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.