TELUGU

Mufasa Movie Review: ముఫాసా మూవీ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిందా..?

Mufasa Movie Review: ముఫాసా తెలుగు సహా భారతీయ ప్రేక్షకులను అలరిస్తున్న పేరు. మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడంతో తెలుగు ప్రేక్షకుల అటెన్షన్ ఈ యానిమేటేడ్ హాలీవుడ్ మూవీ పై పడింది. తెలుగులో మహేష్ బాబు బ్రాండ్ తో ఈ సినిమాకు మంచి మార్కెటింగ్ జరిగిందనే చెప్పాలి. మరోవైపు బ్రహ్మానందం, ఆలీ, సత్యదేవ్ వంటి నటులు ఈ సినిమాకు అద్భుతమైన వాయిస్ ఓవర్ ఇచ్చారు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించిందా మన మూవీ రివ్యూలో చూద్దాం.. కథ విషయానికొస్తే.. ముఫాసా కథ లయన్‌ కింగ్‌కు కొనసాగింపుగా ఈ సినిమా మొదలవుతోంది. ఓపెనింగ్‌ కియారా (బుజ్జి ఆడ సింహం)తో ప్రారంభం అవుతుంది. కియారా.. సింబా, నాలా దంపతుల గారాల పట్టి. ఆ తరువాత సింహం దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వడానికి వేరే ప్రదేశానికి (సెరేన్‌ ఒయాసిస్‌)కు బయలుదేరుతారు. ఆ బుజ్జి సింహం కియారా బాధ్యతను సింజ టిమన్‌ (అడవి పంది), పంబ (ముంగిస) దగ్గర వదిలి వెళతారు.అయినా కియారా భయం భయంతో ఉంటుంది. ఆమె భయం పోగొట్టడానికి అక్కడకు రఫీకి తాతా (కొండముచ్చు) వాళ్ల తాత ముఫాసా కథ చెబుతాడు. ఈ నేపథ్యంలో ముఫాసా ఎవరు.. ? ఎందుకు తల్లిదండ్రుల నుంచి దూరం అయ్యాడు. ఈ క్రమంలో మళ్లీ తన పేరేంట్స్ ను ఎలా కలిసాడు. ఈ సందర్భంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే ‘ముఫాసా’ కథ స్టోరీ. కథనం, టెక్నికల్ విషయానికొస్తే.. దర్శకుడు బారీ జెర్కిన్స్ తనకు నచ్చిన జానపద స్టోరీని సింహాలకు అన్వయిస్తూ తెరపై గొప్పగా ఆవిష్కరించాడు. తెరపై నిజంగానే సింహాలు, జంతువులు కదలాడుతున్నట్టే అనిపించాయి. ఎక్కడ గ్రాఫిక్స్ అనిపించవు. అంతేకాదు కథ మొదలవగానే ప్రేక్షకులను ఆ లోకంలోకి తీసుకెళ్లాడు. ప్రజెంట్ జనరేషన్ లో సినిమా రంగంలో చాలా రకాల మార్పులు వచ్చాయి. ఒక్కో జానర్ కంటూ ప్రత్యేకమైన ప్రేక్షకులు ఉంటారు. సాధారణంగా జనాలు యాక్షన్, థ్రిల్లర్, ఫిక్షన్ రకమైన సినిమాలు ఎక్కువగా చూడడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే ఆయా జానర్స్ సినిమాల్లో ఉత్కంఠతో పాటు హీరో చేసే ధైర్యసాహసాలు, విలన్‌తో ఢీ అంటే ఢీ అనే పోరు ఆడియన్స్ ను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంటాయి. కానీ చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అన్ని రకాల వయసుల వారికీ యానిమేటెడ్ చిత్రాలు నచ్చుతాయి. ఈ చిత్రాలలో కొత్త కొత్త కథలు, పాత్రలను మన దర్శకులు వండి వారుస్తున్నారు. ఇందులో ఎక్కువ ప్రేక్షకాదరణ పొందినవే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా వచ్చిన ముఫాసా కూడా అలాంటి చిత్రమే. ముఖ్యంగా మన రోజు వారి జీవితంలోని ఒత్తిడి నుంచి రిలాక్స్ కావడానికి ఈ సినిమాను బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. 2019లో వచ్చిన ‘ది లయన్‌ కింగ్’‌ అని సీరిస్‌లో రెండవ భాగంగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలో విడుదలైంది. ముఖ్యంగా ఈ సినిమాకు టాలీవుడ్‌ లో పేరుగాంచిన పెద్ద పెద్ద సినీ తారలైన మహేష్ బాబు, బ్రహ్మి డబ్బింగ్ చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ముఫాసాకు మహేశ్‌ బాబు డబ్బంగ్ పెద్ద ఎస్సెట గా నిలిచింది. ఇతర జంతువులకు అలీ, బ్రహ్మానందం ఇతరలకు వాయిస్ ఇచ్చారు. ఈ సినిమాను మన తెలుగు వారు చూడడానికి ఎక్కడా తగ్గలేదని చెప్పవచ్చు. మహేశ్‌ బాబు ఫ్యాన్స్‌ కు మాత్రం ఈ మూవీ ఒక బంఫర్‌ ఆఫర్‌ అని చెప్పవచ్చు. టెక్నికల్ గా ఈ సినిమాను ఎక్కడా వంక పెట్టాల్సిన పనిలేదు. ముఖ్యంగా చిన్నపుడు ముఫాసా.. నీటిలో కొట్టుకుపోవడం.. తెల్ల సింహాలతో పోరాటం, అడవిలో ఛేజింగ్ వంటి సీన్స్.. క్లైమాక్స్ లో అన్ని జంతువులతో కలిసి చేసే పోరాట సన్నివేశాలు.. మధ్య మధ్యలో కొన్ని కామెడీ సీన్స్.. సింహాల మధ్య ప్రేమ, పగ, ఈగో వంటికి కూడా ఈ సినిమాలో చూపించారు. ఇవి ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఎక్కడా గ్రాఫిక్స్ అనే ఫీలింగ్ రాదు. ఇక ముఫాసా స్క్రీన్‌ ప్లేకి వస్తే కల ముందు కథ నడుస్తున్న భావన కలుగుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇది ఎంతగానో నచ్చుతుంది. పంచ్ లైన్ .. ‘ముఫాసా’.. చిన్నారులను ఎంగేజ్ చేసే యాక్షన్ డ్రామా.. Read more: Mohan Babu: మోహన్ బాబు టాయ్ లెట్‌లో చేతులు పెడతారు..!.. షాకింగ్ విషయం బైటపెట్టిన బెల్లంకొండ సురేష్.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook , Twitter None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.