TELUGU

NTR Statue: రేవంత్ రెడ్డి పెద్ద మనసు.. హైదరాబాద్ లో 100 అడుగుల ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి..

NTR Statue : అన్న ఎన్టీఆర్ సినిమా నటుడిగా.. రాజకీయ నాయకుడిగా తెలుగు గడ్డ మీద తనదైన ముద్ర వేసారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడిగా పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలో వచ్చి సంచలనం రేపారు. ఆయన మన మధ్య లేకపోయినా.. సినిమాలతో పాటు ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు ఇప్పటికీ తెలుగు వాళ్ల గుండెల్లో నిలిచిపోయాయి. తాజాగా ఈయన 100 అడుగులు భారీ విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నారు. గత యేడాది కాలంగా ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహన కృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ సభ్యులు మధూసూదన్ రాజు, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా గత కొంత కాలంగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చేపట్టిన కార్యక్రమాలను రేవంత్ రెడ్డిని వివరించారు. ఈ సందర్బంగా భాగ్యనగరంలో ఏర్పాటు చేయబోయే 100 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని నెలకొల్పాలన్న సంకల్పాన్ని వివరించారు. దానితోపాటు ఎన్టీఆర్‌ నాలెడ్జి సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాదు దాన్ని ఓ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనుకుంటున్నట్టు వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున స్థలాన్ని కేటాయించి సహకరించాలని కోరారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో, ప్రత్యేకించి ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారి 100 అడుగుల విగ్రహం ప్రతిష్టాపనకు, ఎన్టీఆర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం ప్రభుత్వ పరంగా స్థలం కేటాయించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సుముఖత వ్యక్తం చేయడం ఆనందకరం. ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకొన్న సీఎం రేవంత్‌ రెడ్డి అభినందించారు. ఎన్టీఆర్‌ తెలుగు ప్రజలందరికీ ఇష్టమైన నటుడు, నాయకుడని.. ఆయన 100 అడుగుల విగ్రహం హైదరాబాద్‌లో ప్రతిష్టించాలన్న ప్రతిపాదనకు తమవంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సానుకూల స్పందనకు ఎన్టీఆర్‌ అభిమానులందరూ ఆనందిస్తారన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ యేడాది ఎన్టీఆర్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి 75 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలో ప్రత్యక కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు.. ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.