TELUGU

Mohan Babu: మోహన్ బాబు టాయ్ లెట్‌లో చేతులు పెడతారు..!.. షాకింగ్ విషయం బైటపెట్టిన బెల్లంకొండ సురేష్..

Bellam Konda suresh comments on mohan babu family controversy: మంచు మోహన్ బాబు కుటుంబ గొడవలు మాత్రం ఇటు ఇండస్ట్రీలో, అటు రాజకీయాల పరంగా కూడా హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకొవచ్చు. తన తండ్రిపైన మంచు మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేయడం, అదే విధంగా తనకు న్యాయం చేయాలని..ఇరు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, తెలంగాణ డీజీపీలకు కూడా మంచు మనోజ్ ఎక్స్ వేదికగా టాగ్ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా మంచు మనోజ్ ముఖ్యంగా.. తన తండ్రి విద్యాసంస్థల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించడంలేదని వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో మోహన్ బాబుతో ఆస్తుల పంచాయతీ కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మోహన్ బాబుపై పలు కేసులు నమోదయ్యాయి. ఆయనకు కోర్టు ఇటీవల బెయిల్ ఇవ్వడానికి సైతం నిరాకరించింది. అయితే.. తాజాగా, మంచు మోహన్ బాబు గురించి.. నిర్మాత బెల్లంకొండ సురేష్ చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయని చెప్పుకొవచ్చు. పూర్తి వివరాలు.. ప్రముఖ నిర్మాత బెల్లం కొండ సురేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మంచు మోహన్ బాబు ఇంట జరుగుతున్న రచ్చ గురించి మాట్లాడారంట. మోహన్ బాబు తనకు గురువులాంటి వారని చెబుతూనే.. ఆయన అనేక పాఠశాలలు, విద్యాసంస్థలు స్థాపించి ఎంతో మంది విద్యార్థులకు క్వాలీటీ విద్య, భోజనం, సదుపాయాలు అందిస్తున్నారన్నారు. ఆయన తిరుపతిలో స్కూల్ ను ప్రారంభిచారని.. ఆ తర్వాత అంచెలెంచెలుగా ఎదిగి మోహన్ బాబు యూనివర్సీటీ నెలకొల్పారన్నారు. అనేక మందికి ఉచితంగా విద్యను కూడా అందిస్తున్నారన్నారు. మోహన్ బాబు పిల్లలకు అందించే బోధనల విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారని స్పష్టం చేసినట్లు తెలుస్తొంది. స్యూల్ లు, కాలేజీలు, యూనీవర్సీటీల హస్టల్స్ లకు ప్రత్యేకంగా వెళ్లి ఎప్పుడు తనిఖీలు చేస్తుంటారన్నారు. Read more: Viral Video: గెలికినందుకు పక్కా అనుభవిస్తారు...!.. తెలుగు ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్లు చేసిన వేణు స్వామి.. వీడియో వైరల్.. భోజనం వండే ప్రదేశాలలో కూడా శుభ్రత ఉందా.. లేదా.. అని స్వయంగా వెళ్లి చూస్తుంటారన్నారు. చివరకు వాష్ రూమ్ లకు వెళ్లి.. వాష్ రూమ్ లలో ట్యాప్ లు వస్తున్నాయా.. ఫ్లష్ లు సరిగ్గా పనిచేస్తున్నాయా..లేదా.. కూడా మోహన్ బాబు చేతులు పెట్టి మరీ చెక్ చేసే వారని కొనియాడారు. అలాంటి ఉన్నత మైన వ్యక్తిని పట్టుకుని మంచు మనోజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధకరమన్నారు. కాలమే అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని బెల్లం కొండ సురేష్ అన్నట్లు తెలుస్తొంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook , Twitter None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.