TELUGU

Harish Rao: ఫార్ములా ఈ రేసు కేసు మొత్తం డొల్ల.. కేటీఆర్‌కు తొలి విజయం

Formula E Race: ఫార్ములా ఈ రేసు కేసులో హైకోర్టు ఉత్తర్వులతో డొల్ల కేసు అని తేటతెల్లమైంది. రేవంత్ రెడ్డి అక్రమంగా బనాయించిన కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు ఇవ్వడంపూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. తొలి అడుగులోనే కేటీఆర్‌ నైతిక విజయం సాధించారు. వారికి అభినందనలు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడారని.. గోబెల్స్ ప్రచారం చేశారని మండిపడ్డారు. Also Read: KTR Arrest Break: హైకోర్టు సంచలన తీర్పు.. కేటీఆర్‌ అరెస్ట్‌కు పది రోజులు బ్రేక్‌ కేటీఆర్‌ కేసుపై హైకోర్టు ఉత్తర్వులు, అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలపై బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో రేవంత్‌ రెడ్డి వ్యవహారంతోపాటు కేటీఆర్‌ కేసు, ఫార్ములా ఈ రేసు కేసుపై వాస్తవాలను హరీశ్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు అభినందనలు చెబుతూ.. రేవంత్‌ రెడ్డిపై విరుచుకుపడ్డారు. Also Read: KTR Press Meet: ఏసీబీ కేసు నమోదుపై కేటీఆర్ సంచలన ప్రెస్‌మీట్.. ఏం చేస్కుంటావో చేస్కో అంటూ సవాల్‌ 'ఈ కారు రేస్‌పై సభలో చర్చ జరపాలని.. వాస్తవాలు ప్రపంచానికి చెబుదాం. ప్రజలకు వాస్తవాలు తెలియాలి అని అడిగాం. మేం సభలో లేని సమయంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. కేసు పెట్టవద్దని మేం అడగడం లేదు. చర్చ పెట్టండి అని అడిగితే ఎందుకు ఒప్పుకోలేదు' అని రేవంత్‌ రెడ్డిని హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవాలు తెలియవద్దా అని సందేహం వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ రేసులో రూ.600 కోట్ల అవినీతి అంటూ రేవంత్‌ రెడ్డి అసత్యాన్ని చెప్పే ప్రయత్నం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మేం సభలో లేకుంటే శుద్ధ తప్పులు చెప్పిండు' అని మండిపడ్డారు. 'ఫార్ములా ఈ రేసు నిర్వహణతో తెలంగాణకు రూ.700 కోట్ల లాభం జరిగింది. రేవంత్ తుగ్లక్ పనులు.. పిచ్చి పని వల్ల రూ.700 కోట్ల నష్టం రాష్ట్రానికి జరిగింది' అని రేవంత్‌ రెడ్డిపై హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణతో రూ.వందల కోట్లు హైదరాబాద్‌కు మేలు జరిగిందని 2022లో నీల్సన్ అనే సంస్థ చెప్పిందని ఆధారాలతో సహా హరీశ్‌ రావు నిరూపించారు. 'రేవంత్ రెడ్డి మాటలు శుద్ధ అబద్దం. రాష్ట్ర ప్రతిష్టను రేవంత్‌ రెడ్డి దెబ్బ తీశాడు' అని తెలిపారు. 'కేటీఆర్ మీద కేసు ఎందుకు పెట్టారు? అవినీతి జరగలేదు మరి ఏసీబీ కేసులు ఎందుకు పెట్టింది' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ అవినీతి జరగలేదని చెప్పారని గుర్తుచేశారు. 'వస్తు రూపేణా, ధన రూపేణా అవినీతి జరిగితే ఏసీబీ పని చేస్తది' అని వివరించారు. 'ఎవరైతే తమ వైఫల్యాలను వేరే వారిని బదనాం చేస్తరో వారు ఎప్పటికీ ఆ వైఫల్యం నుంచి బయటపడలేరు' అని రేవంత్‌ రెడ్డి ఉద్దేశించి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. సమస్యల నుంచి బయటపడలేక ఒక సమస్య నుంచి మరొక సమస్య సృష్టిస్తున్నారని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ, హైదరాబాద్ ఇమేజ్ ను మరియు దేశ ప్రతిష్టను పెంచి ప్రపంచ పటంలో నిలిపిన @KTRBRS గారిపై అక్కసుతో అక్రమ కేసులు పెట్టిన రేవంత్. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish pic.twitter.com/PIYcDQL5lL — BRS Party (@BRSparty) December 20, 2024 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook , Twitter None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.