TELUGU

Vidudala 2 Movie Review: ‘విడుదల పార్ట్ 2’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..

మూవీ రివ్యూ : విడుదల పార్ట్ 2 Vidudala 2) నటీనటులు: విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, అనురాగ్ కశ్యప్ , గౌతమ్ వాసుదేవ మీనన్ తదితరులు ఎడిటర్: ఆర్.రమర్ సినిమాటోగ్రఫీ : ఆర్. వేల్ రాజ్ సంగీతం : ఇళయరాజా నిర్మాతలు : ఆర్ఎస్ ఇన్ఫోటెన్మెంట్ దర్శకత్వం : వెట్రిమారన్ విడుదల తేది : 20-12-2024 సూరి హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విడుదల’ రిలీజై మంచి సక్సెస్ సాధించింది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి కొనసాగింపుగా విడుదల 2 ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ఫస్ట్ పార్ట్ మాదిరే ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.. కథ విషయానికొస్తే.. తమిళనాడులోని ఓ కుగ్రామంలో 1970-80 దశకం మధ్యలో జరిగిన కథ. ఆ ఊర్లో ఓ ప్రభుత్వ మాస్టారు పెరుమాల్ అలియాస్ కరియప్పన్ (విజయ సేతుపతి) అందరికి చదువు చెబుతూ అందరిలో చైతన్యం తీసుకొస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆ ఊరి జమీందార్.. ఆ ఊర్లో ఎవరికైనా పెళ్లి జరిగితే.. తొలి రోజు ఆ పెళ్లి కూతురును అనుభవిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఈ ఊర్లో ఉండే ఓ కుర్రాడు ఓ ముఠాగా ఏర్పడి ఆ ఊరి జమీందారును నరికి చంపుతారు. ఈ క్రమంలో ఆ ఊరి జమీందారు కుమారుడు ఈ హత్య పాలుపంచుకున్న వాళ్లను హింసించి చంపుతుంటాడు. అయితే అసలు చంపిన కుర్రాడిని పెరుమాళ్ తప్పిస్తాడు. ఈ క్రమంలో ఊరి జమీందార్ ను చంపిన కుర్రాడిని పోలీసులకు పట్టించి కోర్టులో ప్రవేశపెడదమనుకుంాడు. ఈ విషయాన్ని పోలీసులు ద్వారా తెలుసుకున్న జమీందార్ తో పాటు అతని ప్రైవేటు సైన్యం అతన్ని చంపుతారు. ఈ క్రమంలో పెరుమాల్ తీవ్రంగా గాయపడతాడు. ఆ తర్వాత కేఆర్ అనే కమ్యూనిస్టు నాయకుడు అతన్ని కాపాడతాడు. ఆ తర్వాత కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై దళ సభ్యుడు అవుతాడు. ఈ క్రమంలో కేఆర్ ఆ ఊరిలో పెత్తందారులు అతి కిరాతకంగా చంపబడతాడు. ఆ తర్వాత తమ గురువును చంపిన పెత్తందార్లను భూస్వాములను వేటాడుతూ చంపుతుంటాడు పెరుమాళ్ల. ఈ క్రమంలో జరిగిన ఓ రైలు ప్రమాదంలో ఇతన్ని బాధ్యుడిని చేస్తూ పెరుమాళ్ ను పట్టుకుంటారు పోలీసులు. ఆ తర్వాత అతన్ని పోలీసులు ఏం చేసారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ కుమరశన్ పాత్ర ఏమిటనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే. కథనం, టెక్నికల్ విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా తెలుగు సహా దక్షిణాది భాషలకు చెందిన దర్శకులు 1970-80 నేపథ్యంలో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో 70 నుంచి 80వ దశకంలో పోలీసులు, నక్సల్స్ మధ్య జరిగిన సంఘర్షణను తెరపై ఆవిష్కరించాడు. ఎపుడో ఫేడౌట్ అయిన నక్సలిజం బ్యాక్ డ్రాప్ ను మళ్లీ తెరపై ఆవిష్కరించాడు. ఇలాంటి సినిమాలు తెలుగు సహా ఇతర భాషల్లో చాలానే తెరకెక్కాయి. ముఖ్యంగా దొరలు, జమీందారులకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ లోని నక్సల్ బరి గ్రామంలో చారు మజుందార్ నేతృత్వంలో ఈ ఉద్యమం మొదలైంది. కొత్తలో అణగారిన ప్రజల కోసం పాటుపడిన నక్సల్స్ ఉద్యమం.. క్రమంగా దారి తప్పింది. ఆ తర్వాత విదేశీయుల చేతిలో ముఖ్యంగా చైనా తొత్తులుగా మారి సీపీఐ మావోయిస్ట్ గా రూపాంతరం చెందింది. ఇందులో కూడా హీరోతో పాటు అణగారిన వర్గాలు .. ఊరి పెత్తందార్ల చేతిలో నలిగిపోవడం వంటివి 80వ దశకంలో జరిగిన సంఘటనలను తెరపై చూపించాడు. ఒకప్పటి అగ్ర వర్ణ ఆధిపత్యం ముగిసిన సమ సమాజ స్థాపన జరిగిన ప్రస్తుత సమాజంలో ఇలాంటి కథలతో వెట్రిమారన్ ఏం చెప్పాలనుకున్నాడో అర్ధం కానీ విషయం. కానీ ఒకప్పటి జమీందారి, పెత్తందారి వ్యవస్థ పోలీసులు, నక్సల్స్ పై ఎలాంటి ప్రభావం చూపించే అంశాన్ని మాత్రం మెచ్చుకోవాలి. పై అధికారుల ఒత్తిడితో నలిగిపోయే పోలీసు వ్యవస్థను చూపించాడు. మరోవైపు నక్సల్స్ ప్రేమకథను కూడా ప్రస్తావించాడు. మరోవైపు ఈ సినిమా తమిళ నేటివిటి కొంత ఇబ్బంది పెట్టే అంశం. మొత్తంగా యూనివర్సల్ అప్పీల్ లేకుండా చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా దర్శకుడు కోణంలో సాగే విడుదల 2 అన్ని వర్గాలను కాకుండా ఓ వర్గం ప్రేక్షకులను టార్గెట్ చేసి తీసినట్టు కనిపిస్తుంది. ఆ ఐడియాలజీని ఈ సినిమాలో మొత్తంగా చూపించాడు. ముఖ్యంగా ఓ నక్సల్ నాయకుడిని పట్టుకొని జైలుకు తీసుకెళ్లి అతన్ని కోర్టు కచేరిలు అని తిప్పడం .. ఈ క్రమంలో ఆ నక్సల్ నాయకుడు తన బయోగ్రఫీ రాసి .. రాబోయే తరాలు దళం వైపు ఆకర్షితులు అవుతారని ప్రభుత్వ అధికారులతో చెప్పించడం వంటి అంశాలను ఇందులో సున్నితంగా సృశించాడు. ముఖ్యంగా పోలీసు, నక్సల్స్, ప్రభుత్వం, పెత్తందారి వ్యవస్థల మధ్య ఒకదాని కొకటి ఉన్న సంబంధాన్ని చూపించాడు. సినిమాటోగ్రఫీ .. అడవిలో పిక్చరైజేషన్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా అడవిలో నక్సల్స్, పోలీసుల మధ్య ఎన్ కౌంటర్ వంటివి సీన్స్ బాగున్నాయి. ఎడిటర్ తన కత్తెరకు మరింత పదను పెడితే బాగుండేది. ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు.. నటీనటుల విషయానికొస్తే.. విజయ్ సేతుపతి ఎంత మంది నటుడితో మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ అయింది. ఇందులో అణగారిన ప్రజలను కాపాడే ఊరి మాస్టారి పాత్రలో ఒదిగిపోయారు. ఆ తర్వాత దళ నాయకుడిగా.. షుగర్ పరిశ్రమలో యూనియన్ లీడర్ పాత్రలో వివిధ వేరియేషన్స్ చూపించాడు. సూరీ ఓ కామన్ కానిస్టేబుల్ పాత్రలో ఒదిగిపోయాడు. మంజు వారియర్ .. జమీందార్ కూతరు నుంచి నక్సల్ వైపు ఆకర్షితురాలయ్యే యువతి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు. ప్లస్ పాయింట్స్ విజయ్ సేతుపతి నటన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నిర్మాణ విలువలు మైనస్ పాయింట్స్ రొటీన్ కథ సెకండాఫ్ ల్యాగ్ తమిళ నేటివిటి పంచ్ లైన్ .. ‘విడుదల 2’ .. ఓ మోస్తరుగా ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా’ రేటింగ్ .. 2.75/5 ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా.. ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.