TELUGU

Vinod Kambli: వినోద్ కాంబ్లీకి సచిన్ వెన్నుపోటు.. ఫైనల్‌గా నిజం బయటకు..!

Vinod Kambli on Sachin Tendulkar: టాలెంట్ ఎంత ఉన్నా.. క్రమశిక్షణ లేకపోతే కెరీర్ నాశనం అవ్వడం ఖాయం. ఇది ఏ రంగంలో అయినా వర్తిస్తుంది. క్రికెట్ విషయానికి వస్తే.. ప్రస్తుత తరం యంగ్ క్రికెటర్ పృథ్వీ షాను చూస్తున్నారు. చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి దూసుకువచ్చి.. తన దూకుడు బ్యాటింగ్‌తో ముద్ర వేసి.. అంతే వేగంగా జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ఐపీఎల్‌లో కూడా అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు. ఇక సచిన్ తరం క్రికెటర్ల విషయానికి వస్తే వినోద్ కాంబ్లీ ఓ మంచి ఉదాహరణ. స్కూల్ డేస్ నుంచి సచిన్ టెండూల్కర్‌తో కలిసి క్రికెట్ ఆరంభించి.. ఎన్నో సంచలన ఇన్నింగ్స్‌లతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ చెడు వ్యసనాల బాటపట్టి కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. వినోద్ కాంబ్లీతో కలిసి క్రికెట్ ఆరంభించిన సచిన్ టెండూల్కర్.. ఆల్ టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మెన్‌గా ఎదిగారు. సచిన్ కంటే ఓ మెట్టు ఎక్కువ టాలెంట్ ఉన్నా.. క్రమశిక్షణ లేకపోవడంతో కెరీర్‌తోపాటు జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నాడు. బీసీసీఐ నుంచి వచ్చే రూ.30 వేల పెన్షన్‌తో జీవితాన్ని వెల్లడిదీస్తున్నాడు. ఇటీవల 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ వినోద్ కాంబ్లీకి అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. Also Read: Nayanthara: బుద్ది గడ్డితిని విఘ్నేష్‌ను పెళ్లి చేసుకున్న ..?.. భర్త గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేసిన నయనతార..!.. ఏంజరిగిందంటే..? 2009 సంఘటన గురించి వినోద్ కాంబ్లీ తాజాగా గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తనకు సచిన్ వెన్నుపోటు పొడిచాడని ఆరోపించగా.. ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. "అప్పుడు సచిన్ సహాయం చేయలేదని నాకు అనిపించింది. తీవ్ర నిరాశకు గురయ్యాను. అందుకే అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. అయితే 2013లో సర్జరీలు చేయించుకున్నప్పుడు టెండూల్కర్ నా వైద్య బిల్లులను చూసుకున్నాడు. మేము మాట్లాడుకున్నాం. మా చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకున్నాం. నేను కెరీర్‌లో వెనక్కివెళ్లినప్పుడు ఎలా ఆడాలో నాకు సచిన్ చెప్పాడు. నేను తొమ్మిది సార్లు పునరాగమనం చేశాను. మేము క్రికెటర్లం. కొన్నిసార్లు మేము గాయపడతాము. గాయపడినా.. మళ్లీ తిరిగి పుంజుకుంటాం. వాంఖడేలో డబుల్ సెంచరీ సాధించడం నాకు కెరీర్‌లో ఎంతో స్పెషల్. చిన్ననాటి కోచ్ అచ్రేకర్ సార్ నాకు సపోర్టగా ఉన్నారు. నేను ముత్తయ్య మురళీధరన్, ఇతర ప్రత్యర్థులతో సరదాగా యుద్ధాలు చేసేవాడిని " అని కాంబ్లీ గుర్తు చేసుకున్నారు. తన క్రికెట్ ప్రయాణం పరిపూర్ణంగా లేదని.. కానీ తాను సర్వస్వం ఇచ్చానని చెప్పారు. తన కుటుంబం, సచిన్ వంటి స్నేహితుల మద్దతుకు తాను కృతజ్ఞుడనని చెప్పుకొచ్చారు. Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా? స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.