TELUGU

Donald Trump: ట్రంప్ మార్క్ షురూ..ఆ రెండు దేశాలకు షాకిచ్చిన అగ్రరాజ్యం..25శాతం సుంకం విధింపు

Donald Trump Vows: కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు (జనవరిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు) డొనాల్డ్ ట్రంప్ మార్క్ షూర్ చేశారు. తాజాగా ట్రంప్ చేసిన ప్రకటన మూడు దేశాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. యుఎస్‌లోకి వచ్చే అన్ని చైనీస్ వస్తువులపై అదనంగా 10శాతం సుంకాలను పెంచాలని డోనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారు. చైనాతో పాటు కెనడా, మెక్సికోలపై కూడా 25 శాతం అదనంగా విధిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఈ ప్రకటన చేశారు. CNBC వార్తల ప్రకారం, ట్రంప్ చేసిన ఈ పోస్టు తర్వాత..మరో పోస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. మెక్సీకో, కెనడా దేశాల నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 25శాతం సుంకం విధించడం కూడా జనవరి 20 మిగిలిన ఆర్డ్ లలో మొదటిదని ట్రంప్ ఆ పోస్టులో పేర్కొన్నారు. దీంతో ప్రాంతీయ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి తెరపడుతుంది. అమెరికా తదుపరి అధ్యక్షుడి ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం తెలిసిందే. అక్రమ వలసలు, అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారమే సుంకాలు విధించడానికి కారణమని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాకు పెద్ద మొత్తంలో డ్రగ్స్, ముఖ్యంగా ఫెంటానిల్ పంపడంపై చైనాతో చాలాసార్లు మాట్లాడానని, అయినా ఫలితం లేకుండా పోయిందని ట్రంప్ అన్నారు. ఒప్పందాలకు విరుద్ధంగా కూడా, బీజింగ్ డ్రగ్ డీలర్లకు మరణశిక్ష విధించలేదు. ఫెంటానిల్, ఒక సింథటిక్ ఓపియాయిడ్ కారణంగా అమెరికాలో ప్రతి ఏటా వేలాది మంది మరణాలకు కారణమవుతున్న డ్రగ్. మెక్సికో ద్వారానే ఎక్కువగా అమెరికాకు డ్రగ్స్ వస్తున్నాయని..ఇంత భారీ మొత్తం దిగుమతి అవ్వడం గతంలో ఎన్నడూ చూడలేదని ట్రంప్ పేర్కొన్నారు. ఈ డ్రగ్స్ సరఫరాను ఆపేంత వరకు చైనా నుండి USలోకి వచ్చే వారి అన్ని ఉత్పత్తులపై అదనంగా 10శాతం సుంకాన్ని విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి ప్రచారం చేస్తున్నప్పుడు, చైనా వస్తువులపై 60శాతం సుంకం విధిస్తానని చెప్పారు. అధ్యక్షుడిగా ఎన్నికైతే దిగుమతి సుంకాలు విధిస్తానని ప్రచార సభల్లో చాలా సార్లు ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిలో భాగంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సెప్టెంబరు నాటికి US డేటా ప్రకారం, మెక్సికో అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కాగా.. కెనడా, చైనా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook , Twitter None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.