TELUGU

Israel Hezbollah War: హిజ్బుల్లాకు మరో చావుదెబ్బ...నస్రల్లా వారసుడు హషీమ్ సఫీద్దీన్ హతం

Hezbollah deputy leader Hashem Safideen: హిజ్బుల్లాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ పేరు వింటేనే వెన్నులో వణుకు వచ్చేలా భీకర దాడులు నిర్వహిస్తోంది. హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థను నామరూపాల్లేకుండా చేయాలని ఇజ్రాయెల్ పక్కాప్లాన్ తోనే దాడులు చేస్తోంది. ఇప్పటికే రాజధాని బీరూట్ పై వైమానిక దాడులతో అటాక్ చేస్తోంది. ఇక దక్షిణ లెబనాన్ పై భూతల దాడులు సైతం చేస్తోంది. ఇప్పటి వరకు రెండువేలకు పైగా హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. గత వారం హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను బీరూట్ ఎయిర్ స్ట్రైక్స్ లో హతమార్చింది ఇజ్రాయెల్. నస్రల్లా మరణం తర్వాత అతని వారసునిగా హిజ్బుల్లా కొత్త చీఫ్ గా పేర్కొన్న హషీమ్ సఫీద్దీన్ కూడా తాజాగా జరిగిన దాడుల్లో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. సౌదీ వార్త సంస్థ అల్ హదత్ ఈ విషయాన్ని వెల్లడించింది. నస్రల్లా మరణిచిన వారం రోజుల్లోనే కొత్త బాస్ ను కూడా అంతమొందించిందని పేర్కొంది. దక్షిణ బీరూట్ లో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కొత్త బాస్ ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. హిజ్బుల్లాకు చెందిన ఉన్నతస్థాయి నేతలు భూగర్భ బంకర్ లో సమావేశం అవుతున్నారన్న సమాచారంతోనే ఇజ్రాయెల్ అటాక్ చేసింది. బీరూట్ లోని దహీహ్ శివారులోని ఈ దాడి జరిగినట్లు సదరు వార్త సంస్థ తెలిపింది. Also Read: Business Ideas For Women: ఇంటి వెనకాల ఖాళీ స్థలం ఉంటే చాలు.. నెలకు లక్ష రూపాయలు సంపాదించే బెస్ట్ బిజినెస్ ఐడియా మీ కోసం అటు హిజ్బుల్లాకు చెందిన పెద్ద లీడర్లంతా ఒక్కొక్కరుగా మట్టుబెడుతోంది ఇజ్రాయెల్ . ఆ సంస్థ మిలటరీ స్ట్రక్చర్ ఇప్పటికే పూర్తిగా దెబ్బతిన్నది. మిగతా నాయకులు, కార్యకర్తలను వెతి మరి దారుణంగా హతమార్చుతోంది. నస్రల్లా తర్వాత సఫీద్దీన్ శక్తివంతమైన నేతగా ఉన్నాడు. 2017లో అతన్ని అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ టెర్రరిస్టుగా గుర్తించింది. 1960 ప్రారంభంలో దక్షిణ లెబనాన్ లో జన్మించిన నఫీద్దీన్ హిజ్బుల్లా వ్యవస్థాపక సభ్యుల్లో ఒగరుగా ఉన్నారు. అయితే హిజ్బుల్లా చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజులకే ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో హతమయ్యాడు. Also Read: Swiggy Bolt: బిర్యానీ ప్రేమికులకు గుడ్ న్యూస్..10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.