Telugu Cycle Traveler Ranjith On Wheels Success Story : సాహస యాత్ర అంటేనే ఎంతో శ్రమ.. ఎన్నో ప్రమాదాలు.. ఇంకెన్నో.. కఠినమైన పరిస్థితిలో ఇలాంటివన్నీ తట్టుకొని, క్షణక్షణం ప్రమాదాలతో సాగుతుంది. అడ్వెంచర్స్ టూర్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మనం అలవాటు పడ్డ జీవితం, మన చుట్టూ ఉన్న సమాజం, మన కుటుంబం.. ఇవన్నీ మనల్ని కొంతవరకు ఆపుతూ ఉంటాయి. కానీ చాలా కొద్ది మంది మాత్రమే వారు అనుకున్న ఆ సాహసాన్ని చేసి చూపిస్తారు. కరోనా కష్టకాలం చాలా మందిని కొంగ తీస్తే.. ఒక కుర్రాన్ని మాత్రం కదిలించింది. కళ్ళ ముందు మరణిస్తున్న ఎందరినో దగ్గర నుంచి చూసిన ఆ కుర్రాడు.. తాను మరణించే పరిస్థితి వస్తే తనతో పాటు కొన్ని జ్ఞాపకాలను మోసుకెళ్లాలి అని అనుకున్నాడు. అలా మన తెలుగు కుర్రాడు ప్రపంచంతో సంబంధం లేకుండా.. ప్రపంచాన్ని చుట్టి రావాలి అనే ఆశయంతో.. ఒంట్లో ఉన్న శక్తిని, గుండెల్లో ఉన్న ధైర్యాన్ని కూడా కట్టుకొని సైకిల్ మీద ప్రయాణించడం మొదలుపెట్టాడు. ఆయనే వరంగల్ కి చెందిన దాగర రంజిత్ కుమార్.. రంజిత్ కుమార్ అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. కానీ రంజిత్ ఆన్ వీల్స్ అంటే మాత్రం చాలా మంది గుర్తుపట్టేస్తారు. అలా గత నాలుగు సంవత్సరాలుగా సైకిల్ మీద తనకు నచ్చిన జీవితాన్ని గడుపుతూ.. అనేక కష్టం, నష్టాలను భరిస్తూ.. తాను మూటగట్టుకున్న జ్ఞాపకాలు అనేకం. కాబట్టి.. అసలు ఈ రంజిత్ ఎవరో? రంజిత్ కి సైకిల్ మీద ప్రయాణించాలి అనే ఆలోచన ఎలా మొదలైంది.. ఇప్పటివరకు రంజిత్ తన జీవితంలో ఎలాంటి ప్రయాణాలు చేశాడు. సైకిల్ ప్రయాణంలో రంజిత్ పడ్డ కష్టాలు, అనుభవాలు, సైకిల్ యాత్ర వల్ల నేర్చుకుంది ఏంటో.. అసలు సైకిల్ యాత్రతో ప్రపంచానికి ఏం సందేశం ఇవ్వాలి అనుకున్నాడో.. ఇలా రంజిత్ కు సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 2020వ సంవత్సరం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడిన సంగతి మనందరికీ తెలిసిందే.. ఆ ఇబ్బందులు రంజిత్ కుటుంబాన్ని కూడా వదల్లేదు. కరోనా రంజిత్ కుటుంబాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసేసింది. తెలంగాణలోనే వరంగల్ గర్మాజీపేటకు చెందిన రంజిత్ ఎమ్ ఫార్మసీ వరకు చదువుకున్నాడు. రంజిత్ వాళ్ళ నాన్న పేరు రాములు ఆయన వరంగల్లో క్రిమినల్ లాయర్ గా పనిచేసేవారు.. అలాగే రంజిత్ కి ఒక చెల్లి కూడా ఉంది. ఆమె ప్రస్తుతం డెంటల్ డాక్టర్ గా పనిచేస్తున్నారు. రంజిత్ కి చదువు పూర్తి అయిన తర్వాత ఫార్మసిస్ట్ గా ఉద్యోగం వచ్చింది. దాంతోపాటు మంచి జీవితం, మంచి ఉద్యోగంతో ఆయన 2020 వరకు కుటుంబంతో సంతోషంగా కలిసి ఉండేవాడు.. కానీ 2020లో వచ్చిన కరోనా మహమ్మారి వారి జీవితాలను చిన్న భిన్నం చేసేసింది. రంజిత్ వాళ్ళ నాన్న లాయర్ కావడంతో లాక్డౌన్ సమయంలో కరోనా చాలా తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో కూడా ఆయన కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో రంజిత్ వాళ్ల నాన్న కరోనా బారిన పడ్డారు. ఆయన నుంచి ఆ వ్యాధి రంజిత్ వాళ్ల అమ్మ, చెల్లికి కూడా వచ్చింది. అలా కుటుంబంలో ముగ్గురు ఒకేసారి కరోనా బారిన పడ్డారు.. కానీ రంజిత్ వాళ్ళ తండ్రికి మాత్రం కరోనా తీవ్రత పెరగడంతో మరణించాడు.. ఈ సమయంలో శారీరక శ్రమ చేసిన చాలామంది కరోనా నుంచి బయటపడ్డారు.. కానీ ఎటువంటి శారీరక శ్రమ లేని వారు మాత్రం కరుణ వల్ల ప్రాణాలు కోల్పోయారనే విషయాన్ని రంజిత్ గమనించాడు. దాంతో తన తండ్రి మరణం నుంచి ఆయనలో పుట్టిన బాధ, ఆవేదన ఆయనలో ఒక సంకల్పం సమాజం కోసం బాధ్యతని తీసుకొనిలా మార్చాయి.. వెంటనే తనవంతుగా ప్రజలందరికీ ఫిజికల్ ఫిట్నెస్ మీద అవగాహన కల్పించాలి అనుకున్నాడు. అంతేకాకుండా రంజిత్ వాళ్ల నాన్నకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం ఉండేదట.. రంజిత్ గతంలో కుటుంబంతో కలిసి ఢిల్లీ టూర్ కి వెళ్ళాడు. ఆ సమయంలో వాళ్ళ నాన్న చాలా ఆనందంగా ఉండడాన్ని రంజిత్ గమనించాడు. దాంతో ఆయనకు ట్రావెలింగ్ అంటే ఇష్టం అనే విషయం రంజిత్ కి తెలిసింది. డబ్బులు లేకున్నా లక్ష్యం కోసం.. రంజిత్ కూడా కరోనా కంటే ముందు ఉద్యోగం చేస్తూనే 2019లో ట్రావెల్ చేయడం మొదలుపెట్టాడు. సొంతంగా తన బైక్ మీద తిరిగేవాడు.. అమృత్సర్, జలంధర్, మనాలి వరకు వెళ్ళాడు. కాబట్టి రంజిత్ కి కూడా ట్రావెలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. దానితో ట్రావెల్ వీడియోలు పోస్ట్ చేయడానికి 2019 ఏప్రిల్ లోనే యూట్యూబ్లో రంజిత్ ఆన్ వీల్స్ అనే ఛానల్ స్టార్ట్ చేశాడు. కానీ కరోనా వల్ల ఈ ట్రావెలింగ్ కి బ్రేక్ పడింది. కానీ రంజిత్ చనిపోయిన వాళ్ళ నాన్న కోసం ఏదో ఒకటి చేసి.. ఆయనకు అంకితం ఇవ్వాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఫిజికల్ ఫిట్నెస్ అవగాహనతో పాటు సైక్లింగ్ చేయాలనుకున్నాడు.. ఇక ట్రావెలింగ్ కోసం సైకిల్ కొనడానికి రూ.12 వేలు తీసుకొని వెళ్ళాడు. కానీ రంజిత్ దగ్గర తక్కువ డబ్బులు ఉండడంతో ఆయన కొనాలనుకున్న సైకిల్ దొరకలేదు. ఆ తర్వాత ట్రావెలింగ్ కోసం ప్రత్యేకంగా ఉండే సైకిల్ కొనడానికి రూ. 48 వేలు పెట్టి సైకిల్ కొన్నాడు. ఆ సమయంలో రంజిత్ దగ్గర సరిపడా డబ్బులు కూడా లేవు.. అయినప్పటికీ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసే సైకిల్ కొన్నాడు. రంజిత్ సైకిల్ మొదటి టూర్.. రంజిత్ తన మొదటి సైకల్ టూర్ ని.. హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు ప్లాన్ చేశాడు. అలా 2021 ఏప్రిల్ 5న తన మొదటి సైకిల్ యాత్ర మొదలు పెట్టాడు. ఇక హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు మధ్య ఉన్న దూరం 1230 కిలోమీటర్లు.. కానీ రంజిత్ సైకిల్ చేసిన రూట్ 1500 కిలోమీటర్ల దూరం వచ్చింది. ఈ 1500 కిలోమీటర్ల దూరాన్ని రంజిత్ కేవలం 15 రోజుల్లోనే పూర్తి చేశాడు. తన మొదటి సైకిల్ యాత్రలో రంజిత్ చాలా కష్టాలు పడ్డాడు. అప్పటివరకు రంజిత్ కి సైకిల్ తొక్కడంలో అనుభవం లేదు. ఇలా సైకిల్ మొదటిసారి తొక్కడంతో అలిసిపోయేవాడు.. కాళ్ల నొప్పులతో బాధపడేవాడు. ఈ యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా డోన్ దగ్గరకు వచ్చేసరికి తీవ్రమైన అస్వస్థతకు గురయ్యాడు. కదలని పరిస్థితుల్లో ఉన్న రంజిత్ ని స్థానిక పోలీస్ ఎస్ఐ దగ్గర్లో ఉన్న ఫిజియోథెరపీ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించాడు. ఆ సమయంలో వారం రోజులు పాటు రెస్ట్ తీసుకోవాలని.. డాక్టర్ చెప్పిన కూడా రంజిత్ వినలేదు. కాస్త నొప్పులు తగ్గిన వెంటనే మళ్ళీ సైకిల్ మీద తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. రెండు ఇడ్లీలతో భోజనం.. రంజిత్ 2021 ఏప్రిల్ లో ఈ యాత్ర మొదలుపెట్టారు. అంటే అది పూర్తిగా వేసవికాలం వాసవిలో సౌత్ ఇండియాలో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతో రంజిత్ సైక్లింగ్ చేసే క్రమంలో ఎండకు వేడికి బాగా అలిసిపోయేవాడు. దానికి తోడు అదే సమయంలో కరోనా సెకండ్ లాక్ డౌన్ కావడంతో తినడానికి ఆహారం కూడా సరిగా దొరికేదికాదు. అలాగే కొన్నిచోట్ల మంచినీళ్లు కూడా సరిగ్గా లభించేవి కావు.. అయినా కూడా తన సైకిల్ ప్రయాణాన్ని ఆపలేదు. ఇలా కన్యాకుమారి నుంచి గోవా వెళ్తున్నప్పుడు తమిళనాడు మధురైలో బాగా అలసిపోయి ఆకలితో ఒక గుడిలో నీరసంతో పడుకున్నాడు. ఆ సమయంలో ఒక బిక్షగత్తే రంజిత్ ని లేపి.. తనకోసం తెచ్చుకున్న రెండు ఇడ్లీలను ఇచ్చింది.. అలాంటి సమయంలో ఆ మధుర మీనాక్షి అమ్మవారి బిక్ష గత్తే రూపంలో వచ్చి తన ఆకలి తీర్చిందని ఇప్పటికీ ఆయన గుర్తు చేసుకుంటాడు. ఇక కేరళలో లాక్డౌన్ సమయంలో సైకిల్ పంచర్ అవుతుంది.. చేతులు డబ్బులు లేకపోవడం.. తినడానికి తిండి లేకపోవడం.. ఇలా అనేక గడ్డు పరిస్థితులు వచ్చాయట. అలాంటి సమయంలో దగ్గర్లోనే ఉన్న మసీదుకు వెళ్లి తన పరిస్థితి చెప్తే ఇద్దరు ముస్లిం యువకులు రంజిత్ కు సహాయం చేశారు. రెండు రోజుల పాటు రంజిత్ కి ఆహారం పెట్టి వారితో ఉంచుకున్నారు. వారి దగ్గరలోనే మెకానిక్ తో సైకిల్ పంచులు వేయించి రంజిత్ కి సహాయం చేశారు. ఆయన జీవితంలో భయానక సంఘటన.. ఈ మొదటి యాత్రిలోనే రంజిత్ కి ఒక భయంకరమైన సంఘటన ఎదురయింది.. అదేంటంటే రంజిత్ ని కొందరికి కిడ్నాప్ చేసి.. సైకిల్ తో పాటు ఇతర సామాన్లు అన్ని దొంగిలించి.. ఒంటరిగా రోడ్డు మీద వదిలేసి పారిపోయారు.. ఈ సంఘటన కర్ణాటక లోని శివమొగ్గ జిల్లాలో రంజిత్ ఎదురైంది.. సైకిల్ తో పాటు కొంతమంది దుండగులు ఆయన దగ్గర ఉన్న సామాన్య మొత్తం ఎత్తుకెళ్లారు.. సైకిల్ లేదు సామాన్లు లేవు.. డబ్బులు లేవు.. కనీసం ఫోన్ కూడా లేదు.. అలాంటి పరిస్థితుల్లో రంజిత్ దగ్గర్లోని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. మొదటి పోలీసులు కూడా చెప్పే విషయాలు నమ్మలేదు. ఎవరైనా ఇంత దూరం సైకిల్ మీద వస్తారా అని.. రంజిత్ ని పోలీసులు ఎదురు ప్రశ్నించారు. అప్పుడు రంజిత్ తన యూట్యూబ్ వీడియోలను ఆ పోలీసులకు చూపించారు. దీంతో వారు వెంటనే ఆ దొంగలను పట్టుకుని, వారి నుంచి రంజిత్ కి సామాన్లను రికవరీ చేశారు. ఇలా అడుగడుగునా అనేక ఇబ్బందులు దాటుకుని రంజిత్ హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు తన మొదటి సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ యాత్రను రంజిత్ తన నాన్నగారికి అంకితం ఇచ్చాడు. ఇక ఇప్పటినుంచి రంజిత్ కు చాలా పాపులారిటీ వచ్చింది. ఉత్సాహంతో రంజిత్... ఇవన్నీ రంజిత్ కి మంచి ఉత్సాహాన్ని ఉత్సాహాన్ని ఇచ్చాయి. దీంతో హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్లి తిరిగి వచ్చేద్దామనుకున్న రంజిత్.. మరలా కన్యాకుమారి నుంచి గోవాకు సైకిల్ చేయాలనుకుంటాడు. కన్యాకుమారి నుంచి గోవాకు 1232 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తమిళనాడు, కర్ణాటక మీదుగా గోవా సైకిల్ చేస్తూ చేరుకున్నాడు.. ఇలా ప్రయాణిస్తున్న సందర్భంలో కూడా రంజిత్ కు అనేక సమస్యలు ఎదురవుతాయి.. అయితే త్వర త్వరగా రంజిత్ ఈ యాత్రను కూడా పూర్తి చేసి రంజిత్ వరంగల్ చేరుకుంటారు. అయితే రంజిత్ కు ఈ గోవా టూర్ లో భాగంగానే ఆయన ఛానల్ కు సబ్స్క్రయిబర్ల తాకిడి పెరుగుతుంది. ఇదే క్రమంలో ఆయనకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ రావడం కూడా ప్రారంభమవుతుంది. ఇలా రంజిత్ ఎన్నో కష్టాల నడుమ తన మొదటి సైకిల్ కూడా పూర్తి చేయగలుగుతాడు.. రెండవ సైకిల్ టూర్.. రంజిత్ తన రెండవ సైకిల్ టోన్ 2021 లోనే రెండవ టూర్ మొదలుపెట్టాడు. ఆ టూర్ లో రంజిత్ వరంగల్ నుంచి లడక్ వరకు సైక్లింగ్ చేయాలనుకుంటాడు. అయితే కరోనా లాక్డౌన్ సమయంలో సోను సూద్ చేసిన సహాయానికి బదులుగా ఆయన కోసం ఈ టూర్ ని అంకితం ఇవ్వాలి అనుకుంటాడు..అయితే ఫస్ట్ సైక్లింగ్ టూర్ వల్ల రంజిత్ కి చాలా విషయాలు తెలిసి వస్తాయి.. అప్పుడు ఉపయోగించిన సైకిల్ కెపాసిటీ హిమాలయాల్లో సైకిల్ చేయడానికి సరిపోదు అని అర్థమవుతుంది..దీంతో పాటు ప్రయత్నిస్తున్న దూరాన్ని అక్కడి వాతావరణ పరిస్థితుల్ని అన్నిటినీ అంచనా వేసి.. సొంతంగా వంట చేసుకోవడానికి చిన్న పోర్టబుల్ గ్యాస్ స్టవ్ కొని.. రాత్రులు క్యాంపు కింద ఉండేందుకు ఒక టెంట్.. సైకిల్ కి రిపేర్ వస్తే స్వయంగా తానే రిపేర్ చేసుకోవడానికి టూల్ బాక్స్.. వీడియోలు తీయడానికి కెమెరాలు ఇలా అవసరమైన ప్రతి వస్తువుని, తన బరువును కూడా మోసే విధంగా అమెరికా నుంచి ప్రత్యేకంగా సైకిల్ తెప్పించుకున్నాడు. ఈ యాత్ర సోను సూద్ కి అంకితం.. ఆ సైకిల్ మీద తనకు కావలసిన ప్రతిదాన్ని సమకూర్చుకొని 2021 జులై 18న వరంగల్ నుంచి రెండవ సైక్లింగ్ టూర్ ని ప్రారంభించాలనుకుంటాడు.. కానీ తాను వరంగల్ నుంచి లడక్ కి వెళ్లేసరికి చలికాలం మొదలవుతుంది. చలికాలంలో అక్కడ మంచు విపరీతంగా కురుస్తుందని.. సైకిల్ చాలా కష్టమవుతుందని ఆ ట్రిప్పులో కొన్ని చేంజెస్ చేసుకుంటాడు.. అదేంటంటే ముందుగా లడక్ వెళ్లి అక్కడ నుంచి వరంగల్ వరకు రావాలి అనుకుంటాడు. అంటే రివర్స్లో లడక్ నుంచి వరంగల్ వరకు సైక్లింగ్ మొదలు పెట్టడం. ఇక రంజిత్ అదే రోజు సైక్లింగ్ ప్రారంభిస్తాడు.. కరోనా కష్టకాలంలో సోనూసూద్ చేసిన పనులను దృష్టిలో పెట్టుకొని.. తన సైకిల్ వెనుక ఆయన చిత్రాన్ని బోర్డు రూపంలో పెట్టుకుని. ఈ యాత్ర సోనుసూద్ కి అంకితం ఇవ్వాలనుకుంటాడు.. ముందుగా వరంగల్ నుంచి మనాలి వరకు తన సైకిల్, ఇతర ఇతర సామాన్లతో సైక్లింగ్ చేస్తూ వెళ్తాడు.. మనాలి చేరుకొని అక్కడి నుంచి నుంచి కాశ్మీర్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర అక్కడ నుంచి వరంగల్ ఇలా సైకిల్ చేస్తూ తిరిగి వస్తాడు. మనాలిలో లతా కాశ్మీర్ లాంటి ప్రదేశాల్లో సైక్లింగ్ చేయడం అనేది చాలా కష్టమైన సాహసం అనే చెప్పవచ్చు.. పూర్తిగా హిమాలయాలు ఘాట్ రోడ్లు, మంచు చర్యలు, సముద్ర మట్టానికి అన్న ఎంతో ఎత్తైన ప్రదేశాలు ఉంటాయి. దీనివల్ల సరిగ్గా ఊపిరి కూడా ఆడని పరిస్థితుల్లో రంజిత్ సైక్లింగ్ చేసి తన గమ్యాన్ని చేరుకుంటాడు.. సోనుసూద్ తో రంజిత్.. కాశ్మీర్లో సైకిల్ చేస్తున్నప్పుడు కొందరు దుండగులు సైకిల్ కి ఉన్న భారతదేశ జాతీయ జెండాను చూసి రంజిత్ తో గొడవ పడి ఎందుకు ప్రయత్నిస్తారు. అలాగే తన సైకిల్ కి ఉన్న జెండాను తీయమంటూ బెదిరించారు. అయితే రంజిత్ ఏ మాత్రం భయపడకుండా వారితో గొడవ పెట్టుకోకుండా తిరుగు ప్రయాణం చేస్తాడు.. ఎలాగోలా బయటపడి అక్కడ నుంచి వచ్చేస్తాడు.. అయితే రంజిత్ సైకిల్ వెనుక ఉన్న సోను సూద్ ఫోటో చూసి.. అక్కడ స్థానికులు సైకిల్ తో పాటు ఫోటో తీసి ట్విట్టర్లో సోను కి ట్యాగ్ చేస్తారు. దాంతో రంజిత్ సోనూసూద్ కి ట్రైబూట్ గా చేస్తున్న సైకిల్ యాత్ర గురించి ఎట్టకేలకు ఆయనకు తెలుస్తుంది.. దాంతో ముంబైకి వచ్చినప్పుడు తన కలవాలని..రంజిత్ తో సోను మాట్లాడతాడు.. తాను ఎవరికోసమైతే ఆ యాత్ర చేస్తున్నాడో ఆ వ్యక్తి నుంచి ఫోన్ రావడంతో రంజిత్ చాలా సంతోషపడతాడు.. మరోవైపు తన యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ వస్తారు.. అలాగే సోషల్ మీడియాలో కూడా ఆయన పడుతున్న కష్టం తెలియడంతో మంచి గుర్తింపు వస్తుంది.. ఇలా రంజిత్ ఆ యాత్రను కాశ్మీర్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల మీదగా సైక్లింగ్ చేసి ముంబై వరకు చేరుకుంటాడు.. ముంబైలో సోనుసూద్ ఆఫీస్ కి వెళ్తే.. ఆ సమయంలో హైదరాబాద్ లో షూటింగ్లో ఉంటాడు.. సోనుసూద్ ని కలవాలని ఒక రోజు అంతా అక్కడే వెయిట్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సోను షూటింగ్ మధ్యలో గ్యాప్ తీసుకొని రంజిత్ ని కలవాలని ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ముంబై వచ్చి రంజిత్ తో దాదాపు అరగంట పాటు మాట్లాడాడు. కలిసిన ఆనందంలో ముంబై నుంచి మళ్లీ వరంగల్ కు సైక్లింగ్ మొదలు పెడతాడు రంజిత్.. ముంబై నుంచి వరంగల్ వస్తున్నప్పుడు మార్గమధ్యలో హైదరాబాద్ చేరుకోగానే హైదరాబాద్ రిలీఫ్ రైడర్స్ అసోసియేషన్, హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ రంజిత్ కి ఘన స్వాగతం పలుకుతాయి.. రంజిత్ పడుతున్న కష్టాన్ని గుర్తించి వారంతా సన్మానిస్తారు.. ఇక 2021 జూలై 18న రంజిత్ మొదలుపెట్టిన ఆ రెండో సైకిల్ యాత్ర... 2021 సెప్టెంబర్ 18న తిరిగి వరంగల్ కు చేరుకుంటుంది.. అంటే కేవలం రెండు నెలల్లోనే రంజిత్ 5000 కిలోమీటర్ల దూరం సైకలింగ్ చేశాడు.. ఇక రంజిత్ వరంగల్ చేరుకోగానే వావ్ వరంగల్ ఆధ్వర్యంలో రంజిత్ కి ఘన స్వాగతం లభించింది. ఇప్పుడు లక్ష్యం పెద్దది.. యాత్ర ముగిసిన తర్వాత తెలంగాణలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్ని విసిట్ చేసి వాటి విశేషాలు వివరిస్తూ యూట్యూబ్ లో వీడియోలు పెడతాడు.. అయితే ఇదే సమయంలో రంజిత్ కు ఒక ఆలోచన వస్తుంది.. ఇప్పటివరకు మొదటి రెండు టూర్లలో వరంగల్లో నుంచి బయలుదేరి కన్యాకుమారి.. అక్కడి నుంచి గోవా ఆ తర్వాత లడక్ నుంచి ముంబై వరకు వచ్చాడు. అంటే భారతదేశానికి పడమర వైపు ఉన్న సరిహద్దు మొత్తాన్ని దాదాపు సైక్లింగ్ చేశాడు.. కాబట్టి తూర్పు వైపు ఉన్న ప్రాంతాన్ని కూడా సైక్లింగ్ చేసి ఎక్స్ప్లోర్ చేస్తే భారతదేశంలో మొత్తం సరిహద్దు వెంబడి ఒక ఫుల్ రౌండ్ కొట్టినట్లు ఉంటుందని భావిస్తాడు... తనతో హైదరాబాద్ నుంచి చైనా బార్డర్ వరకు థర్డ్ సైకిలింగ్ టూర్ ప్లాన్ వేసుకుంటాడు.. అయితే మొదటి రెండుటల్లో రంజిత్ ఒంటరిగా ఫీల్ అయ్యాడు. తనతో ఈ టూర్ లో తోడుగా తన పెంపుడు కుక్క భగీరను తీసుకెళ్లాలి అనుకున్నాడు. రంజిత్ కి భారం మరింత పెరిగింది.. దాంతో 2022 ఫిబ్రవరిలో తన మూడో టూర్ను భగీరథతో మొదలు పెడతాడు.. అయితే అప్పటికి రంజిత్ సైకిల్ మీద కాస్త సామానుండేది.. ఇప్పుడు అదనంగా పెంపుడు కుక్క కూడా యాడ్ అవడంతో సైకిల్ పై భారం ఇప్పుడు మరింత పెరుగుతుంది.. భగీర బరువు దాదాపు 13 కేజీల వరకు ఉంటుంది. అంటే సైకిల్ మీద మొత్తం లగేజీ 50 కేజీల వరకు ఉంటుంది. 50 కేజీల లగేజ్ సైకిల్ తొక్కడం అనేది చాలా కష్టమైన పని.. కానీ రంజిత్ మాత్రం తన పెంపుడు కుక్కను తన వెంట తీసుకువెళ్లాడు.. భగీర కోసం ప్రత్యేకంగా ఒక బోను లాంటి దాన్ని చేయించి.. సైకిల్ కి పెట్టాడు. రంజిత్ సైకిల్ చేసినప్పుడు భగీర ఆ బోన్ లో పడుకునేందుకు ప్రత్యేకమైన సదుపాయాన్ని కూడా కల్పించాడు.. ఇలా భగీరకు కావలసిన అన్ని సౌకర్యాలను సైకిల్ మీద సెట్ చేయించాడు. నిజానికి ఇలాంటి టూర్ చేసేటప్పుడు రంజిత్ కి తన సొంత ఆహారం వండుకోవడమే కష్టం.. అలాంటి పరిస్థితుల్లో రంజిత్ తన కుక్కకు కూడా ఉండడంతో భారం మరింత పెరుగుతుంది. ఎంత కష్టమైనా రంజిత్ తగ్గకుండా తన సైక్లింగ్ ని ముందుకు కొనసాగిస్తూనే ఉంటాడు.. అలా రంజిత్ మూగజీవాల మీద ఉన్న తన ప్రేమను భగీర రూపంలో అందరికీ అర్థమయ్యేలా తెలియజేస్తాడు. ఇక రంజిత్ అతని పెంపుడు కుక్కతో కలిసి హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్ కలకత్తా, అస్సాం, సిక్కిం ఇలా ఇండియాలోనే ఈస్ట్.. నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్ని కవర్ చేస్తాడు. ఈ టూర్ లో హిమాలయాల్లోని చైనా టిబెట్ బార్డర్ కు చేరుకుంటాడు. దాంతో రంజిత్ దాదాపుగా ఇండియా చుట్టూ సైకిల్ చేసిన వాడయ్యాడు.. రంజిత్ ఈ మూడవ టూర్ లో 6000 కిలోమీటర్లు భగీరతో సైక్లింగ్ చేశాడు. వీడియోలకు అద్భుతమైన రెస్పాన్స్.. నిజానికి హైదరాబాద్ నుంచి చైనా బోర్డర్ వరకు వెళ్లాలంటే 2500 కిలోమీటర్లలో చేరుకోవచ్చు.. కానీ అలా చేస్తే ఇండియా చుట్టూ తిరిగినట్టు అవ్వదు. కాబట్టి ఇలా 6000 కిలోమీటర్లు అదనంగా సైక్లింగ్ చేసి ఇండియా చుట్టూ సైక్లింగ్ పూర్తి చేశాడు. ఈ టూర్ లో తనతో పాటు భగీర ఉండటంతో తన వీడియోలు ఇంకా మంచి రెస్పాన్స్ లభించింది. ఇక రాత్రులు పెట్రోల్ బంకులో టెంటు వేసుకుని పడుకునే వాడు.. ప్రతిసారి పడుకోవడానికి పెట్రోల్ బంక్ దొరికేదికాదు. దీనికి తోడు భగీర కూడా వేరే కుక్కతో వెళ్తూ ఉండేది.. దీంతో ఈ సమయంలో సైక్లింగ్ చేసి పూర్తిగా అలిసిపోయేవాడు... అయితే పెంపుడు కుక్కల్ని గొలుసులతో కట్టేసి వాటికి స్వేచ్ఛ లేకుండా చేయొద్దని.. వాటిని కూడా స్వేచ్ఛగా తిరగనివ్వాలనే ఉద్దేశంతో తనతో పాటు తన కుక్కను తీసుకెళ్లినట్టు చెప్పాడు. అయితే ఈ యాత్రను మహేష్ బాబు ఎందరో చిన్నపిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేపిస్తున్నందుకు రంజిత్ అతనికి అంకితం ఇచ్చాడు. ఇంటర్నేషనల్ టూర్... ఈసారి 2022 నవంబర్లో తన నాలుగో టూర్ లో భాగంగా రంజిత్ ఇంటర్నేషనల్ టూర్ ప్లాన్ చేశాడు.. ముందుగా తక్కువ బడ్జెట్లో అయిపోయేలా శ్రీలంక సైకిల్ మీదగా సైక్లింగ్ ఎక్స్ప్లోర్ చేయాలని రంజిత్ అనుకుంటాడు.. దీనికోసం సైకిల్ మొత్తం విడిభాగాలుగా విడదీసి ఒక బాక్స్ లో ప్యాక్ చేసుకొని ఫ్లైట్లో శ్రీలంకకు కార్గో చేస్తాడు. సైకిల్ను మళ్ళీ బిగించి శ్రీలంకలో సైకిల్ చేయడం మొదలు పెడతాడు. ఇక శ్రీలంక చిన్న దేశం కావడంతో 30 రోజుల్లోనే సైక్లింగ్ చేసేస్తాడు. శ్రీలంక చుట్టూ సైకిల్ మీద ఒక రౌండు టూర్ వేస్తాడు. శ్రీలంకలో సైక్లింగ్ చేస్తూ అక్కడి సాంప్రదాయాలను.. అక్కడ దేవాలయాలను పూర్తిగా అందరికీ యూట్యూబ్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాడు.. అలాగే రామాయణానికి సంబంధించిన అనేక విషయాలలో రావణాసురుకి చెందిన పురాతన విషయాలను అన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తాడు. శ్రీలంకలో ఒక ట్రైబల్ తెగతో అడవిలోకి వెళ్లి.. వారు వేటాడే పద్ధతులని స్వయంగా ఎక్స్ప్లోర్ చేస్తాడు.. ఎన్నో కష్టాలు పడి ఈ టూర్ మొత్తం కంప్లీట్ చేసి.. దీనిని రతన్ టాటా కి అంకితం చేశాడు. అరుదైన రికార్డుతో రంజిత్... శ్రీలంక సైకిల్ టూర్ అయిపోయిన తర్వాత.. ఐదో టూర్ గా 2023 మార్చ్ లో ఇండియా టు ఆస్ట్రేలియా కు సైక్లింగ్ మొదలు పెడతాడు.. శ్రీలంక టూర్తో మొదటిసారి దేశాన్ని దాటి..సైకిలింగ్ చేసిన రంజిత్ ఈసారి ఏకంగా ఖండాలను దాటి సైకిలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆసియా ఖండంలో సైకిల్ చేసే ఖండాంతరాలను దాటి సైకలింగ్ చేయడం మొదలుపెట్టాడు.. పొల్యూషన్ కి సొల్యూషన్ అని నినాదంతో ప్రతి చిన్న పనికి మోటార్ సైకిల్ మీద వెళ్తున్న మనం సైకిల్ ను ఉపయోగించి.. పొల్యూషన్ తగ్గించే విధంగా కృషి చేయాలని.. ఆలోచనతో సైక్లింగ్ ద్వారా శారీరక శ్రమను ప్రోత్సహించాలని రంజిత్ ఈ సైకిల్ టూర్ ప్రారంభిస్తాడు.. ఇండియా, వియత్నం, కంబోడియా, థాయిలాండ్, మలేషియా సింగపూర్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా ప్రపంచంలో ఉన్న ఏడు ఖండాల్లో సైకిల్ చేయాలనేది రంజిత్ కళ కాబట్టి.. మొదట ఇండియా టు ఆస్ట్రేలియా.. సెకండ్ ఆసియా ఆస్ట్రేలియా అవుతుందనేది రంజిత్ ఆలోచ.. ఆలోచనకు తగ్గట్టుగా రంజిత్ 2023 మే నెలలో హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా టూర్ మొదలు పెడతాడు.. Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో వియత్నం వెళ్తాడు. సైకిల్ కూడా బాక్స్ లో ప్యాక్ చేసి అక్కడికి తీసుకెళ్తాడు.. ఇక వియత్నం చేరుకున్న తర్వాత ఎయిర్పోర్ట్లో 30 రోజులకు వీసా తీసుకుని.. ఆ తర్వాత సైకిల్ చేయించుకుని.. అక్కడినుంచి సైక్లింగ్ చేయడం మొదలు పెడతాడు. అక్కడ రంజిత్.. ప్రజలను వారి అలవాట్లను అన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తాడు. ఆ తర్వాత ఆయన కంబోడియా వెళ్లి కొన్ని రోజులపాటు సైక్లింగ్ చేస్తాడు. ఆ తర్వాత థాయిలాండ్, మలేషియా కూడా వెళ్తాడు.. ఇక ఆ తర్వాత రంజిత్ జపాన్ వెళ్లి.. 18 రోజుల్లోనే 17000 కిలోమీటర్లకు పైగా సైక్లింగ్ చేశాడు. ఇప్పటికీ రంజిత్ పది దేశాలకు పైగా సైక్లింగ్ చేసిన అనుభవాన్ని పొందాడు.. ఇలా రంజిత్ తన సైకిల్ యాత్రలో భాగంగా ఎంతో కష్టపడుతూ లక్ష్యం దిశగా దూసుకుపోతున్నాడు. ఇటీవల రంజిత్ సైకిల్ యాత్రలో భాగంగా 41,400kms ప్రయాణం చేసి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.. Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా? స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None
Popular Tags:
Share This Post:
Harish Rao: ఫార్ములా ఈ రేసు కేసు మొత్తం డొల్ల.. కేటీఆర్‌కు తొలి విజయం
- by Sarkai Info
- December 20, 2024
What’s New
Pineapple: చలికాలంలో వచ్చే జలుబు, దగ్గుకు ఈ పండు దివ్యౌషధం...
- By Sarkai Info
- December 20, 2024
Spotlight
Pomegranate Peel Tea: దానిమ్మ తొక్క టీతో సులువుగా బరువు తగ్గవచ్చు...!
- by Sarkai Info
- December 20, 2024
Mufasa Movie Review: ముఫాసా మూవీ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిందా..?
- by Sarkai Info
- December 20, 2024
Today’s Hot
-
- December 20, 2024
-
- December 20, 2024
-
- December 20, 2024
Mulberry Vs Diabetes: షుగర్‌ను నార్మల్ చేయడంలో ఈ పండు అమూల్యమైనది..!
- By Sarkai Info
- December 20, 2024
Featured News
Latest From This Week
Vidudala 2 Movie Review: ‘విడుదల పార్ట్ 2’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..
TELUGU
- by Sarkai Info
- December 20, 2024
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.