TELUGU

Female Chinese Official: ఓ అందమైన 52 ఏళ్ల ఆఫీసర్‌ భాగోతం.. 58 మంది స్టాఫ్‌తో లైంగిక సంబంధం.. 71 కోట్ల అవినీతి చివరకు..?

Female Chinese Official Imprisoned: సాధారణంగా మన దేశంలో అయితే, ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ ఫైళ్లు కదలాలన్న చాలా వరకు అధికారులు టేబుల్‌ కింద చేయి పెడతారు. ఆ విధంగా వారు కోట్లలో డబ్బు సంపాదిస్తారు. అయితే, చైనాకు చెందిన ఓ అధికారి జాంగ్‌ యాంగ్‌ కూడా ఇదే అడ్డదారిని వెతుక్కుంది. 52 ఏళ్ల ఈ మహిళ అధికారి, తన పవర్‌ను ఉపయోగించి కోట్లలో అవినీతికి పాల్పడింది. దాన్ని కప్పిపుచ్చడానికి దాదాపు 58 మంది తన కింద పనిచేసే ఉద్యోగులతో లైంగిక సంబంధం పెట్టుకుంది. విషయం బట్టబయలై చివరకు ఆమెకు చైనీస్‌ ప్రభుత్వం 13 ఏళ్ల జైలు శిక్షతోపాటు భారీ జరిమానా కూడా విధించింది. జాంగ్‌ యాంగ్‌ భాగోతం తెలిసిన అధికారుల కళ్లు బైర్లుకమ్మి ఆమెను ఏప్రిల్‌లోనే ఉద్యోగంలో నుంచి తొలగించారు. ఈమె దాదాపు 60 మిలియన్ల యువన్‌ (దాదాపు 71 కోట్లు) అవినీతికి పాల్పడిందని ఆ మధ్య జరిగిన చైనీస్‌ స్టింగ్‌ ఆపరేషన్‌లో అసలు విషయం బట్టబయలైంది. యాంగ్‌ జాంగ్‌ కియాన్నాన్‌ బయే మియావో ప్రీఫెక్చర్‌లో గ్యుజో ప్రొవిన్స్ గవర్నర్‌, డిప్యూటీ సెక్రెటరీగా పనిచేసింది. ఆమె సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందింది. 22 ఏళ్ల వయస్సులోనే చైనా కమ్యూనిస్ట్‌ పార్టీరాజకీయాల్లోకి అడుగుపెట్టింది. అయితే, స్థానిక మీడియా రిపోర్టుల ప్రకారం యాంగ్‌ జాంగ్‌ డబ్బు సంపాదించాలనే దుర్భుద్ధితో కోట్లలో అవినీతికి పాల్పడింది. ఎక్కడ ఈ విషయం బయటకు తెలుస్తుందో అని తన కింద పనిచేసే స్టాఫ్‌తో కూడా ఆమె లైంగిక సంబంధాలు కొనసాగిస్తూ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంది. అయితే, స్టింగ్‌ ఆపరేషన్‌లో ఈమె గుట్టురట్టయింది. దీంతో ఏప్రిల్‌లోనే ఈమెను ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే, యాంగ్‌కు చైనీస్‌ ప్రభుత్వం 13 ఏళ్ల జైలు శిక్ష విధించిందని ఇటీవల వార్త కథనాల ద్వారా తెలిసింది. దీంతోపాటు ఆమెకు ఒక్క మిలియన్‌ యువన్‌ జరిమాన్‌ కూడా విధించిందట. ఈ కరుడుగట్టిన లేడీ జీవితంలో పెళ్లి కూడా చేసుకోలేదట. ఎవ్వరితో రిలేషన్‌లో ఉన్నా పిల్లల్ని కూడా కనలేదట. ఇదీ చదవండి: టెట్‌ అభ్యర్థులకు అలెర్ట్‌.. హాల్‌ టిక్కెట్లు విడుదల ఇలా నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి.. తన మగ ఉద్యోగులతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటుంది కాబట్టి ఎప్పుడు తన హ్యాండ్‌ బ్యాగ్‌లో కండోమ్‌ ప్యాకెట్లు కూడా ఉండేవట. ఇలా తనతో రిలేషన్‌లో ఉన్న మగ ఎంప్లాయీస్‌ను బిజినిస్‌ ట్రిప్పులకు తీసుకువెళ్లేది. అక్కడ తన లవర్లతో ఎంజాయ్‌ చేసేంది వారికి ఓవర్‌ టైమ్‌ వర్క్‌ నుంచి కూడా మినహాయించేదట. ఓ స్థానిక వార్త కథనం ప్రకారం ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ఆ ఉద్యోగులు చెప్పిన కారణం తను అందంగా ఉండటం, అతిగా ప్రేమ చూపించడం, తాను పై అధికారి అని భయపడి సంబంధం కొనసాగించేవారట. ఎక్కువ శాతం ఈమె నైట్‌క్లబ్బులకు వెళ్లేది. ఇదీ చదవండి: 117 రోజులపాటు వక్రగతిలో దేవ గురువు.. ఈ 5 రాశులకు పట్టిన అదృష్టం మామూలుది కాదు..! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.