TELUGU

Mass Pager Explosions: పేజర్లతో హిజ్ బుల్లా మిలిటెంట్ల లక్ష్యంగా పేలుళ్లు.. ఇజ్రాయిల్ పనే అంటున్న లెబనాన్..

Mass Pager Explosions in Lebanon : గత కొన్నేళ్లుగా పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకున్నాయి. ఒకరిపై ఒకరు నిరంతరం దాడులు చేసుకుంటున్నారు. ఇజ్రాయిల్ ఒక్క దేశమే ఒంటరి పోరాటం చేస్తుంటే.. పాలస్తీనాకు లెబనాన్, సిరియా వంటి ఇస్లామిక్ దేశాలు మద్దతు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో లెబనాన్, సిరియా దేశాల్లో దాదాపు ఒకే సమయంలో వందల కొద్దీ పేజర్లు పేలిపోవడంతో ఇదంతా ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొస్సాద్ పనే అంటున్నాయి. దీంతో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త యుద్ధ వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజులుగా ప్రత్యక్షంగా పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. రీసెంట్ గా ఇస్మాయిల్ హనీ ని హత్య వెనక ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొస్సాద్ హస్తం ఉందని చెబుతున్నారు. కానీ అది ప్రూవ్ కాలేదు. తాజాగా లెబనాన్ రాజధాని బీరూట్ తో పాటు సిరియా రాజధాని డెమాస్కస్ లో మంగళవారం అనుకోని పరిణామం సంభవించింది. ఒకేసారి వందలాది పేజర్లు పేలిపోలియి దీంతో 9 మంది మృతి చెందినట్టు సమాచారం. మరోవైపు 3 వేలకు పైగా తీవ్ర గాయాలపాలయినట్టు చెబుతున్నారు. ఈ దాడి నేపథ్యంలో సిరియాలోనే దాదాపు ఏడుగురు మృతి చెందినట్టు చెబుతున్నారు. గాయపడిన వారిలో హెజ్ బొల్లా నేతలతో పాటు లెబనాన్ లోని ఇరాన్ రాయబారి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పేలుడు ఘటనలో ఇద్దరు హెజ్ బోల్లా నాయకులు మృతి చెందినట్టు లెబనాన్ ప్రకటించింది. అటు ఒక ఎంపీ కొడుకు, ఇరాన్ రాయబారి కార్యాలయ సిబ్బంది వద్దన్న పేజర్ మొదట పేలిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హెజ్ బొల్లా ఛీఫ్ నస్రుల్లా హనీని టార్గెట్ గా ఈ పేలుళ్లు జరిగనట్టు తెలుస్తుంది. కానీ ఈ ఘటనలో హెజ్ బొల్లా ఛీప్ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదనే ఓ ప్రకటన విడుదల చేశారు. మన దగ్గర సెల్ ఫోన్స్ రాకముందు పేజర్లను ఎక్కువగా వాడేవారు. సెల్ ఫోన్ అంతా పరికరం ఉండే ఈ పేజర్ల ద్వారా ఫోన్ ద్వారా మెసెజ్ పంపిస్తే.. అప్పట్లో వారు దగ్గరలోని పబ్లిక్ టెలిఫోన్ నుంచి ఫోన్ చేసేవారు. అయితే.. పేజర్లన్ని ఒకేసారి పేలడం వెనక ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొస్సాద్ ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లెబనాన్ లో హెజ్ బుల్లకు సొంత కమ్యూనికేషన్ నెట్ వర్క్ ఉంది. ఈ కమ్యూనికేషన్స్ నెట్ వర్క్ లో ఇజ్రాయిల్ ప్రవేశించి ఉండొచ్చనే చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా హెజ్ బొల్లా టాప్ కమాండర్స్ లక్ష్యంగా ఇజ్రాయిల్ ఈ తరహా లక్షిత దాడులు నిర్వహిస్తున్నట్లు పలు దేశాల ఇంటెలిజెన్స్ విభాగాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటనపై ఇజ్రాయిల్ ఇంకా స్పందించలేదు. ఈ దాడిపై భిన్నవాదనలు వ్యక్తం అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ గాజా వార్ షురూ అయినప్పటి నుంచి మొబైల్ ఫోన్స్ వాడొద్దని హెజ్ బొల్లా తన క్యాడర్ కు హెచ్చరికలు జారీ చేసింది. ఫోన్లు వాడితే వాటిలోకి ఇజ్రాయిల్ గూఢచారులు సులభంగా యాక్సెస్ అయ్యే అవకాశాలున్నాయనే నేపథ్యంలో ఈ ముఠా పేజర్లను ఎక్కువగా యూజ్ చేస్తుంది. తాజాగా పేలిన పేజర్లన్ని కొత్తగా తయారైనవే అని చెబుతున్నారు. ఇజ్రాయిల్ గూఢచార సంస్థలే ఈ పేజర్లలోకి ముందుగానే మందు గుండు సామాగ్రిని పెట్టినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తీరా సరైన సమయం చూసుకొని లక్ష్యిత దాడులు నిర్వహించినట్టు ఈ పేలుళ్లను చూస్తే తెలుస్తుంది. ముందుగా పేజర్లోని లిథియం అయాన్ బ్యాటరీలను వేడెక్కేలా చేసి.. ఈ బ్లాస్ట్ క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. హ్యాకర్లు ఈ పేజర్లోకి ప్రవేశించి ఏదో సిగ్నిల్ ద్వారా బ్యాటరీ వేడెక్కెలా చేసి ఈ దాడులకు తెగబడినట్టు తెలుస్తుందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే.. ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.