TELUGU

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 18 ఏళ్లకే చెస్ ప్రపంచ ఛాంపియన్‌

Chess Player Gukesh: ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. భారత చెస్ ప్లేయర్ డి గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేష్ డి ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. భారత్‌కు చెందిన 18 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ 14వ, చివరి గేమ్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా ఘనత సాధించాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా కూడా గుకేశ్ నిలిచాడు. ఈ పక్షం రోజుల పాటు జరిగిన ప్రపంచ చెస్ టోర్నమెంట్‌లో, గుకేశ్ అద్భుతంగా ఆడి, చాలాసార్లు వెనుకబడిన తర్వాత అద్భుతంగా పునరాగమనం చేశాడు. చివరికి 14వ గేమ్‌లో గెలిచి చరిత్ర సృష్టించాడు. చైనాకు చెందిన లిరెన్ 2023లో రష్యా ఆటగాడు ఇయాన్ నెపోమ్నియాచితో జరిగిన అస్థిర మ్యాచ్‌లో విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు, అయితే ఈసారి గుకేష్ తన కలను సాకారం చేసుకున్నాడు. 🇮🇳 GUKESH D WINS THE 2024 FIDE WORLD CHAMPIONSHIP! 👏 🔥 #DingGukesh pic.twitter.com/aFNt2RO3UK — International Chess Federation (@FIDE_chess) December 12, 2024 గత ఏడాది డిసెంబర్‌లో చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నమెంట్‌లో గెలిచి క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో చేరడంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌కు గుకేశ్ ప్రయాణం ప్రారంభమైంది. అమెరికన్ జోడీ ఫాబియానో ​​కరువానా, హికారు నకమురా క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో బలమైన పోటీదారుగా ఉన్నారు. అయితే గుకేశ్ క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో అందరినీ ఓడించి గెలుపొందడం ద్వారా చెస్ ప్రపంచంలో తుఫాను సృష్టించా. ఆర్ ప్రజ్ఞానంద కూడా అందులో ఉన్నాడు. THE EMOTIONS...!!! 🥹❤️ - 18 Year Old Gukesh Dommaraju creating history by becoming the youngest ever champion. 🇮🇳 pic.twitter.com/LVkA8JMKM1 — Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2024 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.