TELUGU

Israel vs Iran: ఇజ్రాయిల్ ప్లాన్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే.. ఇరాన్ ఇంటెలిజెన్స్ బాసే ఇజ్రాయెల్ గూఢచారి అంటా.. వెలుగులోకి సంచలన విషయాలు

Iran's Intelligence Boss : హిజ్బుల్లాను పాతాలంలోకి తొక్కేందుకు ఇజ్రాయిల్ వేసిన ప్లాన్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే. అవును హిజ్బుల్లా అధినేత సస్రల్లా లొకేషన్ సమాచారాన్ని ఇజ్రాయిల్ అధికారులకు అందించింది ఎవరో కాదు ఇరాన్ ఇంటెలిజెన్స్ బాసే అంటా. ఈ విషయాన్ని ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమ్మూద్ అహ్మదినేజాద్ స్వయంగా వెల్లడించారు. ఇరాన్ కు సంబంధించిన రహస్యాలన్నీ తెలుసుకునేందుకు మరో 20 మంది సీక్రెట్ గా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యకు దారితీసిన ఇరాన్ ఇన్ఫార్మర్ ఇజ్రాయెల్‌కు కీలకమైన ఇంటెలిజెన్స్‌ను అందించినట్లు నివేదికలు వచ్చిన కొద్ది రోజుల తర్వాత.. ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్ ఇజ్రాయెల్ గూఢచర్యాన్ని ఎదుర్కోవడానికి ఇరాన్‌లో పనిచేస్తున్న ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ తొత్తుగా వ్యవహారిస్తున్నారని ఆరోపణలు చేశారు. CNN-టర్క్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అహ్మదీనెజాద్ ఇరాన్‌లో పనిచేస్తున్న మొస్సాద్‌ను ఎదుర్కోవడానికి ఇరాన్ రహస్య సేవలు ఒక ప్రత్యేక విభాగాన్ని సృష్టించాయని..అందులో 20 మంది ఇజ్రాయెల్ ఏజెంట్లు కూడా ఉన్నారని చెప్పారు. ఇరాన్ మాజీ అధ్యక్షుడు చేసిన ఈ ఆరోపణలు ఒక్కసారిగా రాజకీయ కలకలం రేపాయి. ఇరాన్ అణు కార్యక్రమం గురించి సమాచారాన్ని ఇజ్రాయెల్ కు చేరవేయడమే మొసాద్ ఆపరేషన్ లక్ష్యం అని అహ్మదీనెజాద్ పేర్కొన్నాడు. ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖలోని కౌంటర్ ఇజ్రాయెల్ విభాగానికి అధిపతి ఇజ్రాయెల్ ఏజెంట్ అని అహ్మదీనెజాద్ అవుట్‌లెట్‌తో చెప్పారు. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ కోసం ఇరాన్ ఇంటెలిజెన్స్ సర్వీసుల్లోకి మొసాద్ చొరబడినట్లు మాజీ అధ్యక్షుడు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యమైన అణు పత్రాలను దొంగిలించారని సంచలన ఆరోపణలు చేశారు. 🇮🇱🇮🇷🚨‼️ The boss of the Iranian anti Mossad intelligence agency was a MOSSAD AGENT! Iran’s secret services had created a special unit to combat Mossad operating in Iran. It turns out the head of this unit was himself a Mossad agent, along with 20 other agents, who were… pic.twitter.com/cZcGl1ldIq — Lord Bebo (@MyLordBebo) September 30, 2024 టర్కీటుడే నివేదిక ప్రకారం, ఇరాన్ గూఢచారిలో దాదాపు రెండు డజన్ల మంది ఇరానియన్లు మొసాద్‌కు గూఢచారులుగా పనిచేస్తున్నారని అహ్మదీనెజాద్ ఆరోపణలు చేశారు. ఇరాన్‌లో కార్యకలాపాల కోసం ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్ తన కార్యకర్తలను క్రియాశీలం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆరేళ్ల క్రితం 2018లో, ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమానికి సంబంధించిన ఫైళ్లను ఇజ్రాయెల్ పొందిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. Read Also : Swiggy: స్విగ్గి లవర్స్‎కు గుడ్‎న్యూస్.. దీపావళి సందర్భంగా రోజంతా ఫ్రీ డెలివరీ.. నమ్మలేకపోతున్నారా? ఆరేండ్ల క్రితం..మొస్సాద్ ఏజెంట్లు టెహ్రాన్ అర్థరాత్రి ఆపరేషన్ నిర్వహించారు. ఇరాన్ అణ్వాయుధాల సమాచారం నిక్షిప్తమై ఉన్న లక్ష కంటే ఎక్కువ డాక్యుమెంట్లను దొంగలించారు. దాదాపు 6 గంటలపాటు సాగిన ఈ ఆపరేషన్ లో డాక్కుమెంట్లను యాక్సెస్ చేసేందుకు దాదాపు 20మందికిపైగా ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ డాక్యుమెంట్స్ ను నెతన్యాహు టెల్ అవీవ్ లో ప్రపంచానికి అందించారు. 2015లో ఇరాన్ తో ఒప్పందం నుంచి వైదొలగించేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదంతా చేయించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. కాగా 2008లో మొస్సాద్ తొలిసార హిజ్బుల్లా టాప్ ఆపరేటివ్ ఇమాద్ ముగ్నియాహ్ ను సిరియాలో అంతమొందించింది. 2020లో ఇరానీ కమాండర్ ఖాసిం సులేమానీ సమాచారం అమెరికా దళాలకు అందించింది కూడా మొస్సాదే. జులైలో హిజ్బుల్లా టాప్ కమాండ్ ఫాద్ షుక్రును చంపింది.ఈమధ్యే రద్వాన్ ఫోర్స్ కమాండ్ ఇబ్రహీం అకిల్ ను కూడా మట్టుబెట్టింది. ఆ తర్వాత హిజ్బుల్లా కమాండ్ మొత్తాన్ని పేకమేడలా కూల్చేసింది. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హిజ్బుల్లా అధినేత నస్రల్లా మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇరువర్గాలు ధ్రువీకరించాయి. అయితే నస్రల్లా సమాచారాన్ని ఇజ్రాయెల్ కు అందించింది ఇరాన్ ఇంటలిజెన్స్ బాసే అంటూ ఆ దేశ మాజీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. Read Also : SSY, PPF New Rules 2024: సుకన్య సమృద్ధి, పీపీఎఫ్‎లో కీలక మార్పులు..నేటి నుంచి అమల్లోకి కొత్త వడ్డీ రేట్లు.. పూర్తి జాబితా ఇదే స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook , Twitter None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.