TELUGU

Bangladesh: బంగ్లాదేశ్ లో దారుణం..హిందూ మహిళా జర్నలిస్టుపై దాడి ..భారత్ ఏజెంట్ అంటూ

Bangladesh: బంగ్లాదేశ్ లో మతోన్మాదులు రెచ్చిపోయారు. ప్రముఖ హిందూ మహిళా జర్నలిస్టుపై దాడిక పాల్పడ్డారు. బంగ్లాదేశ్‌ను భారత్‌లో భాగం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తూ బంగ్లాదేశ్ సీనియర్ జర్నలిస్టు మున్నీ సాహాను గుంపు గత రాత్రి ఢాకాలో చుట్టుముట్టింది. సాహా ఒక భారతీయ ఏజెంట్ అంటూ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మద్దతుదారని మూక ఆరోపించింది. చివరకు పోలీసులు కలుగజేసుకుని ఆమెను రక్షించారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం జర్నలిస్టు కారును గుంపు అడ్డుకుందని..ఆమెపై దుర్భాషలాడుతూ దాడికి చేసేందుకు ప్రయత్నించారు. చుట్టుపక్కల జనాలు మహిళా జర్నలిస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమెను పోలీసులు రక్షించి తేజ్ గావ్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లినట్లు తెలిపింది . ఆ తర్వాత ఢాకా మెట్రోపాలిటన్ డిటెక్టివ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలించారు. దీంతో ఆమెను అరెస్టు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆమెను అరెస్టు చేయలేదని తెల్లవారుజామున విడుదల చేసినట్లు బంగ్లాదేశ్ పోలీసులు వివరణ ఇచ్చారు. ఆమె తీవ్ర భయాందోళనకు గురైనట్లు వారు తెలిపారు. పోలీసులు మున్నీ సాహాను అదుపులోకి తీసుకోలేదని..ఆమె కార్యాలయం వెలుపల ఉన్న కవ్రాన్ బజార్ దగ్గర కొంతమంది వ్యక్తులు ఆమెను అడ్డుకున్నారు. తర్వాత భద్రతా కారణాల ద్రుష్ట్యా తేజ్ గావ్ పోలీసులు ఆమెను డీబీ కార్యాలయానికి తీసుకెళ్లారని ఓ అధికారి తెలిపారు. సాహా నాలుగు కేసుల్లో నిందితురాలిగా ఉన్నారని బెయిల్ కోసం కోర్టుకు హాజరుకావాలని భవిష్యత్తులో పోలీసు సమన్లను పాటించాలని అధికారులు చెప్పారు. కాగా సాహాను వేధించిన వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వైరల్ గా మారిన ఈ దాడి వీడియోలో 57 మంది ప్రాణాలు బలిగొన్న బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుకు సంబధించి ఆమె ప్రజలను తప్పుదారి పట్టించిదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. Also read: EPFO Big Decision: పీఎఫ్ సభ్యులకు గుడ్‌న్యూస్, ఇక నుంచి అదనపు వడ్డీ మీరు ఈ దేశాన్ని భారత్ లో భాగం చేసేందుకు చేయగలిగినదంతా చేస్తున్నారని..విద్యార్థుల రక్తం మీ చేతులకు అంటుకుందని ఆమెను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. మీరు ఈ దేశ పౌరురాలిగా ఉండీ ఈ దేశానికి హాని ఎలా తలపెడతారంటూ ప్రశ్నించారు. কারওয়ানবাজার থেকে সাংবাদিক মুন্নী সাহা গ্রেপ্তার | Munni Saha Arrest | Channel 24 pic.twitter.com/xq7x0HHkzd — Md. Sohel Rana (@mdsohelrana7707) December 1, 2024 కాగా 55 ఏళ్ల జర్నలిస్టు గతంలో బెంగాలీ ఛానెల్ ఏటీఎన్ న్యూస్ హెడ్‌గా ఉన్నారు. షేక్ హసీనా పరిపాలన కూలదోయబడిన తర్వాత, ఆమెతోపాటు అనేక మంది ఇతర జర్నలిస్టులు మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రాజకీయ మార్పు తరువాత బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువుల పరిస్థితి గురించి ఆందోళనల మధ్య సాహా హెక్లింగ్ వచ్చింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.