TELUGU

Ind Vs Aus 2nd Test Updates: నన్ను గెలికితే ఇలానే ఉంటది.. జైస్వాల్‌పై కసి తీర్చుకున్న స్టార్క్

Australia vs India 2nd Test Updates: తొలి టెస్టులో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్.. రెండో టెస్టులోనూ అదే ఊపు కంటిన్యూ చేయాలని చూస్తోంది. ఆడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఆరంభమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు పగ్గాలు చేపట్టాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా.. మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్టులో మూడు మార్పులతో భారత్ బరిలోకి దిగగా.. ఆసీస్ తుది జట్టులో ఒక మార్పుతో ఇప్పటికే ప్రకటించింది. పేసర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా రెండో టెస్ట్‌కు దూరమవుతున్నట్లు ఇప్పటికే ఆసీస్ మేనేజ్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మతోపాటు శుభ్‌మన్ గిల్, రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి వచ్చారు. పడిక్కల్, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్ బెంచ్‌కే పరిమితమయ్యారు. హేజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్‌ను ఆసీస్ తుది జట్టులోకి వచ్చాడు. మొదట బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు ఆరంభంలోనే బిగ్‌షాక్ తగిలింది. తొలి బంతికే ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జైస్వాల్‌ను మిచెల్ స్టార్క్ డకౌట్ చేశాడు. ఎల్బీడబ్ల్యూ రూపంలో జైస్వాల్‌ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. గత మ్యాచ్‌లో సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో దుమ్ములేపిన జైస్వాల్.. మధ్య మధ్యలో స్టార్క్‌ను కవ్వించిన విషయం తెలిసిందే. అందుకు రివేంజ్‌గా ఇప్పుడు తొలి బంతికే ఔట్ చేశానన్నట్లు స్టార్క్ సంబరాల్లో మునిగిపోయాడు. మరో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ రావడంతో రోహిత్ శర్మ చాలా ఏళ్ల తరువాత మళ్లీ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు. జైస్వాల్ ఔట్ కావడంతో శుభ్‌మన్ గిల్ క్రీజ్‌లోకి వచ్చాడు. Yashasvi Jaiswal hit a four on the same ball in the first test against Mitchell Starc #AUSvIND pic.twitter.com/aizNkFGHgU — Revengeseeker07 (@revengeseeker07) December 6, 2024 ప్రస్తుతం వీరిద్దరు సమర్థవంతంగా ఆసీస్‌ బౌలర్లను ఎదుర్కొన్నారు. కేఎల్ రాహుల్ (37), శుభ్‌మన్ గిల్ (30 నాటౌట్) రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక కేఎల్ రాహుల్‌కు ఒకే ఓవర్‌లో రెండు లైఫ్‌లు వచ్చాయి. బోలాండ్ వేసిన ఓవర్‌లో బంతి బ్యాట్‌ను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. వికెట్ పడిందని ఆసీస్ ప్లేయర్లు సంబరాలు చేసుకునేలోపు అంపైర్ నోబాల్‌గా ప్రకటించారు. ఆ తరువాత బంతికే బ్యాట్‌ ఎడ్జ్‌కు తాకి స్లిప్స్‌లోకి వెళ్లగా.. ఫీల్డర్ క్యాచ్‌ అందులేకపోయాడు. 37 పరుగులు చేసిన కేఎల్ రాహుల్‌ను స్టార్క్ పెవిలియన్‌కు పంపించాడు. శుభ్‌మన్ గిల్‌కు విరాట్ కోహ్లీ జత కలిశాడు. తుది జట్లు ఇలా.. ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్ భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), నితీష్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. Also Read: టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే.. Also Read: Telangana Bandh: తెలంగాణలో ఈనెల 9న స్కూళ్లు, కాలేజీల బంద్‌ పిలుపు..! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook , Twitter None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.