TELUGU

Burkina Faso: అత్యంత పాశవికం.. గంటల వ్యవధిలో 600 మంది ఊచకోత..!

600 killed in Burkina faso: ఆఫ్రిక దేశంలోని బుర్కినా ఫాసలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు గ్రామలపై పడి 600 మంది గ్రామస్థులను కేవలం గంటల వ్యవధిలోనే దొరికనవారిని దొరికినట్లుగా కాల్చి చంపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ దారుణ ఘటన ఆగస్టులోనే జరిగింది. అయితే అంతర్జాతీయ మీడియా ప్రకారం ఈ ఘటన ఆగస్టు 24న బుర్కినా లోగో లో చోటుచేసుకుంది. ఈ ఉన్మాదానికి పాల్పడింది అక్కడి జమాత్ నుస్రత్ ఆల్ ఇస్లాం వాల్ ముస్లిమ్ ఇన్ టెర్రరిస్టులు. ఒక్కసారిగా ఈ ప్రాంతం పై వీళ్ళు విరుచుకుపడగా అందరూ అక్కడి నుంచి పారిపోతున్నారు. ఆ సమయంలో ఉగ్రమూకలు కనిపించిన వారిని కనినిపంచినట్లుగా కాల్చేశారు. ఈ ఘటనలో ఎక్కువ శాతం మంది మహిళలు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. దొరికిన వారిని దొరికినట్టుగా పిట్టల్ని కాల్చినట్టుగా కాల్చి వేశారు ఉగ్రవాదులు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యంత పాశవికమైన ఈ ఘటనతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాలిలోని ఆల్‌ఖైదా అనుబంధ సంస్థ బుర్కిన పాసోలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. అయితే ఐక్యరాజ్యసమితి మాత్రం 200 మంది వరకు మరణించినట్లు తెలిపింది. కానీ మీడియా కథనాల ప్రకారం 600 మంది వరకు ఈ ఊచ కోతలో అసువులు బాసారు. ఇదీ చదవండి: బిగ్‌ టర్న్.. డిప్యూటీ సీఎంల మధ్య సనాతన వార్‌, పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదు..! అయితే ఈ ఉగ్ర దాడిలో ఓ వ్యక్తి మాత్రం ప్రాణాలు కాపాడుకోవడానికి దగ్గరలో ఉన్న ఒక లోయలో దాక్కున్నాడు. ఆయన మీడియాకు వెల్లడించినప్పుడు ఈ ఘోరం బయటపడింది. ఉగ్రవాదులు అక్కడి నుంచి వెళ్లిపోయాక ఎక్కడ చూసినా రక్తం రక్తపు మడుగులో ఉన్న వాడలు భయపడి పోయి అక్కడే కొన్ని గంటలు లోయలోనే ఉండిపోయానని చెప్పాడు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి ఈ మృతదేహాలను వెలికి తీయడానికి, ఖననం చేయడానికి కూడా మూడు రోజుల సమయం పట్టిందట. ఇదీ చదవండి: రేషన్‌, ఆరోగ్యం, పింఛను అన్నింటికీ ఒకటే డిజిటల్‌ కార్డు.. ఎలా పని చేస్తుందంటే? అయితే ముందుగానే ఈ ఊళ్ల పైన మిలిటెంట్ల దాడులు జరుగుతాయని గ్రామాల చుట్టూ కందకాలు ఏర్పాట్లు చేసుకోవాలని అక్కడి మిలిటరీ కూడా ఆదేశించిందట. ఈ క్రమంలోనే ఆగస్టు 24న కందకాల ఏర్పాటుకు గ్రామస్తులు తవ్వకాలు జరపగా వారు సైనికులుగా భావించి ఈ దారుణ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడి తర్వాత బుర్కినా ఫాసో వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చెలరేగాయి. ఇదిలా ఉండగా 2022లో ఇక్కడి పాలన మిలిటరీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది అప్పటి నుంచి ఇలాంటి ఊచ కోతలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గతంలో కూడా మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ 200 మందికి పైగా పౌరులను సైన్యమే కాల్చి చంపింది. ఈ నేపథ్యంలో అటు సైనికులు, మిలిటెంట్ల మధ్య సాధారణ పౌరులు అసువులు బాస్తున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook , Twitter None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.