TELUGU

Hassan Nasrallah: 80వేల కేజీల బాంబులతో దాడి.. సస్రల్లా హతం.. ఒంటిపై చిన్న గాయం లేదు.. మరణం వెనక మిస్టరీ ఏంటి?

Hezbollah chief Hassan Nasrallah: గత 30 సంవత్సరాలుగా ఇజ్రాయిల్ కు కొరకరాని కొయ్యగా మారిన హిజ్బుల్లా చీఫ్ హసన్ నసరల్లా ఎట్టకేలకు హతమైనట్టు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇటీవల లెబనాన్ నగరంలోని బీరూట్ నగరం పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడిలో నసరల్లా 60 అడుగుల లోతులో ఉన్న నేలమాలిగలో దాక్కున్నాడు. అయినప్పటికీ పక్కా సమాచారంతో ఇజ్రాయిల్ జరిపిన బాంబు దాడిలో నసరల్లా హతమయ్యాడు. అయితే ఇజ్రాయిల్ నసరల్లాను హతమార్చడానికి ఏకంగా ఓ భూకంపాన్ని సృష్టించింది. ఇందుకోసం దాదాపు 80 టన్నుల బాంబులను వాడింది. ఈ బాంబు ధాటికి ఆ ప్రదేశంలో రిక్టార్ స్కేలు పై 3.5 పాయింట్ల భూకంపం సైతం వచ్చింది. అయితే ఇక్కడ ఓ మిస్టరీ దాగి ఉంది ఇంత పెద్ద బాంబు దాడిలో నసరల్లా మృతదేహంపై చిన్న గీత కూడా పడలేదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ దాడి జరిగిన సంఘటన అనంతరం నసరల్లా మృతి వెనుక మిస్టరీ దాగి ఉందని ఆయన అసలు నిజంగా చనిపోయారా లేక కుట్రలో భాగమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హిజ్బుల్లా చీఫ్ హసన్ సస్రల్లాను శుక్రవారం ఇజ్రాయెల్ వైమానిక దాడిలో దారుణంగా హతమార్చింది. దాదాపు 30ఏండ్లుగా ఇజ్రాయెల్ కు సవాల్ విరుస్తున్న సస్రల్లాను ఘోరంగా మట్టుబెట్టింది. అత్యంత గోప్యతను పాటించే సస్రల్లాను టార్గెట్ చేసి బీరూట్ పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ దాడిలో ఎట్టకేలకు సస్రల్లా హతమయ్యాడు. ఇప్పుడు అతని మరణం ఇరాన్ మద్దతు కలిగి హిజ్బుల్లా భవిష్యత్తు ఏంటన్న్ ప్రశ్న తలెత్తింది. సస్రల్లాతోపాటు మిలిటరీ చైన్ లోని అత్యంత కీలకమైన కమాండర్లు అందర్నీ ఇజ్రాయెల్ మట్టుబెడుతోంది. ఒక్కొక్కరిగా చంపుకుంటూ వస్తోంది. కాగా సస్రల్లా మరణమే ఇప్పుడు అందరిలోనూ సంచనలమయ్యింది. తన నీడను కూడా బహిరంగ ప్రజానీకానికి తెలియనివ్వని సస్రల్లాకు సంబంధించి అంత ఖచ్చితంగా సమాచారం ఇజ్రాయెల్ ఎలా సేకరించిందనేది ప్రశ్న. బీరూట్ దక్షిణ ప్రాంతంలోని హిజ్బుల్లా సెంట్రల్ హెడ్ క్వార్టర్ లో కీలకమైన సమావేశానికి నస్రల్లా వస్తున్నాడనే సమాచారం కేవలం దాడికి కొన్ని గంటల ముందు మాత్రమే ఇజ్రాయెల్ అధికారులకు చేరినట్లు సమాచారం. దీంతో ఇన్ఫర్మేషన్ ను కన్ఫర్మ్ చేసుకున్న ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడికి దిగింది. Also Read: US Airstrikes On Syria: సిరియా టెర్రరిస్టులపై అమెరికా పంజా..37 మంది హతం 60అడుగుల లోతులో ఉన్న బంకర్ లో సస్రల్లా ఉన్నా కూడా అతన్ని ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఇలా ఎలా సాధ్యం? ఇప్పుడు అందరి మదిలోనూ ఇదే ప్రశ్న తలెత్తుతోంది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతదేహాన్ని ఇప్పుడు బీరుట్‌లో ఇజ్రాయెల్ ఘోరమైన దాడి చేసిన ప్రదేశం నుండి స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. నస్రల్లా శరీరంపై గాయాలు లేవని చెబుతున్నారు. కానీ ఇంత ఘోరమైన ఇజ్రాయెల్ దాడి తర్వాత, అతని శరీరం ఎలా సురక్షితంగా ఉండగలదనే అందరిలోనూ తలెత్తుతున్న ప్రశ్న. శనివారం, హిజ్బుల్లా కూడా తన ప్రకటనలో హసన్ నస్రల్లా మరణించినట్లు ధృవీకరించారు. అయితే నస్రల్లాను ఎలా చంపారనేది కచ్చితంగా తెలియదు. అతని అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయన్న విషయం కూడా వెల్లడించలేదు. అయితే హసన్ నస్రల్లా శరీరంపై గాయాలు లేవని చెబుతున్నారు. బీరుట్‌లోని దక్షిణ శివార్లలో ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగిన ప్రదేశం నుండి హిజ్బుల్లా నాయకుడు సయ్యద్ హసన్ నస్రల్లా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా వర్గాలు ఆదివారం రాయిటర్స్‌కి తెలిపాయి. అతని శరీరం చెక్కుచెదరకుండా ఉంది. అతని శరీరంపై ఎటువంటి ప్రత్యక్ష గాయాలు లేనందున, పేలుడు తర్వాత మొద్దుబారిన గాయం కారణంగా నస్రల్లా మరణించినట్లు తెలుస్తోంది. అయితే, ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసిన ప్రదేశంలో, భూమిలో లోతైన గుంటలు ఉన్నాయి. ఆకాశహర్మ్యాలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. అటువంటి పరిస్థితిలో, అక్కడ నుండి నస్రల్లా మృతదేహాన్ని సురక్షితంగా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మృత దేహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంకా వెల్లడి కాలేదు. Also Read: Israel Hezbollah War: హిజ్బుల్లాకు బిగ్ షాక్.. వైమానిక దాడిలో కీలక నేత నబిల్ కౌక్ హతం స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.