TELUGU

Viral Video: ఫుట్ బాల్ మ్యాచ్ స్టేడియంలో ఘోరం.. 100 మందికి పైగా మృతి.. షాకింగ్ వీడియోలు వైరల్..

Guinea tragedy video viral: పశ్చిమాఫ్రికాదేశం గినియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గినియా మిలిటరీ జుంటానేత మామాడి దౌంబోయ గౌరవార్థం.. జెరెకొరె నగరంలోఫుట్ బాట్ టోర్నమెంట్ జరిగింది. దీంతో ఈ మ్యాచ్ లో రిఫరీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వివాదంగా మారింది. దీంతో ఈ నిర్ణయాన్ని ఒక జట్టు తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో.. అభిమానులు పెద్ద ఎత్తున గ్రౌండ్ కు రావడంతో.. అక్కడ వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత తోపులాటలో గొడవలు చోటు చేసుకున్నాయి. వేలాదిగా అభినులు ఒకరిపై మరోకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ⚠️🔞 WARNING: GRAPHIC 18+ 🔞⚠️ ❗️🇬🇳 - At least 100 people lost their lives in violent clashes between rival fans during a football match in N'zerekore, Guinea. This tragic event, which occurred at the end of a game, resulted in hundreds of fatalities. Medical sources confirmed… pic.twitter.com/xV3COoViUE — 🔥🗞The Informant (@theinformant_x) December 2, 2024 అంతే కాకుండా.. హింసాత్మక వాతావరణం నెలకొంది. అక్కడున్న కర్రలు, రాళ్లతో ఒకరిపై మరోకరు దాడులు చేసుకుంటున్నారు. దీంతో తలలు పగిలిపోయి చాలా మంది ఒకరిపై మరోకరు పడిపోయినట్లు తెలుస్తొంది. అక్కడ స్టేడియం అంతా.. రక్తంసిక్తమయిపోయినట్లు సమాచారం. దీంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ గొడవలకు చెందిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి. Read more: Viral Video: తండ్రిని పెళ్లి చేసుకున్న కూతురు.. సిగ్గు లేకుండా ఏంచెప్తుందో చూడండి.. వీడియో వైరల్.. సెప్టెంబర్ 2021 తిరుగుబాటులో అధికారాన్ని చేజిక్కించుకుని, తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్న గినియా జుంటా నాయకుడు మామాడి డౌంబౌయా గౌరవార్థం ఈ మ్యాచ్ నిర్వహించినట్లు తెలుస్తొంది. మరోవైపు చనిపోయిన వారి సంఖ్య ఇంకా పెరగొచ్చని తెలుస్తొంది. అక్కడి ఆస్పత్రులు అన్ని.. గాయపడిన వారితో.. శవాలతో.. నిండిపోయాయని అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.