TELUGU

Israel Hezbollaha War: పశ్చిమాసియాలో కల్లోలం.. రంగంలోకి అగ్రరాజ్యాలు..? మూడో ప్రపంచ యుద్దం తప్పదా..?

Iran Israel war Israel launches missile attack at Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు అలుముకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇజ్రాయేల్ హెజ్బోల్లా లీడర్ ను హతమార్చినందుకు ఇరాన్ పగతో రగిలిపోతుంది. లెబనాన్ లోని బీరూట్ పట్టణం ఆనవాళ్లు కూడా లేకుండా శవాల దిబ్బలాగా మారిపోయింది. అక్కడ పెద్ద పెద్ద భవానాలన్ని బాంబులు, మిసైల్స్ ల దాడులకు శిథిలాలుగా మారిపోయియి. ఈ నేపథ్యంలో ఇరాన్ ఏమాత్రం వెనక్కు తగ్గుడంలేదని తెలుస్తోంది. మరోవైపు తమ నాయకుడ్ని చంపిన ఇజ్రాయేల్ పైన ఇరాన్ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ దాడుల్ని ఇజ్రాయేల్ ప్రధాని నేతన్యాహు హెచ్చరించారు. ఈ దేశం తప్పుచేసిందని భారీగా మూల్యం చెల్లించుకొవాల్సి ఉంటుందని కూడా తెలిపింది. ఇరాన్ లో అక్కడి దేశాధినేతలు కేవలం యుద్దంపైనే ఎక్కువగా తమ వనరులను ఖర్చుచేస్తున్నారని, ప్రజల గురించి ఆలోచించడంలేదని కూడా నేతన్యాహు చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో.. తమ దేశం జోలికి వచ్చినందుకు ఇరాన్ అదే రీతితో బుద్ది చెబుతామని గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇరాన్ .. ఇజ్రాయేల్ పై చేసిన బాలిస్టిక్ కిపణి దాడి విఫలమైందని వెల్లడించారు. అదే విధంగా మరోవైపు అమెరికా ప్రెసిడెంట్ బైడేన్ సైతం.. ఇజ్రాయేల్ కు అండగా ఉంటున్నట్లు తెలిపింది. మరోవైపు.. ఇజ్రాయేల్ భద్రతకు వాషింగ్టన్ కట్టుబడి ఉంటుందని అమెరికా స్పష్టం చేసింది. ఇజ్రాయేల్ వ్యవహారంలో ఏదేశమైన తలదూరిస్తే... తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ హెచ్చరిచ్చింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయేల్ కు మద్దతుగా నిలిచే దేశాలపైన దాడులు చేస్తామని కూడా ఆర్మీదళాలు ప్రకటించాయి. అయితే.. ఇజ్రాయేల్ కు మద్దతుగా అమెరికా నిలిచిన వేళ.. ఇరాన్ కు అండగా రష్యా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది . ఇదే జరిగితే మాత్రం మూడో ప్రపంచ యుద్దం గ్యారంటీ అని పలు దేశాలుభావిస్తున్నాయి. దీని వల్ల ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని సమాచారం. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఇరాన్.. ఇజ్రాయేల్ పట్టణాలపైన.. జెరూసలేం, టెల్ ఆవీవ్ పట్టణాలపై దాదాపు 180 క్షిపణులతో దాడికి దిగింది. Read more: Hassan Nasrallah: 80వేల కేజీల బాంబులతో దాడి.. సస్రల్లా హతం.. ఒంటిపై చిన్న గాయం లేదు.. మరణం వెనక మిస్టరీ ఏంటి? ఈ ఘటనలో వందలాదిగా అమాయకులుచనిపొయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇజ్రయేల్ సైతం.. హెజ్బుల్లా స్థావరాలే టార్గెట్ గా దాడులు చేస్తుంది. వీరి స్థావరాలుముఖ్యంగా జనావాసాలు, పాఠశాలలకు సమీపంలో ఉన్నట్లు ఇజ్రయేల్ గుర్తించింది.అయిన కూడా వీరి స్థావరాలపై మిసైల్స్ తో భీకర దాడులు చేస్తుంది. అనేక మంది అమాయకులైన పౌరులు, స్కూల్ పిల్లలు, ప్రజలు ఈ దాడుల్లో చనిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ యుద్దం ఎక్కడికి దారితీస్తుందో అని ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.