TELUGU

Pawan Kalyan: ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ ను ఖండించిన జనసేనాని .. బంగ్లా ప్రధాని యూనస్ కు పవన్ వార్నింగ్..

Pawan Kalyan: బంగ్లాదేశ్ లో ఓ పథకం ప్రకారం మైనారిటీలైన హిందువులపై దాడులు జరుగుతున్నాయి. దీని వెనక అక్కడ అమెరికా కన్నుసన్నుల్లో కొలువైన మహ్మద్ యూనస్ ప్రభుత్వం హస్తం ఉందనేది బహిరంగ రహస్యం. మైనారిటీలపై అక్కడ మెజారిటీ వర్గీయులు ముస్లిమ్స్ దాడులకు తెగపడ్డ అక్కడి ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తోంది. తాజాగా అక్కడ ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు బ్రహ్మచారి.. ఓ ర్యాలీలో బంగ్లాదేశ్ జెండాను అవమాన పరిచారంటూ .. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన ఓ నేత కంప్లైంట్ ఆధారంగా అక్టోబర్ 30న బంగ్లా పోలీసులు కృష్ణదాస్ తో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఢాకాలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కృష్ణదాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు నిన్న ఛటోగ్రామ్ లోని ఆరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రిట్ ఎదుట హాజరుపరిచయారు. అయితే కృష్ణదాస్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కాజీ షరీఫుల్ ఇస్లామ్ రిజెక్ట్ చేశారు. Let’s all unite together in condemning the detention of ISKON Bangladesh Priest ‘ Chinmoy Krishna Das’ by Bangladesh police. We urge and plead Bangladesh Govt under Sri Mohammed Yunus to stop atrocities on Hindus. Indian army blood has been spilled , our resources had been… — Pawan Kalyan (@PawanKalyan) November 27, 2024 అయితే.. బంగ్లాదేశ్ కు చెందిన ఇస్కాన్ పూజారి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ ను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. మరోవైపు మరోవైపు కృష్ణదాస్ అరెస్ట్ ను సెక్యులర్ అని చెప్పుకునే ఏ పార్టీ ఖండించక పోవడం విషాదకరం. ఇతర దేశాలతో పాటు మన దేశంలో కూడా హిందువులపై దాడులు జరిగిన ఏ దాడులను మన దగ్గరున్న కుహానా సెక్యులర్ పార్టీలు ఏవి ఖండించిన దాఖలాలు లేవు. కానీ బీజేపీ తరువాత జనసేన పార్టీ .. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించింది. తాజాగా ఇస్కాన్ కృష్ణదాస్ అక్రమ అరెస్ట్ ను జనసేనాని తీవ్రంగా ఖండించారు. అంతేకాదు ఎంతో మంది భారత జవాన్లు రక్తం ధారబోసి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసిన విషయాన్ని తన ట్వీట్ లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా అక్కడ తాత్కాలిక ప్రధాని యూనస్ కు హిందువుల పై జరుగుతున్న అక్రమ అరెస్ట్ లతో పాటు దాడులను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏది ఏమైనా పక్క దేశమైన బంగ్లాదేశ్ లో హిందువులపై అక్కడి మెజారిటీ వర్గాలు చేస్తోన్న దాడులను బహిరంగంగా ఖండించి మరోసారి మెజారిటీ హిందువుల మనసులను చూరగొన్నారు పవన్ కళ్యాణ్. ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్.. ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook , Twitter None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.