TELUGU

Syria Civil War: సిరియాలో జరిగింది ఇదే..! రష్యాకు శరణార్ధిగా అసద్..

Syria Civil War : ఇప్పటికే సిరియాలో అంతర్యుద్ధం ముదిరి పాకానా పడింది. దీంతో అక్కడి పాలకుడైన అసద్ ఫ్యామిలీ పాలనకు ఎండ్ కార్డ్ పడింది. సిరియాలో దాదాపు 55 యేళ్లుగా సాగుతున్న అసద్‌ కుటుంబ పాలనకు తెరపడినట్లైంది. తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్‌లోకి ఎంట్రీ అవ్వటంతో...దేశ అధ్యక్షుడు అయిన బషర్‌ అల్‌-అసద్‌ ఆదివారం తెల్లవారుజామున దేశం విడిచి పారిపోయారు. దాంతో ఆయన ప్రభుత్వం కుప్ప కూలిపోయి.. సిరియా పూర్తిగా తిరుగుబాటుదారుల నియంత్రణలోకి వెళ్లింది. అసద్ నిష్క్రమణతో రాజధాని డమాస్కస్‌ సహా పలు ప్రాంతాల్లో ప్రజలు బయటకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. అసద్ నిరంకుశ పాలన నుంచి తమకు విముక్తి కలిగిందంటూ పెద్ద సంఖ్యలో తిరుగుబాటు దారులు నినాదాలు చేశారు. మరోవైపు- అసద్‌ తన ఫ్యామిలీ సహా రష్యాకు శరణార్థిగా చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన మాస్కోలో ఉన్నారు. ఆయనకు ఇన్నేళ్లు అండగా ఉన్న రష్యా, ఇరాన్‌ తాజా పరిణామాలపై స్పందించాయి. అధికార బదిలీపై తిరుగుబాటుదారులతో చర్చలు ముగిసిన తర్వాతే అసద్‌ సిరియా వీడినట్టు మాస్కో వర్గాలు తెలిపింది. ఇక విదేశీ జోక్యం లేకుండా సిరియన్లే తమ దేశ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని ఇరాన్‌ సూచించింది. అమెరికా అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్‌ ట్రంప్‌ .. రష్యా, ఇరాన్‌ బాగా బలహీనపడ్డాయన్నారు. అసద్‌ను ఆదుకునే పరిస్థితుల్లో మాస్కో లేదని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇదే అదనుగా గోలన్‌ హైట్స్‌ బఫర్‌ జోన్‌ను ఇజ్రాయెల్‌ సైన్యం తన వశం చేసుకుంది. తాజా పరిణామాలపై సిరియా ప్రధానమంత్రి మహమ్మద్‌ ఘాజీ జలాలీ స్పందించారు. ప్రతిపక్షాలకు అధికార బదిలీ చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను స్వదేశంలోనే ఉన్నానన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని తిరుగుబాటుదారులకు విజ్ఞప్తి చేశారు. డమాస్కస్‌లో కాల్పులు జరపొద్దని తమ దళాలను హెచ్‌టీఎస్‌ నేత అబూ మహమ్మద్‌ అల్‌-జులానీ ఆదేశించారు. అధికార బదిలీ జరిగేదాకా ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రధానమంత్రి పర్యవేక్షణలోనే ఉంటాయని చెప్పారు. అసద్‌ వెళ్లిపోయాక డమాస్కస్‌లోని అధ్యక్ష భవనంలోకి జనం భారీగా చొరబడ్డారు. ఆ భవనంలో కలియతిరిగారు. ప్లేట్లు, ఫర్నిచర్‌.. ఇలా చేతికి దొరికింది తీసుకొని వెళ్లారు. పోలీసు అధికారులు, సైనికులు తమ స్థావరాలను విడిచి వెళ్లారు. మరోవైపు- గత కొన్నేళ్లలో లెబనాన్‌కు వలస వెళ్లిన అనేక మంది సిరియన్లు తిరిగి సిరియా బాట పడుతున్నారు. తిరుగుబాటు దళాలతో చర్చల తర్వాతే అసద్‌ సిరియా వీడారు. అధికారాన్ని శాంతియుతంగా బదిలీ చేయడానికి తగు సూచనలు ఇచ్చారని రష్యా తెలిపింది. తిరుగుబాటుదారులతో చర్చల్లో తాము నేరుగా పాల్గొనలేదని తెలిపింది రష్యా. తాజా పరిణామాలతో గోలన్‌ హైట్స్‌లోని బఫర్‌ జోన్‌ నుంచి సిరియా బలగాలు వెనుదిరిగాయి. దాంతో ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ సైన్యం స్వాధీనం చేసుకుంది. ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. 1974లో సిరియాతో కాల్పుల విరమణ ఒప్పందంతో గోలన్‌ హైట్స్‌లో బఫర్‌ జోన్‌ ఏర్పాటైంది. ప్రస్తుతం ఆ ఒప్పందం కథ ముగిసినట్లయింది. గోలన్‌ హైట్స్‌ను ఇజ్రాయెల్‌ 1967లో ఆక్రమించింది. అమెరికా తప్ప అంతర్జాతీయ సమాజమంతా దాన్ని ఆక్రమిత సిరియా భూభాగంగానే పరిగణిస్తుంటుంది. సిరియా 13 ఏళ్లుగా అంతర్యుద్ధంతో సతమతమవుతోంది. అసద్‌ను గద్దె దించేందుకు తిరుగుబాటుదారులు గతంలో ఎన్నోసార్లు ప్రయత్నించి ఏమి చేయలేకపోయారు. దేశవ్యాప్తంగా ఖైదీలందరినీ జైళ్ల నుంచి విడుదల చేసారు. అనంతరం- పలు ప్రాంతాల్లో ప్రజలు, తిరుగుబాటుదారులు అసద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ దేశానికి విముక్తి కలిగిందంటూ సంబరాలు చేసుకున్నారు. అసద్‌ తండ్రి హఫిజ్‌ 1970లో సిరియాలో ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి అధికారంలోకి వచ్చారు. ఆయన మరణానంతరం దేశ పాలనా పగ్గాలను బషర్‌ అసద్‌ అందుకున్నారు. ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.