TELUGU

Walmart Controversy: లోదుస్తులు, బికినీలు, చెప్పులపై వినాయకుడి చిత్రాలు.. వాల్ మార్ట్ పై భగ్గుమంటున్న హిందు సంఘాలు..

Walmart controversy hindu society protest: సాధారణంగా మనదేశంలో భిన్నత్వంలో ఏకత్వంను పాటిస్తుంటారు. మన దేశంలో అనేక మతాలు, ఆచారాలు ఉన్నాయి. ఒకరి మతన్ని, ఆచారాల్ని మరోకరు గౌరవిస్తుంటారు. ఒకరి పండుగలకు మరోకరు వెళ్తుంటారు. ఎక్కడ కూడా, కులాలు, మతాల గురించి దేవీ, దేవతల గురించి వివాదాస్పదంగా మాట్లాకుండా.. చక్కగా సోదర భావంతో కలసి ఉంటారు. This is unacceptable. You can’t demean our Hindu Gods. @Walmart should immediately withdraw ‘Celestial Ganesh Blessings collection’ and apologise to Hindus. 😡😡 pic.twitter.com/KGCcqqObXu — Tathvam-asi (@ssaratht) December 6, 2024 కానీ కొంత మంది మాత్రం.. సోదరుల్లా కలిసి ఉంటున్న వారి మధ్యలో వివాదాలు తలెత్తేలా ప్రవర్తిస్తుంటారు. దీని వల్ల లేని పోనీ వివాదాలు చోటు చేసుకుంటుంటాయి. ఈక్రమంలో.. ప్రస్తుతం వాల్ మార్ట్ సంస్థ ఒక వివాదానికి కేరాఫ్ గా మారిందని చెప్పుకొవచ్చు. ఇప్పటికే బంగ్లాదేశ్ లో హిందు సంఘాలు, హిందు దేవతలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశ వ్యాప్తంగా హిందు సంఘాలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో యూఎస్ కు చెందిన వాల్ మార్ట సంస్థపై హిందు సంఘాలు భగ్గుమంటున్నాయి. వాల్ మార్ట్ సంస్థ..ఆన్ లైన్ లో హిందు సంఘాలు పవిత్రంగా భావించే గణేషుడి చిత్రాలతో ఉన్న డ్రాయర్లు, సాక్స్ లు, బికీనీలు, చెప్పులు ఆన్ లైన్ లో అమ్మకాలు ఉంచినట్లు తెలుస్తొంది. దీనిపై అమెరికాలో కూడా హిందువులు పెద్ద ఎత్తున తమ నిరసనలు తెలియజేశారంట. ప్రస్తుతం బైకాట్ వాల్ మార్ట్ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. దీనిపై వెంటనే హిందు సమాజానికి, దేవతలకు కమాపణ చెప్పాలని డిమాండ్ విన్పిస్తున్నాయి. అదే విధంగా వాల్ మార్ట్ సమస్త హిందువుల మనో భావాల్ని దెబ్బతీసేలా చేసిందని కూడా హిందు సంఘాలు ఫైర్ అవుతున్నాయి. Read more: Viral Video: పెళ్లైన హీరోకు క్యూట్‌గా ప్రపోజ్ చేసిన సమంత.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.. దీనిపైన మాత్రం తీవ్ర స్థాయిలో వివాదం నడుస్తుందని చెప్పుకొవచ్చు. మరికొందరు హిందువుల దేవతలను టార్గెట్ గా చేసుకుని కొందరు కావాలని.. ఇలా చేస్తున్నారని కూడా మండిపడుతున్నారు. అయితే.. వాల్ మార్ట్ సంస్థ ప్రస్తుతానికి ఈ బొమ్మలు ఉన్న వాటిని ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ నుంచి తొలగించిందని సమాచారం. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.