TELUGU

Scholarship: పది పాసైతే చాలు రూ. 12,000 స్కాలర్‌షిప్ పొందవచ్చు.. ఇలా అప్లై చేసుకోండి..!

Tata Pankh Scholarship Scheme: టాటా పంఖ్‌ స్కాలర్షిప్‌ పథకం టాటా క్యాపిటర్‌ వారు ప్రారంభించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం ఈ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు. అలాంటి కుటుంబాలకు చెందిన చదువుపై ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం టాటా పంఖ్ స్కాలర్షిప్‌ స్కీమ్‌ ప్రారంభించారు ఈ పథకం ద్వారా రూ.10,000 నుంచి రూ.12,000 వరకు స్కాలర్‌షిప్‌ పొందవచ్చు. అయితే, ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ అక్టోబర్‌ 15. టాటా పంఖ్ స్కాలర్షిప్‌ పథకం.. టాటా పంఖ్ స్కాలర్షిప్‌ పథకం ప్రధాన ఉద్దశం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు చేయూత అందించడం, వారిని ఆర్థికంగా ఆదుకోవడం. ఈ పథకాన్ని టాటా క్యాపిటల్‌ ప్రారంభించింది. ఈ పథకానికి అర్హులైన విద్యార్థులు రూ.10,000 నుంచి రూ.12,000 (వన్‌ టైం) స్కాలర్షిప్‌ పొందుతారు. పదిపాసైన విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి అందిస్తారు. దీనికి విద్యార్థి కచ్చితంా 11, 12, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌ చేస్తూ ఉన్నవారు అర్హులు. అర్హత.. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు భారతీయ పౌరుడై ఉండాలి. దరఖాస్తుదారుడు 11, 12 గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇనిస్టిట్యూట్‌ విద్యార్థి అయి ఉండాలి. అతని ముందు క్లాసులో కచ్చితంగా 60 శాతం మార్కులు కనీసం పొంది ఉండాలి. కుటుంబ ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉండాలి. కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. కావాల్సిన పత్రాలు.. ఆధార్‌ కార్డు, ఐడెంటిటీ సర్టిఫికేట్‌, ఆదాయ సర్టిఫికేట్‌, వయస్సు ధృవీకరణ పత్రం, మార్క్‌ షీట్‌, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌ పోర్ట్‌ సైజ్‌ ఫోటో, మొబైల్‌ నంబర్‌, సిగ్నేచర్‌, ఇమెయిల్‌ ఐడీ. దరఖాస్తు చేసుకునే విధానం.. టాటా పంఖ్‌ స్కాలర్షిప్‌ యోజనకు మీరు కూడా దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్లో వివరాలు చదివి ఆ తర్వాత అప్లై చేసుకోవాలి. వెబ్‌సైట్‌ లింక్‌పై క్లిక్‌ చేస్తే అప్లికేషన్‌ ఓపెన్‌ అవుతుంది. అక్కడ మీ వివరాలు నమోదు చేయాలి. కావాల్సిన డాక్యుమెంట్లను స్కాన్‌ చేసి అప్లోడ్‌ చేయాల్సి ఉంటుంది. చివరగా సబ్మిట్‌ బట్టన్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత ఓ ప్రింట్‌ అవుట్‌ తీసి పెట్టుకోవాలి. ఇదీ చదవండి: ప్రభుత్వం భారీ‌ గుడ్‌న్యూస్‌.. టీచర్ల జీతం మూడురెట్ల పెంపు..! టాటా క్యాపిటల్‌ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల లక్ష్యాలను సాధించడానికి, సమాజ సానుకూ సహకారానికి మరింత శక్తి అందించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఎంపిక ప్రక్రియ.. టాటా క్యాపిటల్‌ పంఖ్ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2024-25 దరఖాస్తు చేసుకున్నవారిని మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ వివిధ దశలలో ఉంటుంది. అకడమిక్‌, విద్యార్థి ఆర్థిక పరిస్థితులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ చేస్తారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.