TELUGU

AP Rains Red Alert Areas: ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్.. స్కూల్లకు సైతం సెలవు..!

AP Rains Update : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు తుఫాను హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ కేంద్రం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం ఉదయం పశ్చిమ వాయువ్య దిశగా.. పయనించి, అటు దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై తీవ్ర అల్పపీడనంగా మారడం గమనార్హం. ముఖ్యంగా ఈ లోతైన అల్పపీడనం పశ్చిమ వాయువ్యదిశలో ప్రయాణించి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మరింత బలపడింది. ఇక పశ్చిమ వాయువ్య దిశలో ఆ అల్పపీడనం కదులుతూ ఈశాన్య, పుదుచ్చేరి , దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ తీరాల వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా ఆంధ్రప్రదేశ్ అలర్ట్ అయింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హోం మంత్రి వంగలపూడి అనిత విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం చేసి ప్రజలను అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకి రాకూడదని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తిరుపతి , చిత్తూరు, కర్నూలు, ఒంగోలు, నంద్యాల, కడప జిల్లాలలో ఇప్పటికే గంటకు వర్షపాతాన్ని నమోదు చేస్తూ తెలుసుకుంటున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకునేలా జాగ్రత్తలు వహిస్తున్నారు. ప్రత్యేకించి వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో తిరుపతి , చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ విధించింది. ఇక ఒక్క రోజులోనే 20 సెంటీమీటర్ల వర్షం పడవచ్చని అంచనాలు వేస్తున్నారు. ప్రత్యేక బృందాలతో అధికారులు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇకపోతే రెడ్ అలర్ట్ విధించిన నేపథ్యంలో అతి భారీ వర్షాల కారణంగా కొన్ని జిల్లాలకు కలెక్టర్లు సెలవులు కూడా ప్రకటించారు. ఈరోజు, రేపు నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్య సాయి, చిత్తూరు , తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలలో ఈరోజు రేపు సెలవులు ప్రకటించడం జరిగింది.. ఇక మరోవైపు వైయస్సార్, ప్రకాశం జిల్లాలలో కూడా నేడు, రేపు స్కూళ్లు , కాలేజీలు మూసివేయాలని ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఇక పిల్లలు, పెద్దలు ఇంట్లోనే ఉండాలని కూడా సూచించింది. Also Read: Ticket Price: సినిమా టికెట్‌ ధరలపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ సంచలన ప్రకటన Also Read: ED Attaches: నైపుణ్యాభివృద్ధి కుంభకోణంలో చంద్రబాబుకు గట్టి షాకిచ్చిన ప్రధాని మోదీ స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook , Twitter None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.