TELUGU

Tirumala: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. శ్రీవారి మెట్ల మార్గం మూసివేత

Srivari Steps Close: అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ వరద ముప్పు పొంచి ఉంది. ఈ ప్రభావంతో తిరుమల కొండపై కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వర్షాలతో కొండ చరియలు విరిగిపడుతుండడం.. చెట్లు కూలుతుండడంతో భక్తుల భద్రత దృష్ట్యా మెట్ల మార్గం మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. Also Read: Flash Flood Warning: ఏపీలోని ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, పొరపాటున కూడా బయటకు రావద్దు భారీ వర్షాల కారణంగా తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్ల నడక మార్గాన్ని గురువారం వరకు మూసివేయాలని టీటీడీ నిర్ణయించింది. పాప వినాశనం, శిలా తోరణం మార్గాలను కూడా మూసి వేస్తూ ప్రకటన విడుదల చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో టీటీడీ ఈఓ శ్యామలరావు బుధవారం అధికారులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తిరుమలలో వర్షాల పరిస్థితిపై సమీక్షించారు. విపత్తుల నిర్వహణ ప్రణాళికపై అధికారులతో చర్చించి కొన్ని సూచనలు చేశారు. భారీ వర్షాల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. Also Read: AP Rains Red Alert Areas: ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్.. స్కూల్లకు సైతం సెలవు..! అనంతరం ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగానికి చెప్పారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలని సూచించారు. కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచి ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా జనరేటర్ల కోసం డీజిల్‌ను అందుబాటులో ఉంచుకోవాలని విద్యుత్‌ శాఖకు ఈవో శ్యామలరావు సూచించారు. ఐటీ వింగ్ భక్తుల దర్శనాలు, వసతి, ప్రసాదం వంటి కార్యాకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. అంబులెన్సులను అందుబాటులో ఉంచి వైద్యపరమైన సేవలకు అందుబాటులో ఉండాలని వైద్య సిబ్బందికి తెలిపారు. ఇంజనీరింగ్ విభాగం డ్యామ్ గేట్ల పర్యవేక్షణ, ఘాట్ రోడ్లలో జేసీబీలను సిద్ధంగా ఉంచాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులకు ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులు ఇంజినీరింగ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పని చేయాలన్నారు. అయితే వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా టీటీడీ మెట్ల మార్గం, శిలాతోరణం, పాప వినాశనం వంటివి పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.