TELUGU

AP Cabinet: ప్రపంచపటంలో ఏపీని నిలబెట్టడమే లక్ష్యం.. సీఎం చంద్రబాబు 'ఆరు విధానాలు' ఆరు అస్త్రాలు

AP Cabinet Decisions: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆరు విధానాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. థింక్‌ గ్లోబల్లీ.. యాక్ట్‌ గ్లోబల్లీ నినాదంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ఎలక్ట్రానిక్స్‌, పారిశ్రామిక, క్లీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ ఎనర్జీ పాలసీలు తొసుకొచ్చినట్లు వివరించారు. వాటితోపాటు పర్యాటక, ఐటీ, వర్చువల్‌ వర్కింగ్‌ పాలసీలు కూడా తీసుకువస్తున్నట్లు తెలిపారు. Also Read: Tirumala: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. శ్రీవారి మెట్ల మార్గం మూసివేత అమరావతిలోని సచివాలయంలో బుధవారం మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. మంత్రివర్గంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కూలంకషంగా చర్చ జరగ్గా.. కొన్ని విషయాల్లో సీఎం చంద్రబాబు మంత్రులకు కొన్ని సూచనలు ఇచ్చారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు కొన్ని గంటల పాటు మంత్రిమండలి నిర్ణయాలను వివరించారు. ఈ సందర్భం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా డ్రగ్స్‌, గంజాయిపై ఉక్కుపాదం తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. మంత్రివర్గంలో చెత్త పన్ను రద్దుపై నిర్ణయం తీసుకోవడం విశేషం. Also Read: AP Cabinet: దీపావళి ధమాకా.. గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలు.. గంజాయి, డ్రగ్స్ నివారణ కోసం ఐదుగురి మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నివారిస్తామని చెప్పారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మా పార్టీ వాళ్లు అయినా కూడా నేరాలకు పాల్పడితే.. వదిలి పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గంజాయి తాగి తిరిగితే అదే రోజు సంఘ బహిష్కరణ చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ధరల నియంత్రణ కోసం నలుగురి మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 'చెత్త మీద పన్ను.. కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. చెత్త మీద పన్ను తీసేశాం. ఉచిత ఇసుక సరఫరాలో ఎలాంటి రాజకీయం ఉండకూడదు అని మా మంత్రులకు కూడా హెచ్చరించా' అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మంత్రిమండలి ఆమోదం పొందిన ఆరు విధానాలు ఇవే.. మంత్రిమండలి నిర్ణయాలు ఇవే! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.