TELUGU

Chandrababu Naidu: చంద్రబాబుకు NSG కమాండోల భద్రత కట్..!

Chandrababu Naidu: కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం.. తన కూటమిలోని రెండో పెద్ద పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భద్రతను కుదించాలనే నిర్ణయం తీసుకున్నారా అంటే ఔననే అంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. ఆయనకు భద్రత కల్పిస్తోన్న ఎన్‌ఎస్‌జీ భద్రతను కేంద్రం తొలగించనుందని సమాచారం. ఆ స్థానంలో సీఆర్‌పీఎఫ్‌కు అప్పగించనున్నారని తెలుస్తోంది. కేంద్రం VIP సెక్యూరిటీ విధుల నుంచి కౌంటర్ టెర్రరిస్ట్ కమండో ఫోర్స్‌గా ఉన్న NSG నీ దశలవారీగా ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. NSG స్థానంలో వీఐపీల సెక్యూరిటీ బాధ్యతల్ని సీఆర్‌పీఎఫ్‌ కు అప్పగించనుంది కేంద్రం. వచ్చే రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటోంది. కేంద్ర నిర్ణయంతో తొమ్మిది మంది జడ్-ప్లస్ కేటగిరి వీఐపీలకు ఇస్తున్న NSG భద్రతను ఇక నుంచి CRPF నిర్వర్తించనుంది. మరోవైపు చంద్రబాబు నాయుడు విషయానికొస్తే.. విభజిత ఆంధ్ర ప్రదేశ్ కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు రెండు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. అంతేకాదు రెండు ఉభయ రాష్ట్రాల్లో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా.. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు రికార్డులు క్రియేట్ చేసారు. విభజిత ఆంధ్ర ప్రదేశ్ కు 2014 నుంచి 2019 వరకు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన చంద్రబాబు నాయుడు.. 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలతో కూటమిగా పోటీ చేసి నాల్గోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. చంద్రబాబు నాయుడు బీజేపీతో ఇప్పటికే నాలుగు సార్లు జట్టుకట్టి .. మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మొత్తంగా చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడంలో బీజేపీ పాత్ర ఉందని ఆయన రాజకీయ విశ్లేషకులు చెబుతారు. ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్.. ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.