TELUGU

IAS Officers: ఐఏఎస్‌లకు దెబ్బ మీద దెబ్బ.. ఏపీకి వెళ్లాల్సిందేనని చెప్పిన హైకోర్టు

IAS Officers High Court: తమ కేడర్‌ రాష్ట్రానికి వెళ్లేందుకు ససేమిరా అంటున్న ఐఏఎస్‌ అధికారులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మరోసారి ఆ అధికారులకు భారీ షాక్‌ తగిలింది. క్యాట్‌ ఇచ్చిన తీర్పుపై హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా భంగపాటు తప్పలేదు. తెలంగాణ హైకోర్టు కూడా వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది. ఇలాంటి విషయాల్లో తాము జోకయం చేసుకోలేమని తేల్చి చెప్పింది. దీంతో అధికారులకు న్యాయస్థానంలోనూ ఊరట లభించలేదు. అన్ని మార్గాలు మూసుకుపోవడంతో విధిలేక ఆంధ్రప్రదేశ్‌లో వారు రిపోర్టు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. Also Read: IAS Officers: ఆమ్రపాలితో సహా ఆ ఐఏఎస్‌లకు భారీ షాక్‌.. మొట్టికాయలు వేసిన క్యాట్‌ క్యాట్ తీర్పును వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. సివిల్ సర్వెంట్ల నియామకాలను కోర్టులు నిర్ధారించలేవని జడ్జి పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారుల అయినంత మాత్రాన స్టే ఇవ్వలేమని కుండబద్దలు కొట్టింది. ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ముగింపు ఉండదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ముందు వెళ్లి ఎక్కడివాళ్లు అక్కడ రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే క్యాట్ తీర్పు ప్రకారం బుధవారం ఏపీలో తెలంగాణ అధికారులు రిపోర్ట్ చేయాల్సి ఉంది. Also Read: AP Cadre IAS: ఆంధ్రప్రదేశ్‌కు మేం వెళ్లలేం.. మళ్లీ కోర్టును ఆశ్రయించిన ఐఏఎస్‌లు ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, రోనాల్డ్‌ రోస్‌ను ఈనెల 16వ తేదీలోపు ఏపీకి తిరిగి వెళ్లాలని డీఓపీటీ ఆదేశించగా.. దానిపై ఆ అధికారులు క్యాట్‌లో పిటిషన్‌ వేశారు. క్యాట్‌లో వారికి ఎదురుదెబ్బ తగలిన విషయం తెలిసిందే. వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్‌ చేయాలని కాట ఆమ్రపాలితో సహా ఐఏఎస్‌ అధికారులను ఆదేశించింది. అయితే క్యాట్‌ తీర్పుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేయగా.. దానికి న్యాయస్థానం అంగీకరించలేదు. కొంత మందలిస్తూనే వెంటనే ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఎక్కడికి వెళ్లినా కూడా ఎదురుదెబ్బలు తగులుతుండడంతో ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారులు గందరగోళంలో పడ్డారు. తెలంగాణలోనే ఉండాలని పట్టుబడుతుండగా ఎక్కడా చిన్న ఊరట కూడా లభించడం లేదు. ముందు వెళ్లి రిపోర్ట్‌ చేయాలని హైకోర్టు తెలిపింది. అయితే ఐఏఎస్ అధికారులను రిలీవ్ చేయడానికి రెండూ రాష్ట్రాలు కొంత గడువును కోరాయి. 10-15 రోజుల సమయం గడువు కావాలని ఏపీ, తెలంగాణ అభ్యర్థించాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.