TELUGU

Vettaiyan Tickets: రజినీకాంత్ ‘వేట్టయ్యన్’ కు ప్రేక్షకులు దిమ్మ దిరిగే షాక్.. దెబ్బకు టికెట్స్ రేట్స్ తగ్గింపు..

Vettaiyan Tickets rates cut down : సూపర్ స్టార్ రజినీకాంత్ లాస్ట్ ఇయర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేసిన ‘జైలర్’ చిత్రంతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. తన ఏజ్ కు తగ్గ పాత్రలో ఎంతో ఫెరోషియస్ గా నటించి మెప్పించాడు. తప్పు చేస్తే కుమారుడైన చంపే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజినీకాంత్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టింది. పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత తన కూతురు దర్శకత్వంలో ‘లాల్ సలాం’ సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను రంజింప చేయడంలో విఫలమైంది. తాజాగా ఇపుడు‘వేటయ్యన్’ సినిమాతో పలకరించారు. టీజే జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ వచ్చినా..అది ప్రేక్షకులను థియేటర్స్ కు వచ్చేంతగా రాలేదు. దీంతో అనుకున్నంత రేంజ్ లో ఈ సినిమాకు కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. మరోవైపు టికెట్స్ రేట్స్ ఎక్కువ ఉండటం కారణంగా చాలా మంది ప్రేక్షకులు ఓటీటీలో వస్తే చూద్దాంలే అని లైట్ తీసుకున్నారు. మరోవైపు దసరా సెలవులు ముగియడంతో దెబ్బకు ఈ సినిమా టికెట్ రేట్స్ తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. మల్టీ ప్లెక్సుల్లో రూ. 200, సిటీ సింగిల్ స్క్రీన్‌లలో రూ. 150, డిస్ట్రిక్ట్ సింగిల్ థియేటర్లలో రూ. 110గా టికెట్ రేట్లను ఫిక్స్ చేశారు. ఈ రేట్లు రేపటి నుంచి (అక్టోబర్ 18) నుంచి అందుబాటులోకి రానున్నాయి. మరి తగ్గించిన రేట్లతో ఈ సినిమాకు కలెక్షన్స్ పెరుగతాయా అనేది చూడాలి. ఈ సినిమా ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏరియా వైజ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. తమిళనాడు - రూ. 80.95 కోట్లు.. తెలుగు రాష్ట్రాలు - రూ. 17.30 కోట్లు.. కర్ణాటక - రూ. 19.30 కోట్లు.. కేరళ రూ. 13.80 కోట్లు.. రెస్ట్ ఆఫ్ భారత్ - రూ. 4.80 కోట్లు.. ఓవర్సీస్ - రూ. 68.45 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 204 కోట్ల గ్రాస్ (రూ.100 కోట్ల షేర్) తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 9.10 కోట్ల షేర్ (రూ. 18 కోట్ల గ్రాస్)మొత్తంగా రూ. 18 కోట్ల టార్గెట్ కు సగం మాత్రమే రికవరీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా నడుస్తుందనే నమ్మకం కూడా లేదు. అందుకే టికెట్ రేట్స్ తగ్గిస్తే వస్తారనేది దింపుడు కళ్లెం ఆశ. తమిళనాడు లో కూడా ఈ సినిమా కోలుకోవడం కష్టమే. రజినీకాంత్ వరుసగా రెండో ఫ్లాప్.ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా మరో రూ. 62 కోట్లు అందుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా రజినీకాంత్ ఈ సినిమా మరో చేదు జ్ఞాపకాన్ని మిగిల్చిందనే చెప్పాలి. ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్.. ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.