TELUGU

KTR Group 1 Aspirants: అర్ధరాత్రి గ్రూప్‌ 1 అభ్యర్థుల మొర.. వస్తున్నా అంటూ కేటీఆర్‌ ట్వీట్

Group 1 Aspirants Protest: తమ ఉద్యోగాల విషయంలో తమకు మద్దతు తెలపాలని గ్రూప్‌ 1 అభ్యర్థులు అర్ధరాత్రి కోరగా.. వస్తున్నా.. మిమ్మల్ని కలుస్తున్నా అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ మాట ఇచ్చారు. తమకు మీ మద్దతు కావాలని కోరిన గ్రూప్స్ 1 అభ్యర్థుల అభ్యర్థన మేరకు వారిని కలుస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు 'ఎక్స్‌'లో అభ్యర్థుల విజ్ఞప్తికి స్పందించి రిప్లయ్‌ ఇచ్చారు. గ్రూప్‌ 1 పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ అర్ధరాత్రి హైదరాబాద్‌లోని అశోక్‌ నగర్‌ చౌరస్తాలో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టడంతో పోలీసులు అత్యంత కర్కశంగా అరెస్ట్‌ చేశారు. Also Read: IAS Officers: ఐఏఎస్‌లకు దెబ్బ మీద దెబ్బ.. ఏపీకి వెళ్లాల్సిందేనని చెప్పిన హైకోర్టు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా గ్రూప్స్ అభ్యర్థులు అనే ఎక్స్‌ అకౌంట్‌ నుంచి కేటీఆర్‌కు ఓ సందేశం పంపారు. 'మమ్మల్ని క్షమించాలి. మీరు అశోక్ నగర్ రావాలి, మాకు మీ మద్దతు అవసరం ఉంది. అన్ని వ్యవస్థలు మాకు అన్యాయం చేస్తున్నాయి. మీ మద్దతు ఉంటే మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. గ్రూప్ 1 అభ్యర్థులంతా ఏకతాటిపైకి వచ్చి మీకు సర్వదా రుణపడి ఉంటాం' అంటూ గ్రూప్‌ 1 అభ్యర్థులు ట్వీట్ చేశారు. Also Read: Netizen Arrest: కొండా సురేఖనా మజాకా.. 'తులం బంగారం' ఏమైందని నిలదీస్తే అరెస్ట్‌ ఈ ట్వీట్‌కి కేటీఆర్‌ స్పందించారు. 'రేపు మిమ్మల్ని కలుస్తాను. అశోక్ నగర్ వేదికగా అయినా.. లేదా తెలంగాణ భవన్‌లో అయినా సరే మిమ్మల్ని కలుస్తా' అంటూ కేటీఆర్ రిప్లయ్‌ ఇచ్చారు. 'భారత రాష్ట్ర సమితి పార్టీ మీ అందరికీ న్యాయం జరిగేలా చూస్తుంది' అని భరోసా ఇచ్చారు. అది చెబుతూనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేశారు. నేరుగా రాహుల్‌ గాంధీని ట్యాగ్‌ చేస్తూ కేటీఆర్‌ విమర్శించారు. 'ఒక్క సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని తెలంగాణ యువతకు తెలంగాణ సమాజానికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాం' అని కేటీఆర్ అన్నారు. అయితే కేటీఆర్‌ను అభ్యర్థులు ఎక్కడ? ఎప్పుడు? కలుస్తారనేది మాత్రం ఉత్కంఠ ఏర్పడింది. పోలీసులు అభ్యర్థులను నిర్బంధిస్తారని.. ముందస్తు అరెస్ట్‌లు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. మరి గురువారం ఏం జరుగుతుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్‌కు ట్వీట్‌ చేసిన అనంతరం గ్రూప్‌ 1 అభ్యర్థులు బుధవారం రాత్రి ఆందోళన చేపట్టారు. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య అశోక్‌ నగర్‌ చౌరస్తాలో గ్రూప్‌ 1 అభ్యర్థులు అకస్మాత్తగా ధర్నా చేపట్టారు. అశోక్‌నగర్‌ గ్రంథాలయం నుంచి చౌరస్తాకు చేరుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకుని వారిని నిలువరించారు. కొద్దిసేపు ఒక చోట ఆగి అభ్యర్థులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అయితే ఆందోళన చేపట్టేందుకు అభ్యర్థులు తరలివస్తుండడం... సంఖ్య పెరిగిపోతుండడంతో పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు అనుచితంగా ప్రవర్తించి అభ్యర్థులను రోడ్లపైకి లాకెళ్లారు. Will meet you tomorrow either at Ashok Nagar or at Telangana Bhavan BRS party will make sure that you will get justice And we will continue to remind the Telangana youth on how the Congress led by @RahulGandhi cheated you with the promise of 2 Lakh Govt jobs within 1 year — KTR (@KTRBRS) October 16, 2024 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.