TELUGU

AP school Holidays Today:ఆ జిల్లాల్లో కొనసాగుతున్న వర్షాలు.. వాయిదా పడ్డ పరీక్షలు..!

AP Rains Live Update : బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన కారణంగా ఈరోజు చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి - నెల్లూరు మధ్య తీరం దాటనున్న వాయుగుండం కారణంగా పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.. దీంతో పలు జిల్లాలలో నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. కొన్ని రోజుల క్రిందట తెలంగాణలోని ఖమ్మం, ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఆకస్మిక వరదలు, భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక ఇప్పుడు తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటుతుండడంతో గురువారం రోజు ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది అని విపత్తుల నిర్వహణ కేంద్రం తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలోని కొన్ని జిల్లాలలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం కూడా ఉంది అని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో పొట్టి శ్రీరాములు జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు కురస్థాయని రెడ్ అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జిల్లాలలో వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి. అధిక వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయం తలెత్తనుంది. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో రోడ్డు మార్గం కూడా దెబ్బతిని అటు రవాణా సౌకర్యాలకు అంతరాయం కలిగిస్తోంది. భారీగా పంట, ఆస్తి నష్టం కూడా ఏర్పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. అధికారులు వీరితోపాటు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే అకాల వర్షాల కారణంగా ఆచార్య , నాగార్జున యూనివర్సిటీలో గురువారం నుంచి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయడం జరిగింది. తుఫాను కారణంగా దూర విద్యా కేంద్రం పరీక్షలు కాస్త వాయిదా పడ్డాయి. నెల్లూరు, ప్రకాశం, శ్రీ సత్య సాయి, అనంతపురం, తిరుపతి ,అన్నమయ్య ,చిత్తూరు జిల్లాలలో నేడు అన్ని విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవు కూడా ప్రకటించారు. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. అటు తెలంగాణలో నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల , భద్రాద్రి కొత్తగూడెం , నల్గొండ , ఖమ్మం, ములుగు, సూర్యాపేట, వరంగల్, మహబూబ్, హనుమకొండ , జనగాం, సిద్దిపేట , సంగారెడ్డి తోపాటు పలు ప్రాంతాలలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం. Also Read: AP Cabinet: దీపావళి ధమాకా.. గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలు.. Also Read: Tirumala: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. శ్రీవారి మెట్ల మార్గం మూసివేత స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.