TELUGU

Puri Jagannath: మరో ప్రయోగంతో పూరీ జగన్నాథ్…పెద్ద అయోమయంలో పడిపోయిన అక్కినేని హీరో..!

Akhil Akkineni : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ పదేళ్ల కాలంలో ఎన్నో సినిమాలు చేశారు. అయితే ఈ మధ్యకాలంలో ఫ్లాప్ లు ఎక్కువగా చవిచూస్తున్నారు. ఒకప్పుడు వరుస విజయాలతో సక్సెస్ బాట పట్టిన పూరీ జగన్నాథ్ అనుకోకుండా ఫ్లాప్ లు ఎదురవడంతో ఆయన అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. పూరీ జగన్నాథ్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలంటే పడి చచ్చేవారు చాలామంది ఉన్నారు. అయితే ఇటీవల ఆయన నటించిన సినిమాలు ఎందుకో మరి పెద్దగా సక్సెస్ ను అందుకోలేకపోతున్నాయి. పాన్ ఇండియా హీరోగా విజయ్ దేవరకొండను పరిచయం చేస్తూ తెరకెక్కిన లైగర్ సినిమా ఏ రేంజ్ లో డిజాస్టర్ గా మారిందో చెప్పాల్సిన పనిలేదు. మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ అంటూ రామ్ తో పూరి సినిమా చేశారు. ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఇప్పుడు మరో సినిమాకు సిద్ధమవుతున్నారు పూరి జగన్నాథ్. టాలీవుడ్ లో వరస ప్లాపులు ఎదుర్కొంటున్న అక్కినేని హీరో అఖిల్ తో.. పూరీ సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటిలాగే ఈ సినిమాను కూడా పూరి కనెక్ట్ బ్యానర్ లో ఛార్మీ తో కలిసి పూరీ నిర్మిస్తారా అని తెలియాల్సి ఉంది. ఆర్థికంగా ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పూరీ జగన్నాథ్ కి ఇప్పుడు నిర్మాణం కూడా అవసరమా అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఆయన మాత్రం తన సినిమాకు నిర్మాత తానైతేనే న్యాయం జరుగుతుందని, కావలసిన బడ్జెట్ ను తాను పెట్టుకుంటాను అని అనుకుంటున్నారు. మరికొంతమంది పూరీపై చాలామంది నిర్మాతలు నమ్మకం ఉంచి నిర్మించడానికి ముందుకు వచ్చినా.. వారిని రిస్క్ లో పెట్టడం ఎందుకని ఆలోచించి ,తన సినిమాలకు తానే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే ఇప్పుడు డిజాస్టర్ హీరో అఖిల్ తో ప్రయోగం చేయడానికి సిద్ధమయ్యారు పూరి జగన్నాథ్. గతంలో విజయ్ దేవరకొండ తో ప్రయోగం చేసి ఫెయిల్యూర్ గా.. నిలిచి ఆయన కెరియర్ కి కూడా కాస్త బ్రేక్ పడేలా చేశాడు.. ఇప్పుడు మరో హీరో అంటే ఇంకా అఖిల్ ఏ లెవెల్ లో బలవుతాడో అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా పూరి మళ్లీ తనను తాను నిరూపించుకోవాలని.. అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇదీ చదవండి: Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే.. ఇదీ చదవండి: Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook , Twitter None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.